ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 12-14 సంవత్సరాల మధ్య వయస్సు వారికి కోవిడ్-19 టీకాలు


ప్రభుత్వ కోవిడ్ టీకా కేంద్రాల్లో 12-14 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఉచితంగా టీకా

12 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మాత్రమే కోవిడ్-19 ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు

60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ టీకాలు వేసేందుకు అవసరమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి

Posted On: 15 MAR 2022 1:28PM by PIB Hyderabad

జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా  12-14 సంవత్సరాల మధ్య వయస్సు వారికి కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమం రేపటి నుంచి అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభం కానున్నది. ప్రభుత్వ కోవిడ్ టీకా కేంద్రాల్లో 12-14 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఉచితంగా టీకా వేస్తారు. బయోలాజికల్ ఇ. లిమిటెడ్హైదరాబాద్‌ అభివృద్ధి చేసిన  కార్బెవాక్స్ ను వేయడం జరుగుతుంది. టీకా కోసం ఆన్‌లైన్లో  (16 మార్చి 2022 ఉదయం 9 గంటల నుంచి  )  రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీకా వేసే కేంద్రాలకు స్వయం వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత  ప్రాంతాలతో ఈరోజు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ  శ్రీ రాజేష్ భూషణ్ ఈ వివరాలను వెల్లడించారు. 

2022 మార్చి 16వ తేదీ నుంచి 12-13 సంవత్సరాలు మరియు 13-14 సంవత్సరాల వయస్సు గల వారికి (2008, 2009 మరియు 2010లో జన్మించి ఇప్పటికే 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా రేపటి నుంచి 60 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్త టీకా తీసుకోవచ్చు. ఈ వయస్సు వారికి టీకా వేసే అంశంలో అమలు చేసిన ఆరోగ్యపరమైన నిబంధనలను ప్రభుత్వం  తొలగించింది. ముందు జాగ్రత్త మోతాదు (మునుపటి రెండు మోతాదుల మాదిరిగానే) రెండవ టీకా తీసుకున్న తేదీ తర్వాత 9 నెలల (36 వారాలు) తర్వాత ఇవ్వాలి. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు  మరియు UTలకు వివరణాత్మక సూచనలు మరియు కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.  

12 ఏళ్లు నిండిన వారికి మాత్రమే కోవిడ్‌19 టీకాలు వేసే  విధంగా చర్యలు తీసుకోవాలని  రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. టీకా తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ సంబంధిత వ్యక్తి వయస్సు 12 సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే టీకా వేయరాదని కేంద్రం స్పష్టం చేసింది. టీకాలు కలిసి పోకుండా చూసేందుకు టీకాలు వేసే వారికి, టీకా వేసే బృందానికి  తగిన శిక్షణ ఇవ్వాలని కేంద్రం పేర్కొంది.  ఇతర వ్యాక్సిన్‌లతో కలపకుండా ఉండేందుకు 12-14 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలు వేయడానికి కేటాయించిన కోవిడ్ -19 టీకా కేంద్రాల ద్వారా ప్రత్యేక సమయాన్ని నిర్ణయించాలని కూడా   రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది.

వయో వర్గం

వేయాల్సిన టీకా 

12-14 సంవత్సరాలు (2008, 2009, 2010 సంవత్సరంలో జన్మించిన లబ్ధిదారుల అందరూ)

కార్బెవాక్స్  (ప్రభుత్వ సీవీసీ లో), 28 రోజుల వ్యవధిలో మోతాదులు

14-18 సంవత్సరాలు

కోవాక్సిన్ (ప్రభుత్వ   సీవీసీ  లు మరియు ప్రైవేట్   సీవీసీ  ల వద్ద)

 

ప్రస్తుతం కో విన్ లో లబ్ధిదారుల వయస్సు పుట్టిన సంవత్సరం ఆధారంగానిర్ణయించబడుతుందని  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం తెలియజేసింది.  కో-విన్ పోర్టల్‌లో ఖచ్చితమైన పుట్టిన తేదీని రికార్డ్ చేసే నిబంధన అమలులో  ఉన్నందునమొదటి కొన్ని రోజులలో టీకా వేసే  సమయంలో వయస్సు (12 సంవత్సరాలు)  ధృవీకరణ బాధ్యత వ్యాక్సినేటర్/వెరిఫైయర్‌పై ఉంటుంది. సిస్టమ్ డిఫాల్ట్‌గా  ఒకసారి అమలు చేసిన తర్వాతఅర్హత  వయస్సు లేని లబ్ధిదారుల నమోదును జరగదు.

వ్యాధి సోకే అవకాశం ఉన్న వారికి టీకాలు వేసే కార్యక్రమం  నెమ్మదిగా సాగడం పట్ల కేంద్రం అసంతృప్తివ్యక్తం చేసింది , 60 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్  రెండు డోస్‌లు వేసేలా చర్యలు తీసుకోవాలని   రాష్ట్రాలను కోరారు. అర్హులైన లబ్ధిదారుల టీకా వేసేలా చూసేందుకు జిల్లా,  బ్లాక్ స్థాయిలలో తరచూ  సమీక్షలు నిర్వహించబడతాయి.

అందుబాటులో ఉన్న కోవిడ్ 19 వ్యాక్సిన్‌లను సక్రమంగా  వినియోగించుకునేలా చూడాలని రాష్ట్రాలకు సూచనలు జారీ చేయడం జరిగింది . మునుపటి మార్గదర్శకాల ప్రకారంవు ముగిసే వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంది.  టీకాలు వృధా కాకుండా చూసేందుకు వాటిని రాష్ట్రంలోని ఒక జిల్లా నుంచి  మరొక జిల్లాకు పంపేందుకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది .

వర్చువల్ సమావేశంలో ఆరోగ్య కార్యదర్శితో పాటు అదనపు కార్యదర్శి  (హెల్త్) డాక్టర్ మనోహర్ అగ్నానీ, జాతీయ ఆరోగ్య  మిషన్ డైరెక్టర్లు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు  చెందిన అధికారులు పాల్గొన్నారు.           

 

***



(Release ID: 1806564) Visitor Counter : 345