ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు లోని తంజావూరు లో దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు
Posted On:
27 APR 2022 9:51AM by PIB Hyderabad
తమిళ నాడు లోని తంజావూర్ లో దుర్ఘటన సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన లో బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) అనేక ట్వీట్ లలో -
‘‘తమిళ నాడు లోని తంజావూర్ లో దుర్ఘటన సంభవించినందుకు చాలా బాధపడ్డాను. ఈ దుఃఖ ఘడియ లో ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ ఘటన లో గాయపడ్డ వారు త్వరలోనే కోలుకొంటారని నేను ఆశపడుతున్నాను: ప్రధాన మంత్రి’’
‘‘తమిళ నాడు లోని తంజావూర్ లో సంభవించిన దుర్ఘటన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి తలా 2 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది. ఈ ఘటన లో గాయపడ్డ వారి కి 50,000 రూపాయల వంతున అందజేయడం జరుగుతుంది: ప్రధాన మంత్రి ’’ అని పేర్కొంది.
***
DS/SH
(Release ID: 1820790)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam