సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రసారకుల కోసం బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్ ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్


వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందనను తీసుకురావడానికే ఈ పోర్టల్: శ్రీ అనురాగ్ ఠాకూర్


త్వరలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘జాతీయ సింగిల్ విండో సిస్టమ్’కి అనుసంధానం కానుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్

900 పైగా సాటిలైట్ ఛానళ్లకు, 70కి పైగా టెలిపోర్టు ఆపరేటర్లకు, 1750 మల్టీ-సర్వీస్ ఆపరేటర్లకు, 350కి పైగా కమ్యూనిటి రేడియో స్టేషన్లకు, 380కి పైగా ప్రైవేట్ ఎఫ్ఎం ఛానళ్లకు ఈ పోర్టల్ సంపూర్ణ సమాధానాలు చూపుతుంది.


బ్రాడ్‌కాస్టింగ్ సెక్టార్‌లో సులభతర వ్యాపారం చేయడంలో పోర్టల్ ఒక పెద్ద ముందడుగు


పోర్టల్‌లోని ‘ఎండ్ టు ఎండ్’ ఫెసిలిటేషన్ ద్వారా మౌస్‌పై ఒక క్లిక్‌తో అందరికీ పరిష్కారాలు

Posted On: 04 APR 2022 3:38PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసారయువజన వ్యవహారాలు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ నేడు దిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రసార రంగంలో సులభతర వాణిజ్యంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్ అనేది వివిధ రకాల లైసెన్స్‌లుఅనుమతులురిజిస్ట్రేషన్‌లు మొదలైన వాటి కోసం బ్రాడ్‌కాస్టర్‌ల ధరకాస్తులను వేగవంతంగా ఫైల్ చేయడం, ప్రాసెస్ చేయడం కోసం ఉద్దేశించిన ఆన్‌లైన్ పోర్టల్.

ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూసాంకేతికత సాయంతో వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి, మరింత జవాబుదారీతనం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్ అప్లికేషన్‌ల నిర్వహణ సమయాన్ని తగ్గిస్తుంది, అదే సమయంలో దరఖాస్తుదారులు పురోగతిని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. ఈ పోర్టల్ ఇదివరకు అవసరమైన మానవ ప్రమేయాన్ని తగ్గిస్తుంది. తద్వారా మంత్రిత్వ శాఖ యొక్క సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది సులభతర వాణిజ్యం కోసం ఇది ఒక ప్రధాన అడుగు అవుతుంది.

 

 

 

వాటాదారుల అనుమతుల కోసంరిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియదరఖాస్తులను ట్రాక్ చేయడంఫీజులను లెక్కింపు, చెల్లింపులను అమలు చేయడం వంటి వాటిని సులభతరం చేయడం కోసం సంపూర్ణ (360 డిగ్రీల) డిజిటల్ పరిష్కారాలు చూపుతుందని శ్రీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ పోర్టల్ ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెల్‌లుటెలిపోర్ట్ ఆపరేటర్లుఎంఎస్‌ఓలుకమ్యూనిటీ, ప్రైవేట్ రేడియో ఛానెల్‌లు మొదలైన అన్ని వాటాదారులకు డిజిటల్ భారత్ యొక్క విస్తృత ప్రయోజనాలను ఈ సేవల ద్వారా అందిస్తుంది.

 

"ఈ పోర్టల్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క 'కనీస ప్రభుత్వంగరిష్ట పాలనమంత్రాన్ని సాకారం చేయడంలో ఒక పెద్ద ముందడుగు అనిఈ సరళమైన, వినియోగదారు స్నేహపూర్వక వెబ్ పోర్టల్ ప్రసారకులకు కేవలం ఒక్క మౌస్ క్లిక్‌తో ఎండ్-టు-ఎండ్ పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది 900కు పైగా శాటిలైట్ టీవీ ఛానల్స్70 టెలిపోర్ట్ ఆపరేటర్లు1700 మల్టీ-సర్వీస్ ఆపరేటర్లు350 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు (సిఆర్ఎస్)380 ప్రైవేట్ ఎఫ్ఎమ్ ఛానళల్, ఇతరులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చడం ద్వారా మొత్తం బ్రాడ్‌కాస్ట్ రంగాన్ని బలోపేతం చేస్తుంది.

 

పోర్టల్ టెస్ట్ రన్‌కు అంతిమ వినియోగదారుల నుండి సానుకూల స్పందన వచ్చినట్లు మంత్రి తెలియజేశారు. త్వరలోనే ఈ పోర్టల్ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌కు అనుసంధానం కానుంది. పరిశ్రమ అవసరమని భావించే మరిన్ని మెరుగుదలలకు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.

 

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూకొత్త పోర్టల్ ముందు వెర్షన్ కంటే అనేక మెరుగుదలలను కలిగి ఉందని మరియు ఒక నెల ట్రయల్ వ్యవధిలో వాటాదారుల నుండి వచ్చిన సూచనలను పొందుపరిచినట్లు తెలిపారు.

 

ఈ పోర్టల్ వ్యవస్థలో పారదర్శకతజవాబుదారీతనం మరియు ప్రతిస్పందనను తీసుకువస్తుంది. మొత్తం సమాచారం ఒకే డ్యాష్ బోర్డ్ పై లభ్యం అవుతుంది. పోర్టల్‌లో పొందుపర్చిన వివిధ సేవలు, ఫీచర్లు:

• ఎండ్-టు-ఎండ్ ప్రాసెసింగ్

• పేమెంట్ సిస్టమ్‌తో ఇంటిగ్రేషన్ (భారత్ కోష్ ద్వారా)

• ఇ-ఆఫీస్, భాగస్వామ్య మంత్రిత్వ శాఖలతో ఇంటిగ్రేషన్

• అనలిటిక్స్రిపోర్టింగ్ మరియు మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MIS)

• ఇంటిగ్రేటెడ్ హెల్ప్ డెస్క్

• అప్లికేషన్ ఫారాలు మరియు స్టేటస్ ట్రాకింగ్

• పోర్టల్ ద్వారానే లెటర్లు/ఆర్డర్లను డౌన్‌లోడ్ చేసుకోవడం

• భాగస్వాములకు అలర్ట్స్ పంపించడం (ఎస్ఎంఎస్/ఇ-మెయిల్స్)

 

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రసార సంస్థ ప్రతినిధులు పోర్టల్ ప్రారంభించడాన్ని స్వాగతించారు. ఇది అప్లికేషన్లు ప్రయాణించాల్సిన దూరాన్ని మరియు దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన శ్రమను గణనీయంగా తగ్గిస్తుందని వారు తెలిపారు.

భారతదేశం యొక్క వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం అనేది భారత ప్రభుత్వం యొక్క కీలకమైన అంశాలలో ఒకటి మరియు బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్ వ్యాపారాన్ని సులభతరం చేయడం మరియు ప్రసార రంగాన్ని సాధికారత చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఉదహరిస్తుంది.

బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమం దిగువ లింక్‌లో లభ్యం అవుతుంది.

 

 

***

 


(Release ID: 1813254) Visitor Counter : 280