ప్రధాన మంత్రి కార్యాలయం

కోపెన్‌హాగన్‌లో జరిగిన భారత-డెన్మార్క్ బిజినెస్ ఫోరమ్‌ లో పాల్గొన్న - ప్రధాన మంత్రి

Posted On: 03 MAY 2022 8:16PM by PIB Hyderabad

గౌరవనీయులు డెన్మార్క్ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టే ఫ్రెడెరిక్సెన్ మరియు గౌరవనీయులు డెన్మార్క్ క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్  లతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డానిష్ పరిశ్రమల సమాఖ్య లో నిర్వహించిన భారత-డెన్మార్క్ వ్యాపార సదస్సు లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, రెండు ఆర్థిక వ్యవస్థల పరిపూరకరమైన నైపుణ్యాల గురించి నొక్కి నొక్కి చెప్పారు.  గ్రీన్ టెక్నాలజీ, కోల్డ్ చైన్‌, సంపద నుండి వ్యర్థాలు, షిప్పింగ్, ఓడరేవులు వంటి భారతదేశంలో ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డానిష్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు.  భారతదేశ వ్యాపార స్నేహపూర్వక విధానాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు. అదేవిధంగా సహకార అవకాశాలను అన్వేషించాలని ఆయన రెండు దేశాల వ్యాపార సమాజాలకు పిలుపునిచ్చారు. 

రెండు దేశాల మధ్య వారధిని ఏర్పాటు చేయడంలో వ్యాపార సంఘాల పాత్రను ప్రధానమంత్రి ఫ్రెడరిక్‌సన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు దిగువ తెలియజేసిన వివిధ రంగాల వ్యాపార సదస్సుల్లో పాల్గొన్నారు:

*     గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ మరియు డిజిటలైజేషన్

*      శక్తి స్వాతంత్య్రం మరియు పునరుత్పాదక శక్తి

*     నీరు, పర్యావరణం మరియు వ్యవసాయం

*     మౌలిక సదుపాయాలు, రవాణా & సేవలు

వ్యాపార సదస్సులో పాల్గొన్న వ్యాపార ప్రతినిధులు: 

భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం:

*     శ్రీ సంజీవ్ బజాజ్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, బజాజ్ ఫిన్సెర్వ్ లిమిటెడ్

*     శ్రీ బాబా ఎన్. కల్యాణి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, భారత్ ఫోర్జ్

*     శ్రీ మహేంద్ర సింఘి, ఎం.డి. & సి.ఈ.ఓ., దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్

*     శ్రీ రిజ్వాన్ సూమర్, సి.ఈ.ఓ. & ఎం.డి., హిందుస్థాన్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్

*     శ్రీ దర్శన్ హిరానందాని, చైర్మన్, హీరానందాని గ్రూప్

*     శ్రీ పునీత్ ఛత్వాల్, ఎం.డి. & సి.ఈ.ఓ., ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్

*     శ్రీ దీపక్ బాగ్లా, సి.ఈ.ఓ., & ఎం.డి., ఇన్వెస్ట్ ఇండియా

*     శ్రీ రితేష్ అగర్వాల్, ఓ.వై.ఓ. రూమ్స్ వ్యవస్థాపకులు & సి.ఈ.ఓ. 

*     శ్రీ సలీల్ సింఘాల్, చైర్మన్ ఎమెరిటస్, పి.ఐ. ఇండస్ట్రీస్ లిమిటెడ్

*     శ్రీ సుమంత్ సిన్హా, చైర్మన్ & ఎం.డి., రెన్యూ పవర్

*     శ్రీ దినేష్ ఖరా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్

*     శ్రీ సి.పి. గుర్నానీ, ఎం.డి. & సి.ఈ.ఓ. టెక్ మహీంద్రా లిమిటెడ్

*     శ్రీ తులసి తంతి, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్.

డానిష్ వ్యాపార ప్రతినిధి బృందం:

*     నీల్స్ ఆగే క్జెర్, యజమాని, AVK

*     పీటర్ పల్లిషోజ్, సి.ఏ.ఓ.,, బ్యాట్ర్ 

*     సీస్ 'టి హార్ట్, సి.ఈ.ఓ., కార్ల్స్ బెర్గ్  

*     జాకోబ్ బారుయెల్ పౌల్సెన్, మేనేజింగ్ పార్టనర్, కోపెన్‌హాగన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పార్ట్‌నర్స్

*     జుక్కాపెర్టోలా, చైర్మన్, సి.ఓ.డబ్ల్యూ.ఐ. & సీమెన్స్ విండ్ పవర్

*     జోర్గెన్ మాడ్స్ క్లాసెన్, యజమాని, డాన్‌ఫోస్

*     థామస్ ప్లెన్‌బోర్గ్, ఛైర్మన్, డి.ఎస్.వి. 

*     కిమ్ వెజ్ల్బీ హాన్సెన్, సి.ఈ.ఓ., ఎఫ్.ఓ.ఎస్.ఎస్. 

*     జెన్స్ మోబెర్గ్, చైర్మన్, గ్రండ్‌ఫోస్

*     రోలాండ్ బాన్, సి.ఈ.ఓ., హల్డోర్ టాప్సో

*      లార్స్ పీటర్సన్, సి.ఈ.ఓ., హెంపెల్

*     నీల్స్ స్మెడెగార్డ్, ఛైర్మన్, ఐ.ఎస్.ఎస్

*     ఒలీవియర్ ఫాంటన్, సి.ఈ.ఓ., ఎల్.ఎం. విండ్ పవర్ బ్లేడ్స్

*     జేన్స్-పీటర్‌ సాల్, సి.ఈ.ఓ., రాంబోల్

*     జేన్స్ బిర్గెర్సన్, సి.ఈ.ఓ., రాక్‌వూల్

*     మ్యాడ్స్ నిప్పర్, సి.ఈ.ఓ., ఓర్ స్టెడ్ 

*****

 



(Release ID: 1822479) Visitor Counter : 140