ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ రామానుజాచార్య జ్ఞాపకార్ధం - 216 అడుగుల ఎత్తైన ' సమతా మూర్తి ‘ విగ్రహాన్ని జాతి కి అంకితం చేసిన ప్రధాన మంత్రి


‘‘జగద్గురు శ్రీ రామానుజాచార్య మహా విగ్రహం ద్వారా మానవ శక్తికి, ప్రేరణలకు సుస్థిర రూపం ఇస్తున్న భారత్ ‘‘
 
‘‘మనం రామానుజాచార్యను చూసినప్పుడు అభ్యుదయానికి, ప్రాచీనతకు మధ్య ఎలాంటి వైరుధ్యం లేదని గ్రహిస్తాం"
 
‘‘సంస్కరణల కోసం మూలాల నుండి వేరుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. బదులుగా మన అసలైన మూలాలతో అనుసంధానం కావడం, మన నిజమైన శక్తి గురించి తెలుసుకోవడం అవసరం"
 
"శ్రీ రామానుజాచార్య సందేశంతో పాటు, ఈ రోజు దేశం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' మంత్రంతో తన కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తోంది.‘‘
 
"భారత స్వాతంత్ర్య పోరాటం సాధు సత్పురుషుల నుండి అందుకున్న సమానత్వం, మానవత్వం ఆధ్యాత్మికతల శక్తితో ఆశీర్వదించబడింది"
 
"సర్దార్ సాహిబ్ వారి ఐక్యతా విగ్రహం ' దేశంలో ఐక్యతా ప్రమాణాన్ని పునరావృతం చేసినట్టే రామానుజాచార్య సమతా విగ్రహం సమానత్వ సందేశాన్ని ఇస్తోంది. ఒక దేశంగా భారతదేశం ప్రత్యేకత ఇది."
 
‘‘తెలుగువారి సంస్కృతి భారతదేశ వైవిధ్యాన్ని సుసంపన్నం చేసింది"
 
తెలుగు వారి సంస్కృతి సుసం

Posted On: 05 FEB 2022 8:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్ లో ' సమతా మూర్తి విగ్రహం' ను జాతికి అంకితం చేశారు. 11వ శతాబ్దపు భక్తి మార్గానికి చెందిన శ్రీ రామానుజాచార్యులవారి సంస్మరణార్ధం 216 అడుగుల ఎత్తయిన ఈ సమతామూర్తి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. విశ్వాసం, కులం , మతం సహా అన్ని రంగాలలో సమానత్వం అనే ఆలోచనను

శ్రీ రామానుజాచార్యులు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందరరాజన్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రతి ఒక్కరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు.ఇటువంటి పవిత్ర సందర్భంలో విగ్రహాన్ని అంకితం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. "జగద్గురు

శ్రీ రామానుజాచార్యుని ఈ గొప్ప విగ్రహం ద్వారా భారతదేశం తన మానవ శక్తికి, ప్రేరణలకు దృఢమైన ఆకారాన్ని ఇస్తోంది. శ్రీ రామానుజాచార్యుని ఈ విగ్రహం ఆయన జ్ఞానానికి, ఇహపరాలకు అతీతమైన ఆదర్శాలకు చిహ్నం‘‘ అని ప్రధాని అన్నారు.

‘విశ్వక్సేన ఇష్టి యజ్ఞ ‘ 'పూర్ణాహుతి'లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు. సంకల్పాలను , లక్ష్యాలను నెరవేర్చడానికి యజ్ఞాన్ని నిర్వహించారు . దేశ 'అమృత్' సంకల్పానికి యజ్ఞ 'సంకల్పాన్ని' అందించిన ప్రధాన మంత్రి, ఈ యజ్ఞాన్ని 130 కోట్ల మంది దేశ ప్రజలకు అంకితం చేశారు. జ్ఞానాన్ని తిరస్కరణ, అంగీకార- నిరాకరణకు అతీతంగా భావించే భారతీయ పండితుల సంప్రదాయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేసుకున్నారు. ఒకవేళ మనకు 'అద్వైతం' ఉంటే, మనకు 'ద్వైతం' కూడా ఉంది. అలాగేశ్రీ రామానుజాచార్యుడి 'విశిష్టాద్వైతం' కూడా ఉంది, ఇది ‘ద్వైతం-అద్వైతం' రెండింటినీ కలిగి ఉంది" అని ప్రధాన మంత్రి అన్నారు.

శ్రీ రామానుజాచార్య ఒక ఉన్నత జ్ఞానం శిఖరమే కాక భక్తి మార్గం స్థాపకుడు కూడా అని ఆయన పేర్కొన్నారు. ఆయన ఒకవైపు గొప్ప 'సన్యాస్' సంప్రదాయం యొక్క సాధువు అని, మరోవైపు , గీతా భాష్యంలో కర్మ యొక్క ప్రాముఖ్యతను తెలిపారని అన్నారు. 

ప్రధాన మంత్రి మాట్లాడుతూ, "నేటి

ప్రపంచంలో సామాజిక సంస్కరణలు,

పురోగతి వాదం విషయానికి వస్తే,

సంస్కరణలు మూలాలకు అతీతంగా జరుగుతామనే నమ్మకం ఉంది. కానీ, రామానుజాచార్య ను చూసినప్పుడు అభ్యుదయానికి, ప్రాచీనతకు మధ్య ఎలాంటి వైరుధ్యం లేదని మనం గ్రహిస్తాం. సంస్కరణల కోసం మూలాల నుండి చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు.బదులుగా మన నిజమైన మూలాలతో అనుసంధానం కావడం, మన నిజమైన శక్తి గురించి తెలుసుకోవడం అవసరం‘‘ అని అన్నారు.

ప్రస్తుతం జరిపే చర్యలకు, మన సాధువుల జ్ఞానానికి మ ధ్య ఉన్న సంబంధాన్ని ప్రధాన మంత్రి వివరిస్తూ. శ్రీ రామానుజాచార్య సామాజిక సంస్కరణల నిజమైన భావన ను దేశానికి సుపరిచితం చేసి, దళితులు , వెనుకబడిన వర్గాల వారి కోసం పని పనిచేశారనీ అన్నారు. ఈ రోజు శ్రీ రామానుజాచార్య మనకు మహా సమతా మూర్తి రూపం లో సమతా సందేశాన్ని ఇస్తున్నారని అన్నారు. ఈ సందేశంతో పాటు, ఈ రోజు దేశం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' మంత్రంతో తన కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తోందని చెప్పారు. ఈ రోజు భారత దేశం వివక్షత లేకుండా అందరి అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తోందని ,శతాబ్దాలుగా అణచివేతకు గురైన వారు దేశ అభివృద్ధిలో సగౌరవంగా భాగస్వామ్యులుగా మార్చి అందరికీ సామాజిక న్యాయం కల్పించిందనీ ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పక్కా ఇళ్లు, ఉజ్వల కనెక్షన్లు, 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ,ఉచిత విద్యుత్ కనెక్షన్లు, జన్ ధన్ ఖాతాలు, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి పథకాలు దళితులు , వెనుక బడినవర్గాలకు చెందిన వారు, నిరాదరణకు గురయిన వారి అభ్యున్నతికి ఆసరాగా ఉన్నాయని ప్రధాని వివరించారు.

 శ్రీ రామానుజాచార్యను 'భారత దేశ ఐక్యత కు, సమగ్రతకు గొప్ప స్ఫూర్తి‘ గా ప్రధాన మంత్రి అభివర్ణించారు. "ఆయన దక్షిణాన జన్మించారు. కానీ ఆయన ప్రభావం దక్షిణం నుండి ఉత్తరం ,తూర్పు నుండి పశ్చిమం వరకు మొత్తం భారతదేశంపై ఉంది", అని ప్రధాని అన్నారు.

భారత దేశ స్వాతంత్ర్య పోరాటం కేవలం తన అధికారం, హక్కుల కోసం మాత్రమే జరిపింది కాదని, ఈ పోరాటంలో ఒక వైపు 'వలస మనస్తత్వం' , మరొక వైపు 'జీవించండి- జీవించనివ్వండి' అనే ఆలోచన ఉందని చెప్పారు. ఒకవైపు అది జాతి అహంకారం, భౌతికవాద ఉద్వేగం , మరోవైపు మానవత్వం , ఆధ్యాత్మికతపై నమ్మకం అని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో భారతదేశం ,దాని సంప్రదాయం విజయవంతమైందని ఆయన అన్నారు. "భారత స్వాతంత్ర్య పోరాటం సాధు సన్యాసుల నుండి అందుకున్న సమానత్వం, మానవత్వం ఆధ్యాత్మికత ల శక్తితో ఆశీర్వదించబడింది" అని ఆయన అన్నారు.

