ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోడిడ్‌-19 వాస్తవాలు—అసత్య ప్రచారాలు


ఆధికార లెక్కల కంటె భారతేశంలో కోవిడ్‌ మరణాలు ఎక్కువగా ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవ దూరంగా ఊహాజనితంగా ఉన్నాయి.

కోవిడ్‌ మరణాలను నమోదు చేసేందుకు దేశంలో పారదర్శకమైన పటిష్ట యంత్రాంగం అమలులో ఉంది

Posted On: 17 FEB 2022 3:02PM by PIB Hyderabad

భారతదేశంలో కోవిడ్‌ -19 కారణంగా సంబంవించిన  మరణాలు అధికారిక గణన కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ప్రచురించిన ఒక పరిశోధన పత్రం ఆధారంగా కొన్ని మీడియా వార్తలు వచ్చాయి . వాస్తవ సంఖ్యలు తక్కువగా చూపించారని కూడా ఈ వార్తల్లో పేర్కొనడం జరిగింది కోవిడ్‌ బారిన పడి దేశంలో  నవంబర్ 2021 నాటికి 32 నుంచి 37 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అధ్యయనం అంచనా వేసిందని ఈ కథనాలలో పేర్కొన్నారు. అయితే,  2021 నాటికి అధికారిక గణాంకాల ప్రకారం మరణాల సంఖ్య  0.46 మిలియన్ల (4.6 లక్షలు) గా ఉంది.

 గతంలో కూడా ఇటువంటి కథనాలు వెలువడ్డాయి. ఆ సమయంలో కూడా ఈ కథనాలలో వాస్తవం లేదని వివరించడం జరిగింది. ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా  ఈ నివేదికలు తప్పుల తడకగా వాస్తవానికి దూరంగా ఉన్నాయని  తిరిగి  స్పష్టం చేయడం జరిగింది. అవి వాస్తవాలపై ఆధారపడినవి కావు మరియు పూర్తిగా  ఊహాజనితమైనవి గా ఉన్నాయి.

 

 భారతదేశంలో మరణాలను నమోదు చేసేందుకు పటిష్టమైన వ్యవస్థ అమలులో ఉంది.  కోడిడ్‌-19 మరణాలతో సహా మరణాలను దీని ద్వారా నమోదు చేయడం జరుగుతోంది. పారదర్శక విధానంలో మరణాలు నమోదు అవుతాయి. ఇది గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు ఇది అమలులో ఉంది. రాష్రాల నుంచి అందే స్వతంత్ర నివేదికల ద్వారా తుది నివేదికను కేంద్రం సిద్ధం చేస్తుంది.  వివిధ స్థాయిలలో క్రమం తప్పకుండా నివేదికలు సంకలనం చేయబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన వర్గీకరణ ఆధారంగా  భారత ప్రభుత్వం కొవిడ్ మరణాలను వర్గీకరించడానికి స్పష్టమైన విధానాన్ని అమలు చేస్తున్నది. దీనిని రాష్ట్రాలకు పంపడం జరిగింది. ఇదే విధానాన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.మరణాల వివరాలు ఎప్పటికప్పుడు  అందించాలని రాష్ట్రాలను కోరడం జరిగింది. అంతేకాకుండాక్షేత్ర స్థాయిలో నిర్దిష్ట మరణాలు సకాలంలో నమోదు కాని సమయంలో వాటిని నమోదు చేసి తాజా నివేదికలు పంపాలని రాష్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. దీనివల్ల  మహమ్మారి సంబంధిత మరణాలపై పూర్తి సమాచారం కేంద్రానికి అందుతుంది. నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా మరణాల వివరాలను నమోదు చేయాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర అనేక అధికారిక వర్తమానాలు పంపింది. అనేకసార్లు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకుఅనేక కేంద్ర బృందాలు పంపడం జరిగింది. ప్రతిరోజూ జిల్లాల వారీగా కేసులు మరియు మరణాలు నమోదు చేసేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా క్రమం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెబుతోంది. అందువల్లకోవిడ్ మరణాలు తక్కువగా నమోదు అయ్యాయని చెప్పడం ఆధార రహితంగా అర్థరహితంగా ఉంది.

