ఆర్థిక మంత్రిత్వ శాఖ

సామాజిక భద్రత కల్పనలో 7 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై).. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై).. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)


తక్కువ-ధర బీమా పథకాలు, గ్యారెంటీ పెన్షన్ పథకం జన్ సురక్ష ఇప్పుడు సమాజంలోని చివరి వ్యక్తికి వర్తిస్తుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్

ఆసక్తి, అంకితభావంతో ఈ పథకాల కవరేజీని కొనసాగించాలని బ్యాంకులు & బీమా కంపెనీలకు ఉద్బోదించిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్

 పీఎంజేజేబీవై: 12.76 కోట్లకుపైగా సంచిత నమోదు

 పీఎంఎస్‌బీవై: 28.37 కోట్లకుపైగా సంచిత నమోదు

 ఏపీవై: 4 కోట్లమందికి పైగా చందాదారులు

Posted On: 09 MAY 2022 11:11AM by PIB Hyderabad

 

   నేడు మనం మూడు సామాజిక భద్రత (జన సురక్షపథకాల 7వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్నాంఈ మేరకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), టల్ పెన్షన్ యోజన (ఏపీవైపథకాల స్వరూపాన్నిఅవి సాధించిన విజయాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ మూడు పథకాలూ ప్రజలకు సరసమైన బీమా ద్వారా భద్రతను అందించాయి.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పీఎంజేజేబీవైపీఎంఎస్‌బీవైఏపీవైలను పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 2015 మే 9వ తేదీన ప్రారంభించారు.

   నూహ్య ముప్పులు/నష్టాలుఆర్థిక అనిశ్చితి నుంచి మానవ జీవితానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మేరకు ఈ మూడు సామాజిక భద్రత పథకాలు పౌరుల సంక్షేమానికి అంకితం చేయబడ్డాయిదేశంలోని అసంఘటిత వర్గ ప్రజా జీవనాన్ని ఆర్థికంగా సురక్షితం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రెండు బీమా పథకాలు– ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)లతోపాటు వృద్ధాప్య అత్యవసర పరిస్థితులలో ఆదుకునేలా అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)ని కూడా  ప్రవేశపెట్టింది.

   ఈ పథకాల్లో పీఎంజేజేబీవైపీఎంఎస్‌బీవై'ల ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవిత/ప్రమాద బీమా రక్షణ లభిస్తుందిఅదేవిధంగా ప్రస్తుత పొదుపు ద్వారా వృద్ధాప్యంలో క్రమబద్ధంగా పెన్షన్‌ పొందే అవకాశాన్ని ఏపీవై’ కల్పిస్తుంది.

 

పథకం 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, “ఆగస్టు 15, 2014న గౌరవ ప్రధానమంత్రి ప్రకటించిన నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కింద ప్రధాన లక్ష్యాలలో ఒకటి పేద, అట్టడుగు వర్గాలకు అందించడానికి బీమా మరియు పెన్షన్ కవరేజీని విస్తరించడం. సరసమైన ఉత్పత్తుల ద్వారా సమాజానికి చాలా అవసరమైన ఆర్థిక భద్రత." అని తెలిపారు.

 “మూడు జన్ సురక్ష పథకాలు బీమా, పెన్షన్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాయి. గత ఏడేళ్లుగా పై పథకాలలో నమోదు చేసుకున్న, లబ్ధి పొందిన వారి సంఖ్య వారి విజయానికి నిదర్శనం. ఈ తక్కువ -ధర బీమా పథకాలు గ్యారెంటీ పెన్షన్ పథకం గతంలో ఎంపిక చేసిన కొంతమందికి అందుబాటులో ఉన్న ఆర్థిక భద్రత ఇప్పుడు సమాజంలోని చివరి వ్యక్తికి చేరేలా చేస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఆర్థిక మంత్రి పేదలకు సౌకర్యాలు కల్పించడంపై వివరిస్తూ, “నేడు, అత్యంత పేదవారు కూడా పీఎంజేజేబీవై కింద రోజుకు 1 రూపాయి కంటే తక్కువతో,  రూ. 2 లక్షల జీవిత బీమా పొందవచ్చు. రూ. 2 లక్షల ప్రమాద బీమాను పీఎంఎస్‌బీవై కింద నెలకు 1 రూపాయి కంటే తక్కువతో పొందవచ్చు. దేశంలోని 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న పౌరులందరూ 60 ఏళ్ల తర్వాత నెలకు కనీసం రూ. 42 చెల్లించి పెన్షన్ పొందేందుకు అర్హులే.

 

 

 

 

 

పీఎంజేజేబీవై ద్వారా పౌరులకు సౌకర్యంతో కూడిన భద్రతను అందించడం, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో, పీఎంజేజేబీవై కింద, లైఫ్ కవర్ కోసం ప్రారంభం నుండి 12.76 కోట్ల మంది వ్యక్తులు నమోదు చేసుకున్నారు. 5,76,121 మంది వ్యక్తుల కుటుంబాలు పథకం కింద రూ. 11,522 కోట్లు క్లెయిమ్ పొందారు. 2021 ఆర్థిక సంవత్సరం నాటికి కోవిడ్ సమయంలో తక్కువ-ఆదాయ కుటుంబాలకు ఈ పథకం చాలా ఉపయోగకరంగా మారింది. దాదాపు 50% క్లెయిమ్‌లు కోవిడ్ మరణాల కారణంగా చెల్లించబడ్డాయి. మహమ్మారి కాలంలో క్లెయిమ్‌లను త్వరగా మరియు సులభంగా పరిష్కరించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియలో ప్రధాన మార్పులు తీసుకురాబడ్డాయి. క్లెయిమ్‌ల సులభ పరిష్కారం కోసం తీసుకొచ్చిన ఈ మార్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుండి, అంటే ఏప్రిల్ 1, 2020 నుండి, ఫిబ్రవరి 23, 2022 వరకు, మొత్తం 2.10 లక్షల క్లెయిమ్‌లు రూ. 4,194.28 కోట్లు, 99.72% సెటిల్‌మెంట్ రేటుతో చెల్లించబడ్డాయి.

పీఎంఎస్‌బీవై ప్రారంభించినప్పటి నుండి 28.37 కోట్ల మంది ప్రజలు ప్రమాద రక్షణ కోసం నమోదు చేసుకున్నారు. 97,227 క్లెయిమ్‌ల కోసం 1,930 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇప్పటికే 4 కోట్ల మందికి పైగా ప్రజలు ఎపీవై పథకంలో చేరారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్ మాట్లాడుతూ, “ఈ పథకాల 7వ వార్షికోత్సవం సందర్భంగా, వీటిని విజయవంతంగా అమలు చేసిన అన్ని బ్యాంకులు మరియు బీమా కంపెనీలను నేను అభినందిస్తున్నాను మరియు వాటిని కొనసాగించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. చివరి వ్యక్తికి కవర్ అయ్యే వరకు అదే ఉత్సాహం మరియు అంకితభావంతో పనిచేయాలి.”

"దేశంలోని ప్రతి ఒక్కరూ బీమా మరియు పెన్షన్ కోసం ఈ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వచ్చేలా చేయడం మా ప్రయత్నమని గౌరవ ప్రధానమంత్రి గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో" పేర్కొన్నట్లు సహాయమంత్రి పేర్కొన్నారు.

 

మనం పీఎంజేజేబీవైపీఎంఎస్‌బీవైఏపీవై'ల ఏడో వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో వాటి ప్రధానాంశాలను అవి ఇప్పటిదాకా సాధించిన విజయాలను పరిశీలిద్దాం:

1.   ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)

పథకం: ‘పీఎంజేజేబీవై’ ఏడాదిపాటు అమలులో ఉంటుందిదీన్ని ఏటా నవీకరించుకోవాలిఏ కారణంతోనైనా వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ఈ పథకం కింద రక్షణ లభిస్తుంది.

అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో పొదుపు ఖాతాగల 18-50 ఏళ్ల వయస్కులు ఈ పథకం కింద నమోదుకు అర్హులుఇందులో 50 ఏళ్లు నిండకముందు చేరేవారికి ప్రీమియం చెల్లింపు తర్వాత 55 ఏళ్ల వయస్సు వచ్చేదాకా జీవిత బీమా కొనసాగుతుంది.

ప్రయోజనాలు: ఏడాదికి రూ.330 రుసుము చెల్లింపు ద్వారా రూ.2 లక్షల మేరకు జీవిత బీమా రక్షణ లభిస్తుంది.

నమోదు: పొదుపు ఖాతాగల వ్యక్తులు బ్యాంకు శాఖలకు/‘బీసీ’ కేంద్రాలకు నేరుగా వెళ్లి.. లేదా వెబ్‌సైట్‌ ద్వారా లేదా తపాలా పొదుపు ఖాతా ఉన్నట్లయితే సంబంధిత ఆఫీసుకు వెళ్లి ఈ పథకం కింద తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఖాతాదారు ఒకసారి సమ్మతిపత్రం ఇచ్చినట్లయితే ఈ బీమా పథకానికి చెల్లించాల్సిన రుసుము ప్రతి సంవత్సరం వారి ఖాతానుంచి తగ్గించబడుతుందిఈ పథకం.. సంబంధిత పత్రాలపై (హిందీఆంగ్లప్రాంతీయ భాషల్లోపూర్తి సమాచారం https://jansuraksha.gov.in చిరునామాలో లభిస్తుంది.

విజయాలు: ఈ పథకం కింద 06.04.2022 నాటికి 12.69 కోట్లకుపైగా సంచిత నమోదు పూర్తికాగా- 5,73,362 అభ్యర్థనల కింద మొత్తం రూ.11,468 కోట్లు చెల్లించబడింది.

2.   ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)

పథకం: ‘పీఎంఎస్‌బీఐ’ ఏడాదిపాటు అమలులో ఉంటుందిదీన్ని ఏటా నవీకరించుకోవాలిఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణం లేదా వైకల్యం సంభవిస్తే వారికి బీమా రక్షణ లభిస్తుంది.

అర్హత: బ్యాంకు లేదా తపాలా ఆఫీసులో పొదుపు ఖాతాగల 18-70 ఏళ్ల వయస్కులు ఈ పథకం కింద నమోదుకు అర్హులు.

ప్రయోజనాలు: ప్రమాద మరణం లేదా వైకల్యంపై ఈ పథకం కింద రూ.2 లక్షలు (పాక్షిక వైకల్యమైతే రూ.1లక్షలభిస్తుంది.

నమోదు: పొదుపు ఖాతాగల వ్యక్తులు బ్యాంకు శాఖలకు/‘బీసీ’ కేంద్రాలకు నేరుగా వెళ్లి.. లేదా వెబ్‌సైట్‌ ద్వారా లేదా తపాలా పొదుపు ఖాతా ఉన్నట్లయితే సంబంధిత ఆఫీసుకు వెళ్లి ఈ పథకం కింద తమ పేరు నమోదు చేసుకోవచ్చుఖాతాదారు ఒకసారి సమ్మతిపత్రం ఇచ్చినట్లయితే ఈ బీమా పథకానికి చెల్లించాల్సిన రుసుము ప్రతి సంవత్సరం వారి ఖాతానుంచి తగ్గించబడుతుందిఈ పథకం.. సంబంధిత పత్రాలపై (హిందీఆంగ్లప్రాంతీయ భాషల్లోపూర్తి సమాచారం https://jansuraksha.gov.in చిరునామాలో లభిస్తుంది.

విజయాలు: ఈ పథకం కింద 06.04.2022 నాటికి 28.23 కోట్లకుపైగా సంచిత నమోదు పూర్తికాగా- 96,815 అభ్యర్థనల కింద మొత్తం రూ.1,923 కోట్లు చెల్లించబడింది.

అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)

నేపథ్యం: దేశ పౌరులంద‌రికీ... ముఖ్యంగా పేదలునిరుపేదలుఅసంఘటిత రంగ కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రత వ్యవస్థ రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవైప్రారంభించబడిందిఇది ప్ర‌ధానంగా అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక భద్రత క‌ల్ప‌న‌తోపాటు భవిష్యత్ అవసరాలను తీర్చ‌డం ల‌క్ష్యంగా ప్రభుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌జాతీయ పెన్ష‌న్ వ్య‌వ‌స్థ (ఎన్‌పీఎస్‌ప‌రిధిలోని పాల‌నవ్య‌వ‌స్థీకృత యంత్రాంగం కిందగ‌ల పెన్ష‌న్ నియంత్ర‌ణ‌-అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్‌డీఏద్వారా నిర్వహించబడుతుంది.

అర్హత: పొదుపు ఖాతాగల 18-40 ఏళ్ల వయస్కులందరూ ఈ పథకం కింద నమోదుకు అర్హులు. వారు ఎంచుకునే పెన్షన్‌ మొత్తం ఆధారంగా చందా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

ప్రయోజనాలు: ఈ పథకంలో చేరిన చందాదారులకు 60 ఏళ్లు పూర్తయ్యాక వారు చెల్లించిన చందా సొమ్ము ప్రాతిపదికన లభించే హామీ మేరకు రూ.1000 లేదా రూ.2000 లేదా రూ.3000 లేదా రూ.4000 లేదా రూ.5000 వంతున కనీస నెలవారీ పెన్షన్‌ అందుతుంది.

ప్రయోజనాల పంపిణీ: చందాదారు జీవించి ఉన్నంతవరకూ వారి తదనంతరం జీవిత భాగస్వామికి ఈ నెలవారీ పెన్షన్ లభిస్తుందివారి తదనంతరం చందాదారుని 60 ఏళ్ల వయస్సుదాకా సమీకృతమైన పెన్షన్ నిధి సొమ్ము వారు ప్రతిపాదించిన వారసులకు తిరిగి చెల్లించబడుతుంది.

   ఒకవేళ చందాదారు అకాల మరణం (60 ఏళ్లు పూర్తికాకముందేసంభవిస్తేచందాదారు 60 ఏళ్ల వయసుకు చేరేదాకా మిగిలిన కాలానికి వారి జీవిత భాగస్వామి ఏపీవై’ ఖాతాను కొనసాగించవచ్చు.

కేంద్ర ప్రభుత్వ సహకారం: కనీస పెన్షన్‌కు ప్రభుత్వం హామీ ఇస్తుందిఅంటే… చందాల కింద సేకరించిన నిధి ద్వారా పెట్టుబడులపై అంచనాలకన్నా రాబడి తగ్గినపుడుకనీస హామీ పెన్షన్‌ చెల్లింపునకు నిధి సరిపోని పక్షంలో అటువంటి లోటును పూరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుందిఒకవేళ పెన్షన్‌ నిధి పెట్టుబడులపై రాబడి అధికంగా ఉన్నట్లయితే చందాదారులకు మెరుగైన పెన్షన్‌ సంబంధిత ప్రయోజనాలు లభిస్తాయి.

చెల్లింపు వ్యవధి: చందాదారులు ఏపీవై’ చందాను నెల/మూడు నెలల/ఆరు నెలలవారీ పద్ధతిలో చెల్లించవచ్చు.

పథకం నుంచి ఉపసంహరణ: చందాదారులు ప్రభుత్వవాటా చందారాబడి/వడ్డీల తగ్గింపు వంటి కొన్ని షరతులకు లోబడి స్వచ్ఛందంగా ఏపీవై’ నుంచి నిష్క్రమించవచ్చు.

విజయాలు: ఈ పథకం కింద 2022 మార్చి 31నాటికి 4 కోట్ల మందికిపైగా నమోదయ్యారు.

***

 


(Release ID: 1823827) Visitor Counter : 217