ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిత్ శివ్ కుమార్ శర్మ గారి కన్నుమూత పట్లసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2022 1:25PM by PIB Hyderabad

ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిత్ శివ్ కుమార్ శర్మ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పండిత్ శివ్ కుమార్ శర్మ గారి మరణం తో మన సాంస్కృతిక జగత్తు కు తీరని నష్టం వాటిల్లింది. ఆయన సంతూర్ కు ప్రపంచ స్థాయి లో ప్రజాదరణ ను సంపాదించి పెట్టారు. ఆయన సంగీతం రాబోయే తరాల వారి ని సైతం సమ్మోహితుల ను చేస్తూనే ఉంటుంది. ఆయన తో నేను జరిపిన మాటామంతీ నాకు ఎంత బాగా జ్ఞ‌ాపకం ఉంది. ఆయన కుటుంబాని కి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST

 

 

 

 


(రిలీజ్ ఐడి: 1824197) సందర్శకుల సూచీ సంఖ్య : : 190