సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ (ఏవీజీసీ) రంగ అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ
90 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సమర్పించనున్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్ ఫోర్స్
పరిశ్రమ, విద్య, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
Posted On:
08 APR 2022 10:46AM by PIB Hyderabad
· ఏవీజీసీ అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
· ఏవీజీసీ సభ్యులుగా పరిశ్రమ వర్గాలు
· కంటెంట్ సృష్టిలో భారతదేశం ముందంజలో ఉండాలి
· ఏవీజీసీ రంగ అభివృద్ధికి విధి విధానాలకు రూపకల్పన మార్గనిర్దేశం చేసేందుకు
· పరిశ్రమ సహకారం కీలకం
· ప్రపంచ మార్కెట్ లో భారత ఏవీజీసీ పరిశ్రమ స్థానం మెరుగు పడేలా చేసేందుకు చర్యలు
"భారతదేశంలో సృష్టించు( క్రియేట్ ఇన్ ఇండియా) " "బ్రాండ్ ఇండియా" అభివృద్ధిలో భారతదేశ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్ (ఏవీజీసీ) రంగం కీలక పాత్ర పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాదాపు 25-30% వార్షిక వృద్ధి కలిగి ఏటా 1,60,000 కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్న యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్ (ఏవీజీసీ) రంగం 2025 నాటికి ప్రపంచ మార్కెట్ వాటాలో 5% (~40 బిలియన్ల అమెరికా డాలర్లు )ను స్వాధీనం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
2. ఏవీజీసీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, జాతీయ అంతర్జాతీయ మార్కెట్‌లకు మరింతగా విస్తరించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు, దీనికి అవసరమైన సూచనలు సిఫార్సు చేయడానికి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ (ఏవీజీసీ) ప్రమోషన్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని కేంద్ర బడ్జెట్ 2022-23లో పేర్కొనడం జరిగింది.
3. కేంద్ర బడ్జెట్ 2022-23లో చేసిన ప్రకటన కు అనుగుణంగా దేశంలో ఏవీజీసీ రంగాన్ని ప్రోత్సహించడానికి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ మరియు కామిక్స్ (ఏవీజీసీ) ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడింది.
4. ఏవీజీసీ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్‌కు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు మరియు దీనిలో
ఏ. . నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ
బి . ఉన్నత విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ
సి.ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు
ఈ . పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
పరిశ్రమ వర్గాలు చెందిన కింది వారు సభ్యులుగా వ్యవహరిస్తారు.
ఎ కంట్రీ హెడ్, టెక్ని కలర్ ఇండియా బీరెన్ ఘోష్,
బి . .పునర్యుగ్ ఆర్ట్‌విజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఆశిష్ కులకర్ణి,
సి . అని బ్రెయిన్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ జేష్ కృష్ణ మూర్తి,
డి . COO మరియు VFX నిర్మాత, రెడ్‌చిల్లీస్ VFX కీతన్ యాదవ్,
ఈ . విస్లింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చైతన్య చించ్లికర్,
ఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్, జింగా ఇండియా కిషోర్ కిచిలి
జి . హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ నీరజ్ రాయ్
5. ఏవీజీసీ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్‌లో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వంటి విద్యా సంస్థల అధిపతులు మరియు ఎంఈఎస్సి, ఫిక్కీ, సిఐఐ లాంటి పరిశ్రమల సంస్థల ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు.
6. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ముఖ్య పరిశ్రమల సంస్థల భాగస్వామ్యంతో ఏవీజీసీ అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఈ రంగం సమగ్ర అభివృద్ధికి అవసరమైన విధి విధానాలు రూపొందించి, కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రమాణాలను నిర్దేశించి సంస్థాగత చర్యలను అమలు చేసినందుకు అవకాశం కలుగుతుంది. భారతదేశంలో ఏవీజీసీ విద్య ప్రమాణాలు పరిశ్రమ మరియు అంతర్జాతీయ ఏవీజీసీ సంస్థలతో కలిసి పనిచేయడానికి వీలవుతుంది. దీని వల్ల భారతీయ ఏవీజీసీ పరిశ్రమ తన ప్రపంచ స్థానాన్ని మెరుగుపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది.
టాస్క్ ఫోర్స్ ప్రధాన విధి విధానాలు :
(i) జాతీయ ఏవీజీసీ విధానాన్ని రూపొందించడం,
(ii) ఏవీజీసీసంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ మరియు డాక్టోరల్ కోర్సుల కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక వ్యవస్థను సిఫారసు చేయడం,
(iii) విద్యాసంస్థలు, వృత్తి శిక్షణ కేంద్రాలు, పరిశ్రమల సహకారంతో నైపుణ్య కార్యక్రమాలను అమలు చేయడం ,
(iv) ఉపాధి అవకాశాలను పెంచడం,
(v) భారతీయ ఏవీజీసీ పరిశ్రమ ప్రపంచవ్యాప్త విస్తరణకు ప్రమోషన్ మరియు మార్కెట్ అభివృద్ధి కార్యకలాపాలు రూపొందించి అమలు చేయడం,
(vi) ఏవీజీసీ రంగంలో ఎగుమతులను మెరుగుపరిచి మరియు ఎఫ్‌డిఐని ఆకర్షించడానికి ప్రోత్సాహకాలను సిఫార్సు చేయడం,
7. ఏవీజీసీ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్ తన మొదటి కార్యాచరణ ప్రణాళికను 90 రోజులలోపు అందజేస్తుంది.
***
(Release ID: 1814757)
Visitor Counter : 270
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam