ప్రధాన మంత్రి కార్యాలయం

క్వాడ్ నేతల శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

Posted On: 24 MAY 2022 8:57AM by PIB Hyderabad

శ్రేష్ఠులారా,

ప్రధాని శ్రీ కిశిదా, ప్రధాని శ్రీ ఎంథనీ అల్బానీజ్ మరియు అధ్యక్షుడు శ్రీ బైడెన్,
ప్రధాని శ్రీ కిశిదా గారు, మీ అద్భుతమైన ఆతిథ్యాని కి గాను మీకు అనేకానేక ధన్యవాదాలు. ఈ రోజు న టోక్యో లో మిత్రుల మధ్య ఉండడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.

అన్నింటి కంటే ముందు గా, ఎన్నికల లో గెలిచినందుకు ప్రధాని శ్రీ ఎంథనీ అల్బానీజ్ కు నేను అభినందన లు తెలియజేస్తున్నాను. మీరు పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన తరువాత కేవలం 24 గంటలకే మాతో భేటీ కావడం అనేది క్వాడ్ మైత్రి యొక్క బలాన్ని, మరి అంతేకాకుండా క్వాడ్ అంటే మీకు ఉన్నటువంటి వచనబద్ధత ను సూచిస్తున్నది.
శ్రేష్ఠులారా,
ఇంత తక్కువ కాలం లో, క్వాడ్ ప్రపంచ రంగస్థలం పైన ఒక ముఖ్య స్థానాన్ని దక్కించుకొన్నది.
ప్రస్తుతం క్వాడ్ యొక్క పరిధి విస్తరించింది; మరి ఈ స్వరూపం ప్రభావవంతం గా కూడాను మారిపోయింది.
మన పరస్పర విశ్వాసం, మన దృఢ సంకల్పం ప్రజాస్వామిక శక్తుల కు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.
క్వాడ్ స్థాయి లో మన పరస్పర సహకారం అనేది సేచ్ఛాయుతమైనటు వంటి, తెరచి ఉంచినటువంటి, సమ్మిళితమైనటు వంటి ఇండో-పసిఫిక్ రీజియన్ కు ఒక ఉత్తేజాన్ని అందిస్తోంది. అదే మనందరి ఉమ్మడి లక్ష్యం గా ఉంది.
కోవిడ్-19 తాలూకు ప్రతికూల పరిస్థితుల లో మనం టీకామందు అందజేత, శీతోష్ణస్థితి సంబంధి కార్యాచరణ, చెక్కు చెదరని సరఫరా వ్యవస్థ, విపత్తు వేళ లో ప్రతిస్పందన మరియు ఆర్థిక సహకారం ల వంటి అనేక రంగాల లో మన మధ్య సహకారాన్ని పెంచుకున్నాం. ఇండో-పసిఫిక్ రీజియన్ కోసం క్వాడ్ ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాల సరళి తో ముందుకు సాగుతోంది.
ఇండో-పసిఫిక్ రిజియన్ కోసం క్వాడ్ ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాల సరళి తో ముందుకు సాగుతోంది.
ఇది మంచి కోసం బలం గా క్వాడ్ యొక్క ఇమేజి మరింత గా బలోపేతం అవుతూ ఉంటుంది.
మీకు చాలా చాలా ధన్యవాదాలు
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.

***

 



(Release ID: 1827994) Visitor Counter : 135