ప్రధాన మంత్రి కార్యాలయం
అరుణాచల్ ప్రదేశ్ లో మంచు కొండలు విరిగి పడిన కారణంగా ప్రాణాలు కోల్పోయిన భారత సైనిక సిబ్బందికి సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2022 8:55PM by PIB Hyderabad
అరుణాచల్ ప్రదేశ్ లో మంచు కొండలు విరిగి పడిన కారణంగా భారత సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం, విచారం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ట్వీట్ చేస్తూ, ''అరుణాచల్ ప్రదేశ్ లో మంచు కొండలు విరిగి పడిన కారణంగా భారత సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దేశానికి వారు చేసిన సేవలను మనం ఎప్పటికీ మరచిపోలేం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నారు.
*****
DS/ST
(రిలీజ్ ఐడి: 1796689)
సందర్శకుల సూచీ సంఖ్య : : 150
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam