ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 23 MAR 2022 9:20AM by PIB Hyderabad

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కు ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి చరిత్ర పుటల లో నుంచి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంగతుల ను వెల్లడించారు. వాటి లో డాక్టర్ లోహియా గారు లార్డ్ లిన్ లిథ్ గో కు రాసినటువంటి ఒక లేఖ మరియు డాక్టర్ లోహియా తండ్రి గారి కి మరియు డాక్టర్ లోహియా కు మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో ఇలా పేర్కొన్నారు:

‘‘డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ను ఆయన జయంతి నాడు స్మరించుకొంటున్నాను. ఆయన అనేక చరిత్రాత్మక ఘటనల లో అందరి కంటే ముందున్నారు. అంతేకాకుండా, మన స్వాతంత్య్ర పోరాటం లో ఆయన కీలకమైనటువంటి పాత్ర ను పోషించారు. సైద్ధాంతిక రాజకీయాలకు మరియు బౌద్ధిక కుశలత కు గాను విస్తృత స్థాయి లో ఆయన ను చాలా గౌరవించడం జరుగుతోంది.’’

 

‘‘చరిత్ర తాలూకు పేజీలలో నుంచి కొన్ని ఆసక్తిదాయకమైనటువంటి అంశాల ను గమనించండి.. డాక్టర్ లోహియా గారు లార్డ్ లిన్ లిథ్ గో కు రాసిన ఒక లేఖ తో పాటు డాక్టర్ లోహియా తండ్రి గారికి మరియు డాక్టర్ లోహియా కు మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలు చూడండి.’’

 


(रिलीज़ आईडी: 1808614) आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada