ప్రధాన మంత్రి కార్యాలయం

యూక్రేన్ అంశం మరియు ఆపరేశన్ గంగ పై పార్లమెంటు లో సకారాత్మకమైన చర్చ జరగడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 06 APR 2022 8:30PM by PIB Hyderabad

పార్లమెంటు లో గత కొద్ది రోజుల లో యూక్రేన్ అంశం మరియు ఆపరేశన్ గంగ.. వీటిని గురించి సకారాత్మకమైనటువంటి చర్చ జరిగినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు. వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేయడం ద్వారా ఈ అంశాల పై చక్కని చర్చ కు తోడ్పాటు ను అందించిన సభ్యులందరి కి ఆయన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల లో సైతం మన తోటి పౌరుల సురక్ష మరియు శ్రేయం పట్ల శ్రద్ధ తీసుకోవడం అనేది మన సామూహిక కర్తవ్యం అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -

‘‘యూక్రేన్ స్థితి మరియు ఆపరేశన్ గంగ ద్వారా మన పౌరుల ను స్వదేశాని కి రప్పించడం కోసం భారతదేశం చేసిన ప్రయాసల పై ఒక సకారాత్మకమైనటువంటి చర్చ కు పార్లమెంటు గత కొన్ని రోజులు గా సాక్షి గా నిలచింది. వారి వారి ఆలోచనల ను వెల్లడించి ఈ అంశాల పై చక్కటి చర్చ కు తోడ్పడ్డ పార్లమెంటు సభ్యులు అందరి కీ నేను కృతజ్ఞుడినై ఉంటాను.’’

‘‘విదేశీ వ్యవహారాల విధానం సంబంధి అంశాల లో ఉత్కృష్ట‌ స్థాయి చర్చ తో పాటు విలువైన ఆలోచనలు అనేవి ద్విపక్షీయ సహకారం ఏ విధంగా ఉంటుందో చాటింది. ఈ తరహా ద్విపక్ష సహకారం ప్రపంచ స్థాయి లో భారతదేశాని కి శుభ సూచకం గా ఉంది.’’

‘‘మన సాటి పౌరుల యొక్క సురక్ష కోసం వారి శ్రేయం కోసం శ్రద్ధ తీసుకోవడం అనేది మన అందరి బాధ్యత గా ఉంది. ప్రతికూల పరిస్థితుల లో మన పౌరులు ఏ విధమైన కష్టాల బారిన పడకుండా చూడటానికని భారత ప్రభుత్వం శాయశక్తులా పాటుపడగలదు.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1814490) Visitor Counter : 155