సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారతదేశ జాతీయ భద్రతకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేస్తున్నదంఉదకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ 22 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది.
2021 ఐటి నిబంధనల ప్రకారం 18 భారతీయ యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది.
పాకిస్థాన్ నుంచి ప్రసార మవుతున్న 4 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది.
ప్రేక్షకులను తప్పుదారి పట్టించేందుకు ఈ యూట్యూబ్ ఛానళ్లు , టీవి ఛానళ్ల లోగోలు, తప్పుడు థంబ్ నెయిల్స్ ను వాడాయి.
3 ట్విట్టర్ ఖాతాలు, 1 ఫేస్ బుక్ ఖాతా, 1 న్యూస్ వెబ్ సైట్ ను కూడా బ్లాక్ చేసింది.
Posted On:
05 APR 2022 2:18PM by PIB Hyderabad
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశౄఖ 2021 ఐటి నిబంధనల కింద తమకు గల అత్యవసర అధికారాలను వినియోగించి 22 యూబ్యూబ్ ఛానళ్లను ,3 ట్విట్టర్ ఖాతాలను, 1 ఫేస్ బుక్ ఖాతాను, 1 న్యూస్ వెబ్ సైట్ ఖాతాను బ్లాక్ చేస్తూ 04.04.2022న ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా బ్లాక్ అయిన యూ ట్యూబ్ ఛానళ్లకు 260 కోట్ల వీక్షకులు ఉన్నారు. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ కు సంబంధించిన సున్నిత మైన అంశాలలో ఇవి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేందుకు వీటిని ఉపయోగించుకుంటున్నట్టు గుర్తించారు.
ఇండియాలోని యూ ట్యూబ్ ఛానల్ళపై చర్యలుః
గత ఏడాది ఫిబ్రవరిలో విడుదల అయిన ఐటి నిబంధనలు 2021 కింద భారతీయ యూ ట్యూబ్ ఆధారిత న్యూస్ పబ్లిషర్లపై చర్యలు తీసుకోవడం ఇదే మొదటి సారి. ఇటీవల ప్రభుత్వం బ్లాక్ చేసిన వాటిలో 18 భారతీయ యూట్యూబ్ ఛానళ్లు , నాలుగు పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి.
విషయ విశ్లేషణ :
ప్రభుత్వం బ్లాక్ చేసిన పలు యూట్యూబ్ ఛానళ్లు భారత సాయుధ బలగాలు, జమ్ము కాశ్మీర్, తదితర అంశాలపై తప్పుడు వార్తలను పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. ప్రభుత్వం బ్లాక్ చేయాల్సిందిగా ఆదేశించిన వాటిలో వివిధ సామాజిక మాధ్యమాలలో భారత వ్యతిరేక ప్రచారాన్ని ఒక పద్ధతి ప్రకారం పాకిస్థాన్ నుంచి సాగిస్తున్నవి కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఉక్రెయిన్ లో కొనసాగుతున్న పరిస్థితిపై భారత్ నుంచి ప్రసారం అవుతున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో తప్పుడు సమాచారం ప్రసారం అవుతున్నది. ఇది మన దేశానికి ఇతర దేశాలతో గల సంబంధాలను దెబ్బతీసేందుకు ఉద్దేశించినరీతిలో సాగుతున్నాయి.
కార్యకలాపాల తీరు:
బ్లాక్ కు గురైన భారతీయ యూ ట్యూబ్ ఛానళ్లు పలు టివి న్యూస్ ఛానల్ళ టెంప్లేట్‌లు, లోగోలు, ఆయా న్యూ స్ యాంకర్ల ఫోటోలను వాడుతూ, ఈ వార్తలు ఆయా న్యూస్ ఛానళ్ల అధీకృత వార్తలు అని నమ్మించేలా తప్పుడు ప్రసారా లు చేస్తున్నాయి. తప్పుడు థంబ్ నెయిల్స్‌ను వాడుతున్నారు. వాటికి పెట్టే శీర్షికలను, థంబ్ నెయిల్స్‌ను వైరల్ చేసేందుకు ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. కొన్ని కేసులలో భారరత వ్యతిరేక తప్పుడు వార్తలను పాకిస్థాన్ నుంచి ప్రసారం చేస్తున్నారు.
మంత్రిత్వశాఖ తీసుకున్న ఈ చర్యతో 2021 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు మొత్తం 78 యూట్యూబ్ ఛానళ్ళను పలు ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలను జాతీయ భద్రత, దేశ సార్వభౌమత్వం, దేశ సమగ్రత, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన కారణాలపై బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు అయింది.
వాస్తవమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన ఆన్ లైన్ మీడియా కార్యకలాపాలకు భారత ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంది. అలాగే దేశ సార్వభౌమత్వం, సమగ్రత, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌ను దెబ్బతీసే చర్యలను భగ్నం చేస్తుంది.
(Release ID: 1813827)
Visitor Counter : 334
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam