రైల్వే మంత్రిత్వ శాఖ

భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య స్నేహ బంధం పునరుద్ధరణ


భారత రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు బంగ్లాదేశ్ రైల్వే మంత్రి ఎం.డి. నూరుల్ ఇస్లాం సుజన్ మితాలి ఎక్స్‌ప్రెస్‌ను సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు

“ఈ స్నేహాన్ని పెంచడంలో, ఈ బంధాన్ని బలోపేతం చేయడంలో, ఈ సంబంధాన్ని మెరుగుపరచడంలో మితాలి ఎక్స్‌ప్రెస్ మరో మైలురాయి అవుతుంది”: శ్రీ అశ్విని వైష్ణవ్

మితాలి ఎక్స్‌ప్రెస్ సరిహద్దుకు ఇరువైపులా పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది

Posted On: 01 JUN 2022 1:04PM by PIB Hyderabad

 భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య రైలు ద్వారా ప్రజలకు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి అనేక సమావేశాల తర్వాత, ఇటీవల పునరుద్ధరించబడిన హల్దిబారి-చిలహతి రైలు లింక్ ద్వారా కొత్త ప్యాసింజర్ రైలు సర్వీస్ మితాలి ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని భారత్ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాలు నిర్ణయించాయి. న్యూ జల్పైగురి (భారత్) - ఢాకా (బంగ్లాదేశ్) మధ్య మూడవ ప్యాసింజర్ రైలు సర్వీస్‌ను 2021 మార్చి 27న ఇద్దరు ప్రధానమంత్రులు వర్చువల్‌గా ప్రారంభించారు. గౌరవనీయులైన రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ బంగ్లాదేశ్ రైల్వే మంత్రి ఎండీ నూరుల్ ఇస్లాం సుజన్ లు రైల్ భవన్, న్యూఢిల్లీ నుండి ఈరోజు (అంటే 1 జూన్, 2022) వర్చువల్‌గా ప్రారంభించారు. గతంలో కోవిడ్ మహమ్మారి పరిమితుల కారణంగా ఈ రైలును ప్రారంభించలేదు.


ఈ సందర్భంగా శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ స్నేహబంధాన్ని పెంచడంలో, బంధాన్ని బలోపేతం చేయడంలో, బంధాన్ని మరింత మెరుగుపరచుకోవడంలో మితాలి ఎక్స్‌ప్రెస్ మరో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం వేగవంతం చేయబడింది. రెండు రైల్వేల మధ్య చాలా సహకార ప్రయత్నాలు జరిగాయి. ఇది చాలా అనుకూలమైన క్షణం; రెండు దేశాల మధ్య మన సంబంధాన్ని సుస్థిరం చేసుకోవడానికి మనం పెద్ద అడుగులు వేయాల్సిన తరుణం" అని తెలిపారు.

మితాలి ఎక్స్‌ప్రెస్ రైలు వారానికోసారి నడుస్తుంది (ఉదా. న్యూ జల్‌పైగురిలో ఆదివారం మరియు బుధవారాల్లో 11:45 గంటలకు బయల్దేరి ఢాకాకు 22:30 గంటలకు చేరుకుంటుంది మరియు ఢాకాలో సోమ మరియు గురువారాల్లో 21:50 గంటలకు బయల్దేరి 07:15 గంటలకు న్యూ జల్‌పైగురికి చేరుకుంటుంది. ) మరియు న్యూ జల్పైగురి నుండి ఢాకా వరకు 595 కి.మీల దూరాన్ని కవర్ చేస్తుంది (వీటిలో 61 కి.మీ.లు భారత భాగం). ఇండియన్ రైల్వేస్ ఎల్‌హెచ్‌బి కోచ్ (మైత్రీ ఎక్స్‌ప్రెస్ మరియు బంధన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఉపయోగించినట్లుగా) 4 ఫస్ట్ ఏసీ, 4 ఏసీ చైర్ కార్ మరియు 2 పవర్ కార్లను కలిగి ఉంటుంది. ఇందులో ఏసీ ఫస్ట్ (క్యాబిన్) స్లీపర్, ఏసీ ఫస్ట్ (క్యాబిన్) సీటు మరియు ఏసీ చైర్ కార్ వంటి మూడు తరగతులు ఉంటాయి. వాటి ధర వరుసగా యూఎస్‌డి 44, యూఎస్‌డి 33 మరియు యూఎస్‌డి 22 ఉంటుంది.

అదనపు కొత్త ప్యాసింజర్ సర్వీస్ మితాలి ఎక్స్‌ప్రెస్ బంగ్లాదేశ్‌ను ఉత్తర బెంగాల్‌తో పాటు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని కలుపుతున్నందున రెండు దేశాల పర్యాటకానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ రైలు ద్వారా బంగ్లాదేశ్ పౌరులకు నేపాల్ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

ఈ కొత్త రైలు ప్రస్తుతం ఉన్న రెండు ప్యాసింజర్ రైలు సర్వీసులకు అదనంగా ఉంది. అవి కోల్‌కతా-ఢాకా-కోల్‌కతా మైత్రీ ఎక్స్‌ప్రెస్ (వారంలో ఐదు రోజులు) మరియు కోల్‌కతా-ఖుల్నా-కోల్‌కతా బంధన్ ఎక్స్‌ప్రెస్ (వారంలో రెండు రోజులు) కోవిడ్ మహమ్మారి పరిమితుల కారణంగా నిలిపివేయబడిన పై రెండు రైళ్ల సర్వీసులు 29 మే, 2022 నుండి పునరుద్దరించబడ్డాయి.

 

మితాలి ఎక్స్‌ప్రెస్ టైమ్ టేబుల్:

13132 న్యూ జల్పాయిగురి-

ఢాకా కంటోన్మెంట్

మితాలి ఎక్స్ ప్రెస్ (బై-వీక్లీ)

స్టేషన్

13131 ఢాకా కంటోన్మెంట్- న్యూ జల్పాయిగురి మితాలి ఎక్స్‌ప్రెస్ (బై-వీక్లీ)

రాక

నిష్క్రమణ

 

రాక

నిష్క్రమణ

….

11.45 (ఐఎస్‌టి)

న్యూ జల్పాయిగురి

07.15 (ఐఎస్‌టి)

…..

12.55 (ఐఎస్‌టి)

13.05 (ఐఎస్‌టి)

హల్దిబారి

06.00 (ఐఎస్‌టి)

06.05 (ఐఎస్‌టి)

13.55 (బిఎస్‌టి)

14.25 (బిఎస్‌టి)

చిలహటి

05.45 (బిఎస్‌టి)

06.15 (బిఎస్‌టి)

22.30 (బిఎస్‌టి)

……

కంటోన్మెంట్

……

21.50 (బిఎస్‌టి)

ఫ్రీక్వెన్సీ

న్యూ జల్పాయిగురి

ఆదివారం & బుధవారం

ఢాకా కంటోన్మెంట్

సోమవారం & గురువారం 

 

****

 



(Release ID: 1830104) Visitor Counter : 185