ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లు సరికొత్త కొత్త మైలురాయిని చేరాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఫ్లాగ్‌షిప్ టెలిమెడిసిన్ సర్వీస్ అయిన “ఈ-సంజీవని” ద్వారా 2022 ఏప్రిల్ 26 మరియు 27 తేదీల్లో రికార్డ్ స్థాయిలో 3.5 లక్షల టెలి సంప్రదింపులు జరిగాయి


2022 ఏప్రిల్ 26 మరియు 27 తేదీలలో 76 లక్షల మంది రోగులు ఈసంజీవని ఓపీడీ టెలిమెడిసిన్ సేవలను పొందారు

అంత్యోదయ దిశగా పెద్ద అడుగు- టెలికన్సల్టేషన్‌లో స్థిరమైన పెరుగుదల సుదూర ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాప్యత మరియు అందుబాటుకు భరోసా ఇస్తుంది.

Posted On: 28 APR 2022 12:16PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ కు చెందిన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌లు కమ్యూనిటీలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే మిషన్‌లో సరికొత్త మైలురాయిని అధిగమించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఫ్లాగ్‌షిప్ టెలిమెడిసిన్ స్కీమ్- “ఈసంజీవని” ద్వారా 2022 ఏప్రిల్ 26 మరియు ఏప్రిల్ 27న వరుసగా రెండు రోజులలో రికార్డు స్థాయిలో 3.5 లక్షల టెలి-కన్సల్టేషన్‌లు నమోదు చేయబడ్డాయి.ఏబీ-హెచ్ డబ్ల్యూసీల వద్ద ఒకే రోజు జరిగిన అత్యధిక సంఖ్యలో టెలికన్సల్టేషన్‌లైన రోజుకు 3 లక్షల టెలికన్సల్టేషన్‌ల రికార్డును అధిగమించింది. వీటికి అదనంగా 2022 ఏప్రిల్ 26 మరియు 27 తేదీలలో ఈ-సంజీవనిఓపీడీ టెలిమెడిసిన్ అందించిన సేవలను 76 లక్షల మందికి పైగా రోగులు అందుకున్నారు.

ఈ రికార్డు సాధన ఈ-సంజీవని ప్లాట్‌ఫారమ్ కు ఉన్న బలమైన సాంకేతికతకు నిదర్శనం. దాదాపు 1 లక్ష ఏబీ-హెచ్ డబ్ల్యూసీలు ఇప్పటికే సంప్రదింపులు కోరుతూ స్పోక్స్‌గా నమోదు చేసుకున్నారు మరియు 25,000 కంటే ఎక్కువ హబ్‌లు టెలికన్సల్టేషన్‌లను అందిస్తున్నాయి, ఈ-సంజీవని పోర్టల్ దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రాప్యతను సులభతరం చేస్తోంది. నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం టెలి-కన్సల్టేషన్‌లలో స్థిరమైన పెరుగుదల అంత్యోదయ వైపు ఒక పెద్ద అడుగు. దేశంలోని సుదూర మరియు మారుమూల ప్రాంతాల ప్రజలు దీనిద్వారా నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను పొందగలుగుతారు. దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న పేదలకు సకాలంలో నిపుణుల సేవలను అందించడానికి టెలికన్సల్టేషన్‌లు ఒక వరంలా ఉద్భవించాయి.

ప్రపంచంలోనే మొట్ట మొదటి టెలిమెడిసిన్ చొరవ అయిన ఈ-సంజీవనిలో రెండు రకాలు ఉన్నాయి:

ఈ-సంజీవని ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ( ఏబీ-హెచ్ డబ్ల్యూసీ): గ్రామీణ ప్రాంతాలు మరియు వివిక్త కమ్యూనిటీలలో సాధారణ మరియు ప్రత్యేక ఆరోగ్య సేవలను అందించడానికి భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ పథకం కింద డాక్టర్-టు-డాక్టర్ టెలిమెడిసిన్ సేవ. డాక్టర్-టు-డాక్టర్ టెలిమెడిసిన్ సర్వీస్ హబ్-అండ్-స్పోక్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. 'ఈసంజీవని హెచ్ డబ్ల్యూసీ' స్పోక్ వద్ద లబ్ధిదారు (పారామెడిక్ మరియు జనరల్‌తో పాటు) అంటే హెచ్ డబ్ల్యూసీ మరియు హబ్‌లోని డాక్టర్/స్పెషలిస్ట్ (తృతీయ ఆరోగ్య సంరక్షణ సౌకర్యం/హాస్పిటల్/మెడికల్ కాలేజీ) మధ్య వర్చువల్ కనెక్షన్‌ని అనుమతిస్తుంది. ఇది స్పోక్ వద్ద పారామెడిక్స్ ద్వారా లబ్ధిదారుతో హబ్‌లోని వైద్యులు & నిపుణుల నుండి నిజ-సమయ వర్చువల్ సంప్రదింపులను సులభతరం చేస్తుంది. సెషన్ ముగింపులో రూపొందించబడిన ఇ-ప్రిస్క్రిప్షన్ మందులను పొందేందుకు ఉపయోగించబడుతుంది. భౌగోళికం, యాక్సెసిబిలిటీ, ఖర్చు మరియు దూరం వంటి అవరోధాలను అధిగమించి సమాచార సాంకేతిక పరిజ్ఞానం యొక్క సంభావ్యతను ఉపయోగించుకోవడం ద్వారా గరిష్ట సంఖ్యలో పౌరులకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించాలనే లక్ష్యంతో 'ఈ-సంజీవని హెచ్ డబ్ల్యూసీ' అమలు చేయబడుతోంది.

ప్రస్తుతం ఈ-సంజీవని హెచ్ డబ్ల్యూసీ 80,000 కంటే ఎక్కువ హెల్త్ & వెల్నెస్ సెంటర్లలో పనిచేస్తోంది. మారుమూల ప్రాంతాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతి రోజు (ఏప్రిల్ 26 మరియు ఏప్రిల్ 27) 2.70 లక్షల కంటే ఎక్కువ మంది వైద్యులకు సాధారణ మరియు ప్రత్యేక వైద్యుల నుండి వైద్యునికి టెలిమెడిసిన్ ఆరోగ్య సేవలు అందించబడ్డాయి.

ఈ-సంజీవనిఓపీడీ: ఇది ప్రజలు తమ ఇళ్లలో ఔట్ పేషెంట్ సేవలను పొందేందుకు వీలుగా పేషెంట్-టు-డాక్టర్ టెలిమెడిసిన్ సర్వీస్. 'ఈ-సంజీవనిఓపీడీ' కూడా దేశంలోని అన్ని ప్రాంతాల పౌరులకు వేగంగా మరియు విస్తృతంగా అందించబడుతుంది. ఇది ఆండ్రాయిడ్  మరియు ఐవోఎస్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల కోసం మొబైల్ యాప్‌గా అందుబాటులో ఉంది మరియు ఈ యాప్‌లు 3 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు అయ్యాయి.


 

****


(Release ID: 1820883) Visitor Counter : 193