ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రాహుల్ బజాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన - ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2022 6:31PM by PIB Hyderabad

ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రాహుల్ బజాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి శ్రీ రాహుల్ బజాజ్ జీ చేసిన విశేషమైన కృషి ద్వారా, ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. వ్యాపారానికి అతీతంగా, సమాజ సేవలో కూడా ఆయన ఎక్కువగా మక్కువ కలిగి ఉన్నారు. ఆయన ఒక గొప్ప వక్త.  ఆయన మృతి బాధ కలిగించింది.  వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను.  ఓం శాంతి." అని పేర్కొన్నారు. 

***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1798022) సందర్శకుల సూచీ సంఖ్య : : 141