ప్రధాన మంత్రి కార్యాలయం
బిమ్స్ టెక్ అయిదో శిఖర సమ్మేళనం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
30 MAR 2022 12:10PM by PIB Hyderabad
శ్రేష్ఠుడు, శ్రీ లంక అధ్యక్షుడు,
బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాల కు చెందిన నా మిత్రులు మరియు తోటి నేత లు,
బిమ్స్ టెక్ సెక్రట్రి జనరల్,
నమస్కారం.
ఈ రోజు న, బిమ్స్ టెక్ అయిదో శిఖర సమ్మేళనం లో మీ అందరినీ కలుసుకొని నేను చాలా సంతోషం గా ఉన్నాను. బిమ్స్ టెక్ ఏర్పడిన తరువాత ఇది 25వ సంవత్సరం. ఈ కారణం గా నేటి శిఖర సమ్మేళనాని కి ప్రత్యేక ప్రాముఖ్యం ఉందని నేను అనుకొంటున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి శిఖర సమ్మేళనం యొక్క పరిణామాలు బిమ్స్ టెక్ యొక్క చరిత్ర లో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తాయి.
శ్రేష్ఠులారా,
గడచిన రెండు సంవత్సరాల కాలం లో సవాళ్ళ తో నిండిన వాతావరణం లో అధ్యక్షుడు శ్రీ రాజపక్స కుశలమైన నాయకత్వాన్ని ఇచ్చారు. అన్నింటి కంటే ముందు నేను ఆయన ను అభినందిస్తున్నాను. ప్రస్తుతం సవాలు తో నిండినటువంటి ప్రపంచ ముఖచిత్రం తాలూకు ప్రభావాని కి మన ప్రాంతం దూరం గా ఏమీ లేదు. మన ఆర్థిక వ్యవస్థలు, మన ప్రజలు, కోవిడ్-19 మహమ్మారి తాలూకు దుష్ప్రభావాల ను ఇప్పటికీ ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు.
గత కొన్ని వారాలు గా యూరోప్ లోని పరిణామాల తో అంతర్జాతీయ వ్యవస్థ యొక్క స్థిరత్వం పై ప్రశ్నచిహ్నం ఏర్పడింది. ఈ సందర్భం లో, బిమ్స్ టెక్ ప్రాంతీయ సహకారాన్ని మరింత చురుకు గా రూపొందించడం అనేది ముఖ్యం అయిపోయింది. మన ప్రాంతీయ భ్రదత కు మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడం కూడా తప్పనిసరి అయిపోయింది.
శ్రేష్ఠులారా,
ఈ రోజు, మనం బిమ్స్ టెక్ చార్టర్ ను ఆమోదించడం జరుగుతున్నది. ఒక సంస్థాగత స్వరూపాన్ని ఏర్పాటు చేసే దిశ లో మనం సాగిస్తున్న ప్రయాసల లో ఇది ఒక ముఖ్యమైన అడుగు గా ఉంది. దీనికి గాను నేను చైర్ మన్ కు ధన్యవాదాలను వ్యక్తం చేస్తున్నాను. చార్టర్ లో భాగం గా మనం ప్రతి రెండు సంవత్సరాల కు శిఖరాగ్ర సమావేశాల ను మరియు ఏటా విదేశీ మంత్రుల సమావేశాన్ని నిర్వహించుకోవాలని నిర్ణయించాం. నేను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు ఈ స్వరూపాన్ని మరింత గా ఎలా బలపరచుకోవాలో అనే దాని మీద మనం శ్రద్ధ తీసుకోవాలి.
ఈ సందర్భం లో ఒక దార్శనిక పత్రాన్ని తయారు చేయడం కోసం ప్రముఖ వ్యక్తుల సమూహాన్ని ఏర్పాటు చేయాలని సెక్రట్రి జనరల్ సూచన చేశారు. నేను ఈ సూచన కు సమ్మతిని ఇస్తున్నాను. బిమ్స్ టెక్ మన ఆకాంక్షల ను నెరవేర్చేటట్లుగా చూడాలి అంటే దీనికై సచివాలయం యొక్క సామర్ధ్యాన్ని పెంచడం అనేది కూడా ముఖ్యం. నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే అది - ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక మార్గసూచీ ని సెక్రట్రి జనరల్ రూపొందించాలి- అనేదే. ఈ మహత్వపూర్ణమైన కార్యాన్ని సకాలం లో పూర్తి చేయడం కోసం, అంతేకాక అపేక్షల కు అనుగుణం గా పూర్తి చేయడం కోసం భారతదేశం సచివాలయం యొక్క నిర్వహణ బడ్జెటు ను పెంచడానికి గాను ఒక మిలియన్ డాలర్ ల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
శ్రేష్ఠులారా,
మనం పరస్పర వ్యాపారాన్ని పెంచడం కోసం బిమ్స్ టెక్ ఎఫ్ టిఎ ప్రతిపాదన విషయం లో శీఘ్ర ప్రగతి ని సాధించడం అనేది అవసరం. మనం మన దేశాల లో నవ పారిశ్రామికవేత్తల కు మరియు స్టార్ట్-అప్స్ కు మధ్య ఆదాన ప్రదానాల ను కూడా పెంపొందింపచేసుకోవాలి. దీనితో పాటు, మనం వ్యాపార సుగమత రంగం లో అంతర్జాతీయ ప్రమాణాల ను అనుసరించడం కోసం కూడా ప్రయత్నించాలి. దీనివల్ల బిమ్స్ టెక్ దేశాల మధ్య వ్యాపారం మరియు ఆర్థిక ఏకీకరణల కు దన్ను లభించగలదు. ఈ సందర్భం లో, మన అధికారుల లో అవగాహన ను అధికం చేయడం కోసం ఎడిబి తో ఇండియన్ కౌన్సిల్ ఫార్ రిసర్చ్ ఆన్ ఇంటర్ నేశనల్ ఇకానామిక్ రిలేశన్స్ కలసి ఒక కార్యక్రమాన్ని త్వరలోనే మొదలు పెట్టబోతోంది. ఈ కార్యక్రమం లో అన్ని దేశాల సంబంధిత అధికారులు పాలుపంచుకొంటారని నేను ఆశ పడుతున్నాను.
శ్రేష్ఠులారా,
మన మధ్య మెరుగైన ఏకీకరణ, మెరుగైన వ్యాపారం మరియు మెరుగైన ప్రజా సంబంధాలు ఏర్పడాలి అంటే గనుక అందుకోసం మెరుగైన సంధానం అనేది ముఖ్యాధారం అవుతుంది. ఈ విషయం లో మనం ఎంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పటికీ అది తక్కువ గానే ఉంది. ఈ రోజు న మనం బిమ్స్ టెక్ యొక్క మాస్టర్ ప్లాన్ ఫార్ ట్రాన్స్ పోర్ట్ కనెక్టివిటి కి ఆమోదం తెలిపాం. దీనిని సిద్ధం చేసినందుకు గాను నేను ఎడిబి కి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. మనం ఈ మాస్టర్ ప్లాను ను త్వరిత గతి న అమలు చేయడం పై శ్రద్ధ తీసుకోవాలి.
పాటు గా, సంధానం రంగం లో ఈసరికే కొనసాగుతున్నటువంటి కార్యక్రమాల ను కూడా మనం శీఘ్రం గా ముందుకు తీసుకు పోవలసి ఉంది. బంగాళాఖాతం లో ఒక ‘కోస్టల్ శిప్పింగ్ ఇకో-సిస్టమ్’ను ఏర్పాటు చేయడం కోసం ఒక చట్టబద్ధమైనటువంటి ఫ్రేమ్ వర్క్ ను త్వరగా తయారు చేయవలసిన అవసరం ఉంది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్ ఇంటర్-కనెక్టివిటి ని కూడా చర్చల దశ నుంచి ముందుకు తీసుకు పోయి క్షేత్ర స్థాయి లో అమలు దశ కు చేర్చవలసిన సమయం వచ్చేసింది. ఇదే విధం గా రహదారి సంధానాన్ని పెంపు చేయడం కోసం కూడా ఒక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయడం అనేది మహత్వపూర్ణమైంది.
శ్రేష్ఠులారా,
ప్రాకృతిక ఆపద ల ప్రమాదం అనేది మన ప్రాంతాని కి ఎల్లవేళలా పొంచి ఉన్నది. విపత్తు నిర్వహణ, ప్రత్యేకించి విపత్తు నష్ట భయం తగ్గింపు సంబంధి అంశాల లో సహకారం కోసం, బిమ్స్ టెక్ సెంటర్ ఫార్ వెదర్ ఎండ్ క్లయిమేట్ అనేది ఒక ముఖ్య సంస్థ గా ఉంది. మరి దీనిని క్రియాత్మకం గా తీర్చిదిద్దడం కోసం నేనను మీ అందరి సహకారాన్ని కోరుకొంటున్నాను. ఈ కేంద్రం తాలూకు పనుల ను పునఃప్రారంభించడం కోసం భారతదేశం మూడు మిలియన్ డాలర్ లను సమకూర్చడాని కి సిద్ధం గా ఉంది.
భారతదేశం ఇటీవల బిమ్స్ టెక్ మూడో విపత్తు నిర్వహణ అభ్యాసాన్ని నిర్వహించింది; అదే ‘‘పానెక్స్ 21’’. ఈ కోవ కు చెందిన అభ్యాసాల ను క్రమం తప్పక చేపడుతూ ఉండాలి. అదే జరిగితే గనక, మన అధికారుల మధ్య ఆపద కాలాల్లో కలసి పని చేసే సంస్థాత్మక వ్యవస్థ పటిష్టం అవుతుంది.
శ్రేష్ఠులారా,
నాణ్యమైనటువంటి విద్య కు సంబంధించినటువంటి సస్ టేనబుల్ డివెలప్ మెంట్ గోల్స్ ను అందుకోవాలి అనేది మన అందరి జాతీయ విధానాల లో మహత్వపూర్ణ భాగం గా ఉంది. నాలందా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అందజేసే బిమ్స్ టెక్ స్కాలర్ శిప్ స్కీము ను విస్తరించే, దాని పరిధి ని పెంచే దిశ లో మేం కృషి చేస్తున్నాం. బంగాళాఖాతాన్ని కేంద్ర స్థానం లో పెట్టుకొని, సముద్ర సంబంధి విజ్ఞానశాస్త్రాల కు సంబంధించిన సంయుక్త పరిశోధన ను ప్రోత్సహించడం కోసం కూడాను ప్రయత్నాలు చేస్తున్నాం. వ్యవసాయ రంగం అనేది బిమ్స్ టెక్ దేశాల ఆర్థిక వ్యవస్థ కు ఆధారం గా ఉంది. మన మధ్య విలువ ను జోడించిన వ్యావసాయిక ఉత్పాదన ల తాలూకు రీజనల్ వేల్యూ చైన్ లను ఏర్పాటు చేసేందుకు చక్కని అవకాశాలు ఉన్నాయి. దీనికి గాను మనం భారతదేశాని కి చెందిన ఆర్ఐఎస్ కు ఒక విస్తృత మైనటువంటి అధ్యయనాన్ని చేపట్టే బాధ్యత ను అప్పగించాం.