సర్దార్ పటేల్ కు హైదరాబాద్ తో సంబంధాన్ని ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి, "సర్దార్ సాహిబ్ 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' దేశంలో ఐక్యతా ప్రమాణాన్ని పునరావృతం చేస్తున్నట్టుగా , రామానుజాచార్య ' సమతా విగ్రహం' సమానత్వ సందేశాన్ని ఇస్తోందనీ, ఒకే దేశంగా ఇది భారతదేశం ప్రత్యేకత" అని అన్నారు.

తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని, భారతదేశ వైవిధ్యాన్ని అది ఎలా సుసంపన్నం చేసిందో ప్రధాన మంత్రి వివరించారు. ఈ గొప్ప సంప్రదాయానికి టార్చ్ బేరర్లుగా ఉన్న మహారాజులు మహా రాణుల సుదీర్ఘ సంప్రదాయాలను ఆయన గుర్తు చేసుకున్నారు.

భారతదేశ ఆధ్యాత్మిక స్థలాలను పునరుజ్జీవింపజేయడం , గుర్తింపు ఇవ్వడం నేపథ్యంలో, 13వ శతాబ్దపు కాకతీయ రుద్రేశ్వర రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం, పోచంపల్లి ని ప్రపంచ పర్యాటక సంస్థ భారతదేశపు అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించడం గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రపంచ వ్యాప్తంగా, తెలుగు మాట్లాడే ప్రాంతాలకు అతీతంగా తన ఉనికిని చాటుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ పాత్రను

ప్రధాన మంత్రి ప్రశంసించారు. "ఈ సృజనాత్మకత వెండితెరపై , ఒటిటి వేదికలపై ప్రతిఫలిస్తోందని, ఇది భారతదేశం వెలుపల కూడా ప్రశంసించబడుతోందని, కళ , సంస్కృతి పట్ల తెలుగు మాట్లాడే ప్రజల అంకిత భావం ప్ర తి ఒక్కరికీ స్ఫూర్తి నిస్తొందని‘‘ ప్రధాన మంత్రి అన్నారు.

ఈ విగ్రహం ఐదు లోహాల -బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్- సమ్మేళనమైన 'పంచలోహాల 'తో తయారు చేయబడింది: ప్రపంచంలోని సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న ఎత్తైన లోహవిగ్రహాలలో ఇది ఒకటి. ఇది 'భద్ర వేదిక' పేరుతో 54 అడుగుల ఎత్తైన బేస్ భవనంపై అమర్చబడింది, ఇది వేద డిజిటల్ లైబ్రరీ ,పరిశోధన కేంద్రం, పురాతన భారతీయ గ్రంథాలు, ఒక థియేటర్, శ్రీ రామానుజాచార్య అనేక రచనలను వివరించే విద్యా గ్యాలరీ కోసం కేటాయించిన అంతస్తులను కలిగి ఉంది. ఈ విగ్రహాన్ని శ్రీ రామానుజాచార్య ఆశ్రమానికి చెందిన శ్రీ చిన్న జీయర్ స్వామి రూపొందించారు.ఈ కార్య క్ర మంలో శ్రీ రామానుజాచార్య జీవిత ప్రయాణం, బోధన ల 3డి ప్రజంటేషన్ ను ప్రదర్శించారు. విగ్రహం చుట్టూ ఉన్న 108 దివ్య దేశ (అలంకృత ఆలయ ఆకృతులు) లను ప్రధానమంత్రి వీక్షించారు.

జాతీయత, లింగం, జాతి, కులం లేదా మతంతో సంబంధం లేకుండా ప్రతి మనిషిని సమానంగా చూడాలనే స్ఫూర్తితో ప్రజల అభ్యున్నతి కోసం శ్రీ రామానుజాచార్య అవిశ్రాంతంగా పనిచేశారు. శ్రీ రామానుజాచార్య 1000వ జయంతి వేడుకలైన 12 రోజుల శ్రీ రామానుజ సహస్రబ్ది సమరోహంలో ఈ విగ్రహ సమానత్వ ప్రారంభోత్సవం ఒక భాగం.

DS


(Release ID: 1795846) Visitor Counter : 523