 

 మీడియా నివేదికలలో పేర్కొన్న విధంగా  అధ్యయనం కేరళ జనాభాభారతీయ రైల్వే ఉద్యోగులుఎమ్మెల్యేలు మరియు ఎంపీలు మరియు కర్ణాటకలోని పాఠశాల ఉపాధ్యాయులు అనే నాలుగు విభిన్న ఉప-జనాభాను తీసుకుని చేయడం జరిగింది. దీనిని ఆధారంగా చేసుకుని   దేశవ్యాప్తంగా మరణాలను అంచనా వేయడానికి త్రిభుజాకార ప్రక్రియను ఉపయోగించారు. పరిమిత ప్రాంతాల నుంచి  ముందుగానే నిర్ధారించిన అంశాల ద్వారా  సేకరించిన సమాచారాన్ని భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలకు వర్తింప చేసి తుది అంచనాకు రావడం సరైన విధానం కాదు. కొన్ని ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారాన్ని మొత్తం దేశానికి వర్తింపజేయడం సమర్థనీయం కాదు. ఇటువంటి ప్రయోగాలు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక ప్రాంతంలో సేకరించిన సమాచారం ఆధారంగా మొత్తం దేశానికి సంబంధించి అంచనాలు రూపొందించడం వల్ల సరైన ఫలితాలు రావు. అంచనాలు తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయి. ప్రస్తుత కథనాల్లో కూడా ఇదే జరిగింది.      తాము నిర్వహించిన  అధ్యయనం  ఫలితాలు/అంచనాలు వేరొక అధ్యయనంతో సమ్మిళితం అవుతున్నందున ఆ అధ్యయనానికి విశ్వసనీయత ఉందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. దీనిలో అర్ధం కూడా లేదు. తర్కానికి వ్యతిరేకంగా ఉంది. తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఉంది. పక్షపాత వైఖరితో కథనం ప్రచురించినట్టు తెలుస్తోంది. 

 

 మీడియా కధనాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి.  “భారత పౌర రిజిస్ట్రేషన్ వ్యవస్థ సమగ్రంగా పటిష్టంగా లేదని  నిపుణులు అంటున్నారు. ఆరోగ్య సమాచార వ్యవస్థలతో ప్రస్తుత పౌర  రిజిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తిగా అనుసంధానం కాలేదు. మరణాల నమోదు కూడా సక్రమంగా జరగడం లేదు." అని పేర్కొనడం జరిగింది. అయితే, వీటిలో ఎటువంటి వాస్తవం లేదు. కోవిడ్ సమాచార వ్యవస్థను   కేంద్ర ప్రభుత్వం పారదర్శక విధానంలో అమలు చేసింది.   అన్ని కోవిడ్ -19 సంబంధిత మరణాలు నమోదు చేసే బలమైన వ్యవస్థ ఇప్పటికే అమలులో ఉందని పునరుద్ఘాటించబడింది. నివేదించబడిన మరణాల సంఖ్యను  సక్రమంగా పూర్తిగా నమోదు చేసేందుకు   ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్   ఐసీడ్ -10 కోడ్‌ ను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 'భారతదేశంలో కోవిడ్ -19 సంబంధిత మరణాల సక్రమ నమోదు  కోసం  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్   ఐసీడ్ -10 కోడ్‌ ను విడుదల చేసింది.     మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి కోవిడ్ -19 కేసులు మరియు మరణాల తేదీలు ప్రతిరోజూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడుతున్నాయి.   అదేవిధంగా జిల్లాలతో సహా అన్ని రాష్ట్రాలు ప్రతిరోజూ అన్ని వివరాలతో సాధారణ బులెటిన్‌లను విడుదల చేస్తున్నాయిఇది పబ్లిక్ డొమైన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. 

 

 కోవిడ్ 19 మహమ్మారి వంటి తీవ్రమైన మరియు సుదీర్ఘమైన ప్రజారోగ్య సంక్షోభం సమయంలో మరణాల నమోదులో  తేడాలు నమోదయ్యే అవకాశం ఉంది.  సమస్య ముగిసిన తర్వాత  మరణాలపై లోతుగా  పరిశోధనలు,  అధ్యయనాలు జరుగుతాయి. వీటి ద్వారా విశ్వసనీయ సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది. శాస్త్రీయ పద్ధతుల్లో జరిగే అటువంటి అధ్యయనాల ఫలితాలు విశ్వసనీయంగా ఉంటాయి. వీటి ద్వారా మరణాలపై తుది అంచనాలకు రావచ్చు.   

భారతదేశంలో కోవిడ్ మరణాల నమోదు అంశంలో మరో ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ వల్ల మరణించిన వ్యక్తి కుటుంబం లేదా వారి సమీప బంధువులు నష్టపరిహారం పొందుతున్నారు.  పరిహారం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో కొవిడ్ మరణాల సంఖ్య వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. . 

  ఈ మొత్తం ప్రక్రియను  సుప్రీంకోర్టు  నిరంతరం పర్యవేక్షిస్తుంది. అందువల్లదేశంలో కోవిడ్ మరణాలను తక్కువ చేసి చూపించేందుకు ఏ మాత్రం అవకాశం లేదు.   అందువల్లకుటుంబాలు మరియు స్థానిక అధికారుల అయిష్టత లేదా అసమర్థత కారణంగా మరణాలు తక్కువగా నమోదవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి వాస్తవం లేదు  తప్పు మరియు సత్యానికి దూరంగా ఉంది.

***



(Release ID: 1799147) Visitor Counter : 219