భద్రత లేనిదే మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం గాని, లేదా సమృద్ధి యుక్తం గా మలచడానికి గాని పూచీ పడటం అయ్యే పని కాదు. కాఠ్ మాండూ లో మనం నిర్వహించుకొన్నటువంటి నాలుగో శిఖర సమ్మేళనం లో మనం ఉగ్రవాదం, ట్రాన్స్ నేశనల్ క్రైమ్ మరియు సాంప్రదాయేతర బెదరింపుల కు వ్యతిరేకం గా ప్రాంతీయ చట్ట సంబంధి ఫ్రేమ్ వర్క్ ను దృఢతరం చేయాలి అనే నిర్ణయాన్ని తీసుకొన్నాం. మనం మన చట్ట అమలు సంస్థ ల మధ్య సహకారాన్ని పెంపొందింప చేసుకోవాలి అని కూడా నిర్ణయించుకొన్నాం. ఉగ్రవాదం పై పోరాడటాని కి మనం ఆమోదించిన ఒప్పందం గడచిన సంవత్సరం మొదలుకొని అమలు లోకి రావడం నాకు సంతోషాన్ని కలిగించింది. నేటి శిఖర సమ్మేళనం కాలం లో నేర సంబంధి వ్యవహారాల తాలూకు పరస్పర చట్టబద్ధ సహాయం ప్రధానం అయినటువంటి ఒక ఒడంబడిక పైన కూడా సంతకాలు అవుతున్నాయి. ఈ తరహా ఇతర పత్రాల పైన కూడా మనం చాలా వేగం గా ముందుకు కదలవలసివుంది. అదే జరిగితే మన చట్ట వ్యవస్థల మధ్య మెరుగైన సమన్వయం ఏర్పడేందుకు వీలు ఉంటుంది.
ఈ రోజు న మన దౌత్యపరమైనటువంటి శిక్షణ సంస్థల మధ్య సహకారం కోసం ఒక ఒప్పందం పైన సంతకాలు అవుతున్నాయి. ఇటువంటిదే ఒక ఒప్పందాన్ని మనం మన చట్టం అమలు సంబంధి శిక్షణ సంస్థల మధ్య కూడా కుదుర్చుకొనేందుకు ఆస్కారం ఉంది. భారతదేశం లోని ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటి తన రంగం లో ఓ విశిష్టమైనటువంటి సంస్థ గా మరియు ప్రపంచ శ్రేణి సంస్థ గా ఉంది. మేం ఇందులో బిమ్స్ టెక్ దేశాల కు చెందిన పోలీసు అధికారులకు మరియు న్యాయ సంబంధి వైద్య శాస్త్ర అధికారుల కోసం సామర్ధ్యాల ను పెంచే వ్యవస్థ లను కూడా జతచేయవచ్చును.
శ్రేష్ఠులారా,
ప్రస్తుతం ఎప్పుడైతే మన ప్రాంతం ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రత ల తాలూకు సవాళ్ల ను ఎదుర్కొంటోందో, మన మధ్య సంఘీభావం, ఇంకా సహకారం తక్షణావసరం గా రూపుదాల్చుతాయి. బంగాళాఖాతాన్ని ఒక సంధాన సేతువు గాను, ఒక సమృద్ధి సేతువు గాను, ఒక భద్రత సేతువు గాను తీర్చిదిద్దుకోవలసిన సమయం ఇది. 1997వ సంవత్సరం లో ఏ లక్ష్యాల సాధన కోసం అయితే మనం కలసి పయనించాలి అని నిర్ణయించుకొన్నామో ఆ లక్ష్యాల ను సాధించుకోవడం కోసం ఒక సరికొత్త ఉత్సాహం తో, సరికొత్త శక్తి తో మరో మారు మనల ను మనం అంకితం చేసుకొందాం అని నేను మీ కందరికీ పిలుపునిస్తున్నాను.
ప్రధాని శ్రీ ప్రయుత్ చాన్-ఓ-ఛా, బిమ్స్ టెక్ కు తదుపరి అధ్యక్ష స్థానం లోకి, థాయీలాండ్ ను నేను స్వాగతిస్తున్నాను, నా శుభాకాంక్షల ను కూడా తెలియజేస్తున్నాను.
మీకు అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగాని కి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
***
(Release ID: 1812218)
Visitor Counter : 164