ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జీ 211 వ జయంతి సందర్భంగా పశ్చిమబెంగాల్ లో్ని ఠాకూర్‌బరిలోని ఠాకూర్‌నగర్ శ్రీధామ్‌లో మతువా ధర్మ మహామేళా 2022 నుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
“ మన చెల్లెళ్లు, కుమార్తెలు దేశనిర్మాణంలో సమాజంలోని ప్రతి రంగంలో తమ వంతుపాత్ర పోషిస్తుండడం గమనించినపుడు, గొప్ప వ్యక్తులైన శ్రీ శ్రీ హరిచంద్‌ఠాకూర్ జీ వంటి వారికి ఇదే సరైన ఘన నివాళి అనిపిస్తుంటుంది.”
“ సబ్ కా సాథ్ , సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ప్రాంతిపదికన ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళుతున్నప్పుడు, అలాగే సబ్ కా ప్రయాస్ అనేది దేశ అభివృద్ధిని ముందుకుతీసుకుపోతున్నప్పుడు, మనం సమ్మిళిత సమాజం నిర్మాణం దిశగా ముందుకు వెళతాం”.
“ మన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు కల్పించింది. మనం మన విధులను నిజాయితీగా నిర్వర్తించినపుడే మనం వాటిని కాపాడుకోగలుగుతాం.”
“ ఎక్కడైనా ఎవరైనా వేధింపులకు గురైతే, వెంటనే మీరు మీ గొంతువిప్పండి. ఇది మన సమాజంపట్ల, దేశంపట్ల మన బాధ్యత”
“ ఎవరు ఎవరినైనా కేవలం రాజకీయ వ్యతిరేకతతో హింసించి వేధిస్తే, అది తప్పకుండా ఇతరుల హక్కులను హరించడమే అవుతుంది. అందువల్ల సమాజంలో హింస, అరాచకం ఎక్కడ ఉన్నా దానిని వ్యతిరేకించాలి”
Posted On:
29 MAR 2022 10:01PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్ జీ 211 వ జయంతి సందర్భంగా పశ్చిమబెంగాల్ లో్ని ఠాకూర్‌బరిలోని ఠాకూర్‌నగర్ శ్రీధామ్‌లో మతువా ధర్మ మహామేళా 2022 నుద్దేశించి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు..
తాను ఠాకూర్ నగర్ సందర్శించే అవకాశం దక్కినపుడు 2019 ఫిబ్రవరిలో అలాగే 2021 మార్చిలో బంగ్లాదేశ్ లోని ఒరాకండి ఠాకూర్‌బరిలో తాను వారికి నివాళులర్పించి నమస్కరించుకునే అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.
మథేవా ధర్మ మహామేళా అనేది మతువా సంప్రదాయానికి శిరసు వంచి నమస్కరించుకునేందుకు లభించిన అవకాశమని ప్రధానమంత్రి అన్నారు. ఈ సంప్రదాయానికి శ్రీశ్రీహరిచంద్ ఠాకూర్‌జీ వ్యవస్థాపకులని, దీనిని గురుచంద్ ఠాకూర్ జీ, బోరో మా లుమరింత ముందుకు తీసుకువెళ్లారని ఆయన అన్నారు.ఈ గొప్పసంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకుపోతున్న తన మంత్రివర్గ సహచరుడు శ్రీ శంతను ఠాకూర్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
ఈ మహామేళా, ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌కు ప్రతిరూపమని ఆయన అన్నారు. మన సంస్కృతి, నాగరికత ఎంతో గొప్పవని, వాటి నిరంతర ప్రవాహం , కొనసాగింపు కారణంగా అవి ఎంతో గొప్పవని, స్వీయ పునరుద్ధరణకు సహజ లక్షణాన్ని అవి కలిగి ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు. మతువా కమ్యూనిటీ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నవభారతదేశం, పరిశుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని దేశంలోని తమ కుమార్తెలకు అందించేందుకు సాగిస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మన చెల్లెళ్లు, కుమార్తెలు దేశనిర్మాణంలో సమాజంలోని ప్రతి రంగంలో తమ వంతుపాత్ర పోషిస్తుండడం గమనించినపుడు, గొప్ప వ్యక్తులైన శ్రీ శ్రీ హరిచంద్‌ఠాకూర్ జీ వంటి వారికి ఇదే సరైన ఘన నివాళి అనిపిస్తుంటుంది అని ప్రధానమంత్రి అన్నారు.
సబ్ కా సాథ్ , సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ ప్రాంతిపదికన ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళుతున్నప్పుడు, అలాగే సబ్ కా ప్రయాస్ అనేది దేశ అభివృద్ధిని ముందుకుతీసుకుపోతున్నప్పుడు, మనం సమ్మిళిత సమాజం నిర్మాణం దిశగా ముందుకు వెళతాం” అని ప్రధానమంత్రి అన్నారు. శ్రీ శ్రీ హరిచంద్ ఠాకూర్‌జీని స్మరించుకుంటూ ప్రధానమంత్రి, పవిత్ర ప్రేమతోపాటు ప్రతి వారూ తమబాధ్యతలను గుర్తెరగాలని శ్రీశ్రీ హరిచంద్ ఠాకూర్‌జీ నొక్కి చెప్పేవారని అన్నారు. ప్రజా జీవితంలో పౌరుల విధుల పాత్ర గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. “ మన విధుల పట్ల బాధ్యతతో ఉండే స్పృహ కలిగి ఉండాలి. ఇదే దేశ అభివృద్ధికి ప్రాతిపదిక అవుతుంది. మన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు కల్పించింది. మనం మన విధులను నిజాయితీగా నిర్వర్తించినప్పుడే వాటిని కాపాడుకోగలం” అని ప్రధానమంత్రి అన్నారు.
సమాజంలోని అన్ని స్థాయిలలో అవినీతిని రూపుమాపేందుకు అవగాహన కల్పించాల్సిందిగా మథువా కమ్యూనిటీకి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
“ ఎక్కడైనా ఎవరైనా వేధింపులకు గురైతే, వెంటనే మీరు మీ గొంతువిప్పండి. ఇది మన సమాజంపట్ల, దేశంపట్ల మన బాధ్యత” అనిప్రధానమంత్రి అన్నారు. రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం మన ప్రజాస్వామిక హక్కు అని అంటూ ప్రధానమంత్రి,
“ ఎవరు ఎవరినైనా కేవలం రాజకీయ వ్యతిరేకతతో హింసించి వేధిస్తే, అది తప్పకుండా ఇతరుల హక్కులను హరించడమే అవుతుంది. అందువల్ల సమాజంలో హింస, అరాచకం ఎక్కడ ఉన్నా దానిని వ్యతిరేకించాలి” అని పిలుపునిచ్చారు.
స్వచ్ఛత, ఓకల్ ఫర్ లోకల్, దేశమే అన్నిటికంటే ముందు అన్న మంత్రాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
***
(Release ID: 1811475)
Visitor Counter : 170
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam