ప్రధాన మంత్రి కార్యాలయం
ఠాణే ను , దివా ను కలిపే రైల్ వే లైనుల ను ఫిబ్రవరి 18న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధానమంత్రి
ముంబయి సబ్ అర్బన్ రైల్ వే కు చెందిన సబ్ అర్బన్ రైళ్ళ కు కూడా ప్రధాన మంత్రి జెండా ను చూపి వాటిని ఆరంభించనున్నారు
దాదాపు గా 620 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం జరిగిన ఈ అదనపు రైల్వే లైను లు సబ్ అర్బన్ రైలు రాకపోకల లో దూర ప్రాంత రైళ్ళ రాకపోకల లో ఏర్పడుతున్నఅంతరాయాన్ని చాలా వరకు తొలగించనున్నాయి
36 కొత్త సబ్ అర్బన్ రైలుబండ్ల ను ప్రారంభించడానికికూడా ఈ పట్టాలు తోడ్పడనున్నాయి
Posted On:
17 FEB 2022 12:42PM by PIB Hyderabad
ఠాణే ను, దివా ను కలిపే రెండు అదనపు రైల్ వే లైన్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ న సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ముంబయి సబ్ అర్బన్ రైల్ వే కు చెందిన రెండు కొత్త సబ్ అర్బన్ రైళ్ళ కు కూడా ఆయన ప్రారంభ సూచక జెండా ను చూపనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ఇదే సందర్భం లో ఆయన ప్రసంగిస్తారు.
సెంట్రల్ రైల్ వే లో కళ్యాణ్ ఒక ప్రధానమైన జంక్షన్ గా ఉంది. దేశం లో ఉత్తరం వైపు నుంచి మరియు దక్షిణం వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కళ్యాణ్ లో కలుసుకొంటుంది. మరి తరువాత సిఎస్ఎమ్ టి (ఛత్రపతి శివాజి మహారాజ్ టర్మినస్) వైపునకు సాగిపోతుంది. కళ్యాణ్ కు మరియు సిఎస్ఎమ్ టి కి మధ్య నాలుగు రైలు మార్గాలు ఉండగా వాటిలో రెండు మార్గాల ను మెల్లగా సాగుతూ పోయే లోకల్ రైళ్ళ కోసం వినియోగిస్తుండగా, మిగిలిన రెండు రైలు మార్గాల ను వేగం గా వెళ్ళే లోకల్, మెయిల్ ఎక్స్ ప్రెస్, ఇంకా సరకుల రవాణా రైలుబండ్ల కు వినియోగించడం జరుగుతోంది. సబ్ అర్బన్ రైళ్ళ ను మరియు దూర ప్రాంత రైళ్ళ ను వేరు చేయడం కోసం రెండు అదనపు రైలు మార్గాల నిర్మాణాని కి ప్రణాళిక ను సిద్ధం చేయడమైంది.
ఠాణే ను, దివా ను కలిపే రెండు అదనపు రైలు లైన్ లను దాదాపు గా 620 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. దీనిలో 1.4 కిలో మీటర్ ల పొడవైన రైలు ఫ్లయ్ ఓవర్, మూడు పెద్ద వంతెన లు, 21 చిన్న వంతెన లు భాగం గా ఉన్నాయి. ఈ లైన్ లు ముంబయి లో సబ్ అర్బన్ రైళ్ళ రాకపోకల తో పాటు దూర ప్రాంత రైలుబండ్ల రాకపోకల లో ఏర్పరుస్తున్న అంతరాయాన్ని చాలా వరకు తగ్గించ గలుగుతాయి. ఈ రైలు మార్గాల తో నగరం లో 36 కొత్త సబ్ అర్బన్ రైలుబండ్ల ను కూడా నడిపేందుకు వీలవుతుంది.
***
(Release ID: 1799157)
Visitor Counter : 188
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam