ప్రధాన మంత్రి కార్యాలయం
చదరంగం లో ప్రముఖ విజేత శ్రీ మేగ్ నస్ కార్ల్ సన్ తో ఆర్. ప్రజ్ఞానంద పోటీ పడి గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
23 FEB 2022 3:18PM by PIB Hyderabad
ఆన్ లైన్ మాధ్యమం ద్వారా జరిగిన చదరంగం ఆటల పోటీ లో చిరంజీవి ఆర్. ప్రజ్ఞానంద ప్రముఖ విజేత శ్రీ మేగ్ నస్ కార్ల్ సన్ తో పోటీ పడి, గెలుపు ను సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘యువ మేధావి ఆర్. ప్రజ్ఞానంద సఫలత ను చూసుకొని మనమంతా సంతోషిస్తున్నాం. చిరంజీవి ఆర్. ప్రజ్ఞానంద ప్రముఖ విజేత శ్రీ మేగ్ నస్ కార్ల్ సన్ తో పోటీ పడి, గెలిచినందుకు గర్వంగా ఉంది. ప్రతిభాశాలి అయిన ప్రజ్ఞానంద భావి ప్రయాసల లో సైతం రాణించాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1800585)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam