ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరీక్ష‌ల‌పై చర్చ... పరీక్షలతోపాటు జీవితంలోని అనేక సమస్యలపై చ‌ర్చ‌కు ఒక శక్తిమంత‌మైన వేదిక: ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 16 APR 2022 6:43PM by PIB Hyderabad

న‌మో" యాప్‌లోని వినూత్న న‌వీకృత విభాగంలో ప‌రీక్ష‌ల‌పై చ‌ర్చ‌కు సంబంధించిన ప‌ర‌స్ప‌ర సంభాష‌ణ‌ల స‌మ‌గ్ర రూపం నుంచి కొత్త ఆలోచ‌న‌లను గ్ర‌హించ‌వ‌చ్చున‌ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

"నేను మ‌న చైత‌న్య‌వంతులైన ప‌రీక్ష‌ల యోధుల‌తో సంభాషించ‌డంపై ఎంతో సంతోషిస్తున్నాను. పరీక్ష‌ల‌పై చ‌ర్చ‌ అనేది పరీక్షల గురించి మాత్ర‌మేగాక‌ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలపై చ‌ర్చకు ఒక శక్తిమంత‌మైన వేదిక. ఈ పరస్పర సంభాష‌ణ‌ల నుంచి స‌రికొత్త ఆలోచ‌న‌లను న‌మో  యాప్‌లోని వినూత్న న‌వీకృత విభాగంలో చూడ‌వ‌చ్చు" అని పేర్కొన్నారు.

 

 
****
DS/ST

(Release ID: 1817511) Visitor Counter : 173