ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మే 19వ తేదీన శ్రీ స్వామినారాయణ్ దేవాలయం నిర్వహించే 'యువ శివిర్' లో ప్రసంగించనున్న - ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 MAY 2022 7:50PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 2022 మే,19వ తేదీ ఉదయం 10 గంటల 30 నిముషాలకు వడోదరలోని కరేలీబాగ్‌ లో జరుగుతున్న ‘యువ శివిర్’ లో దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు.  కుండల్ ధామ్ లోని శ్రీ స్వామి నారాయణ్ దేవాలయం మరియు వడోదర లోని కరేలిబాగ్ శ్రీ స్వామినారాయణ్  దేవాలయం సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. 

యువతను సామాజిక సేవ మరియు దేశ నిర్మాణం వైపు మరింతగా చేర్చాలనే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటుచేశారు.  ఏక్-భారత్-శ్రేష్ఠ-భారత్, ఆత్మనిర్భర్-భారత్, స్వచ్ఛ-భారత్ మొదలైన కార్యక్రమాల ద్వారా యువతను నవ భారత నిర్మాణంలో భాగస్వాములను చేయడం కూడా దీని లక్ష్యం.

 

 

 

*****


(रिलीज़ आईडी: 1826542) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam