ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మార్చి 2022లో అత్యధిక స్థూల జీఎస్టీ వసూళ్లు, జనవరి 2022 వసూలు చేసిన ₹ 1,40,986 కోట్ల మునుపటి రికార్డును అధిగమించింది


నెలలో ₹ 1,42,095 కోట్ల స్థూల జీఎస్టీ ఆదాయం వసూళ్లు

Posted On: 01 APR 2022 3:33PM by PIB Hyderabad

మార్చి 2022 నెలలో సేకరించిన స్థూల జీఎస్టీ ఆదాయం ₹ 1,42,095 కోట్లు. అందులో సీజీఎస్టీ ₹ 25,830 కోట్లు. ఎస్జీఎస్టీ ₹ 32,378 కోట్లు. ఐజీఎస్టీ ₹ 74,470 కోట్లు (వస్తువులు దిగుమతులపై ₹ 39,131 కోట్లతో కలిపి వసూలు అయింది). ₹ 9,417 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన ₹ 981 కోట్లతో సహా). మార్చి'2022లో స్థూల జీఎస్టీ సేకరణ మునపటి అన్ని సందర్భాల్లో కన్నా అత్యధికంగా వసూలు చేసిన రికార్డ్ నమోదయింది. జనవరి 2022 నెలలో ₹ 1,40,986 కోట్లు వసూలు చేసింది. ప్రభుత్వం సాధారణ సెటిల్‌మెంట్‌గా ₹ 29,816 కోట్లను సీజీఎస్టీకి, ₹ 25,032 కోట్లను ఎస్జీఎస్టీకి సెటిల్ చేసింది. అంతేకాకుండా కేంద్రం ఈ నెలలో కేంద్రం మరియు రాష్ట్రాలు/యూటీల మధ్య 50:50 నిష్పత్తిలో తాత్కాలిక ప్రాతిపదికన రూ.20,000 కోట్ల ఐజీఎస్టీ సెటిల్ చేసింది. సాధారణ మరియు తాత్కాలిక పరిష్కారాల తర్వాత మార్చి 2022 నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీస్టీ కింద ₹ 65646 కోట్లు మరియు ఎస్జీఎస్టీ కింద ₹ 67410 కోట్లుగా నమోదయింది. ఈ నెలలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు  ₹ 18,252 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం విడుదల చేసింది.

మార్చి 2022 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే 15% ఎక్కువ. అది మార్చి 2020లో జీఎస్టీ రాబడి కంటే 46% ఎక్కువ. ఆ నెలలో, వస్తువుల దిగుమతి ద్వారా వచ్చే ఆదాయాలు 25% ఎక్కువగా ఉన్నాయి. ఆదాయాలు దేశీయ లావాదేవీల నుండి (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 11% ఎక్కువ. ఫిబ్రవరి 2022 నెలలో జనరేట్ చేయబడిన మొత్తం ఇ-వే బిల్లుల సంఖ్య 6.91 కోట్లు, జనవరి 2022 నెలలో (6.88 కోట్లు) జనరేట్ చేయబడిన ఇ-వే బిల్లులు తక్కువ నిడివి నెల అయినప్పటికీ, ఇది వ్యాపార కార్యకలాపాలు వేగవంతమైన పునరుద్ధరణను సూచిస్తుంది.

2021-22 ఆర్ధిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు ₹ 1.38 లక్షల కోట్లు కాగా మొదటి, రెండవ మరియు మూడవ త్రైమాసికాల్లో వరుసగా ₹ 1.10 లక్షల కోట్లు, ₹ 1.15 లక్షల కోట్లు మరియు 1.30 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ముఖ్యంగా నకిలీ బిల్లర్లపై చర్యలు మెరుగైన జీఎస్టీకి దోహదం చేస్తున్నాయి. ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేయడానికి కౌన్సిల్ చేపట్టిన వివిధ రేట్ల హేతుబద్ధీకరణ చర్యల వల్ల కూడా ఆదాయంలో మెరుగుదల జరిగింది.

దిగువ చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జీఎస్టీ రాబడిలో ట్రెండ్‌లను చూపుతుంది. మార్చి 2021తో పోల్చితే, మార్చి 2022 నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన జీఎస్టీ రాష్ట్రాల వారీ గణాంకాలను పట్టిక చూపుతుంది.

 

రాష్ట్రాల వారీ జీఎస్టీ రెవిన్యూ వృద్ధి 2022 మర్చి నెలలో :

 

రాష్ట్రం 

మర్చి -21

మర్చి -22

వృద్ధి 

1

జమ్మూ కాశ్మీర్ 

352

368

5%

2

హిమాచల్ ప్రదేశ్ 

687

684

0%

3

పంజాబ్ 

1,362

1,572

15%

4

చండీగఢ్ 

165

184

11%

5

ఉత్తరాఖండ్ 

1,304

1,255

-4%

6

హర్యానా 

5,710

6,654

17%

7

ఢిల్లీ 

3,926

4,112

5%

8

రాజస్థాన్ 

3,352

3,587

7%

9

ఉత్తరప్రదేశ్ 

6,265

6,620

6%

10

బీహార్ 

1,196

1,348

13%

11

సిక్కిం 

214

230

8%

12

అరుణాచల్ ప్రదేశ్ 

92

105

14%

13

నాగాలాండ్ 

45

43

-6%

14

మణిపూర్ 

50

60

18%

15

మిజోరాం 

35

37

5%

16

త్రిపుర 

88

82

-7%

17

మేఘాలయ 

152

181

19%

18

అస్సాం 

1,005

1,115

11%

19

పశ్చిమ బెంగాల్ 

4,387

4,472

2%

20

ఝార్ఖండ్ 

2,416

2,550

6%

21

ఒడిశా 

3,285

4,125

26%

22

ఛత్తీస్గఢ్ 

2,544

2,720

7%

23

మధ్యప్రదేశ్ 

2,728

2,935

8%

24

గుజరాత్ 

8,197

9,158

12%

25

దామన్ డయ్యు 

3

0

-92%

26

దాద్రా, నగర్ హవేలీ 

288

284

-2%

27

మహారాష్ట్ర 

17,038

20,305

19%

29

కర్ణాటక 

7,915

8,750

11%

30

గోవా 

344

386

12%

31

లక్షద్వీప్ 

2

2

36%

32

కేరళ 

1,828

2,089

14%

33

తమిళనాడు 

7,579

8,023

6%

34

పుదుచ్చేరి 

161

163

 

***(Release ID: 1813054) Visitor Counter : 168