ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డబ్ల్యుహెచ్ఒడిజి డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయిసస్ తో సమావేశమైన ప్రధాన మంత్రి  

నాడు పోస్టు చేయడమైనది: 19 APR 2022 9:45PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెయెసస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జామ్ నగర్ లో సమావేశమయ్యారు. అంతక్రితం ఇద్దరు ప్రముఖులూ డబ్ల్యుహెచ్ఒ గ్లోబల్ సెంటర్ ఫార్ ట్రెడిశనల్ మెడిసిన్ యొక్క ప్రారంభ కార్యక్రమం సందర్భం లో కలుసుకొన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘@DrTedros తో భేటీ అవుతూ, ఆరోగ్య రంగాన్ని మరింత బలపరచడం పై అభిప్రాయాల ను పరస్పరం వెల్లడి చేసుకోవడం అంటే అది ఎల్లప్పటికీ సంతోష దాయకమే. ఆయన సదా తన జీవనం పై భారతీయ గురువుల యొక్క ప్రభావాన్ని స్వీకరిస్తూనే వస్తున్నారు. మరి ఈ రోజు న, ఆయన తనకు గల గుజరాతీ భాషా నైపుణ్యానికి సైతం బోలెడు ప్రశంస లు లభించాయి కూడాను! @WHO’’ అని పేర్కొన్నారు.

 

 


(రిలీజ్ ఐడి: 1818283) సందర్శకుల సూచీ సంఖ్య : : 184