ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ లోని అంబాజీ తీర్థ్ ధామ్ లో జరుగనున్న సౌండ్ ఎండ్ లైట్శో లో పాలుపంచుకోవలసింది గా భక్తుల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
Posted On:
08 APR 2022 1:59PM by PIB Hyderabad
గుజరాత్ లో అంబాజీ తీర్థ్ ధామ్ లో జరుగనున్న ‘సౌండ్ ఎండ్ లైట్ శో’ కార్యక్రమం లో పాలుపంచుకోవలసింది గా భక్త జనావళి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. 51 శక్తిపీఠాల పరిక్రమ ఉత్సవం ఈ రోజు న రాత్రి 7 గంటల వేళ కు ప్రారంభం అవుతుందని ఆయన తెలియజేశారు. ‘సౌండ్ ఎండ్ లైట్ శో’ లో మన పురాణాల ను కళ్ళ కు కట్టడం జరుగుతుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘గుజరాత్ లోని అంబాజీ తీర్థ్ ధామ్ లో భక్త జనుల కు చాలా మంచి అవకాశం వచ్చింది. ఈ రోజు న రాత్రి 7 గంటల నుంచి ఇక్కడ 51 శక్తిపీఠాల పరిక్రమ ఉత్సవం ప్రారంభం కాబోతోంది. దీనిలో మన పురాణాల కు సంబంధించినటువంటి ఒక ఆకర్షణీయమైన సమర్పణ తో ముడిపడ్డ ‘లైట్ ఎండ్ సౌండ్ శో’ కూడా భాగం గా ఉంటుంది. మీరంతా ఈ వైభవోపేతమైన కార్యక్రమం లో పాలుపంచుకోవలసింది అని నేను అభ్యర్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1814832)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam