ఆర్థిక మంత్రిత్వ శాఖ
2021-–22లో గోధుమలు వరి సేకరణ కోసం 163 లక్షల మంది రైతులకు రూ. 2.37 లక్షల కోట్ల మద్దతు ధర విలువ ప్రత్యక్షంగా చెల్లింపు
రైతులకు డిజిటల్ హై-టెక్ సేవలను అందించే పథకం పీపీపీ విధానంలో ప్రారంభించడం జరుగుతుంది
వ్యవసాయం గ్రామీణ పరిశ్రమల కోసం ఫండ్ టు ఫైనాన్స్ స్టార్టప్‌లు ప్రారంభమవుతాయి
కెన్–-బెట్వా లింక్ ప్రాజెక్ట్ 9.08 లక్షల హెక్టార్లకు చెందిన రైతుల భూములకు ప్రయోజనాలు అందిస్తుంది
‘కిసాన్ డ్రోన్‌ల’ వినియోగం గురించి ప్రచారం చేయాలి
రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని దేశం అంతటా ప్రోత్సహించాలి
తృణధాన్యాలు (మిల్లెట్) ఉత్పత్తుల విలువ జోడింపు బ్రాండింగ్‌పై అధిక దృష్టి
నూనెగింజల దేశీయ ఉత్పత్తిని పెంచడానికి సమగ్ర పథకం అమలు చేయాలి
Posted On:
01 FEB 2022 1:04PM by PIB Hyderabad
పార్లమెంట్‌లో మంగళవారం కేంద్ర బడ్జెట్ 2022–-23ను సమర్పిస్తున్నప్పుడు, కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 2021–-22 రబీలో గోధుమల సేకరణ 2021-–22 ఖరీఫ్‌లో వరి సేకరణ అంచనా ప్రకారం 163 లక్షల మంది రైతుల నుండి 1208 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు వరిని సేకరించడం జరుగుతుంది. రూ.2.37 లక్షల కోట్ల మద్దతు ధర విలువను వారి ఖాతాలకు నేరుగా చెల్లించడం జరుగుతుంది. " వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు క్రింది విధంగా ఉన్నాయి:
రైతులకు డిజిటల్, హైటెక్ సేవలు
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పిపిపి) విధానంలో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నామని, దీని కింద రైతులకు డిజిటల్, హైటెక్ సేవలు అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రైవేట్ అగ్రి-టెక్ కంపెనీలు అగ్రి-వాల్యూ చైన్‌లో వాటాదారులతో పాటు ప్రభుత్వ రంగ పరిశోధన, విస్తరణ సంస్థల ప్రమేయం ఉంటుంది.
వ్యవసాయం గ్రామీణ సంస్థలకు స్టార్టప్ ఫండ్
వ్యవసాయంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. కో–-ఇన్వెస్ట్‌మెంట్ మోడల్‌లో సేకరించిన మిశ్రమ మూలధనంతో కూడిన నిధిని నాబార్డ్ ద్వారా సులభతరం చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. "వ్యవసాయం & గ్రామీణ పరిశ్రమల కోసం స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం చేయడం, వ్యవసాయ ఉత్పత్తుల విలువ గొలుసుకు సంబంధించినది" ఈ ఫండ్ లక్ష్యం. ఈ స్టార్టప్‌ల కార్యకలాపాలలో, వ్యవసాయ స్థాయిలో రైతుల కోసం అద్దె ప్రాతిపదికన యంత్రాలు ఎఫ్పీఓలకు, ఐటీ ఆధారిత మద్దతుతో సహా సాంకేతికత వంటివి అందజేస్తారు.
కెన్–-బెట్వా లింక్ ప్రాజెక్ట్
“రూ.44,605 కోట్ల అంచనా వ్యయంతో కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ అమలును చేపట్టనున్నారు” అని మంత్రి ప్రకటించారు. 9.08 లక్షల హెక్టార్ల రైతుల భూములకు సాగునీటి ప్రయోజనాలను అందించడమే దీని లక్ష్యం. ఇది 103 మెగావాట్ల హైడ్రో, 27 మెగావాట్ల సోలార్ పవర్‌తో పాటు 62 లక్షల మందికి తాగునీటి సరఫరాను కూడా అందిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం ఆర్‌ఈ 2021-–22లో రూ.4,300 కోట్లు, 2022-–23లో రూ. 1,400 కోట్లు కేటాయింపులు జరిగాయని ఆమె తెలిపారు. దమంగంగ–-పింజల్, పర్–-తాపి- నర్మద, గోదావరి–-కృష్ణా, కృష్ణా-–పెన్నార్ పెన్నార్–-కావేరి అనే ఐదు నదుల అనుసంధానాల ముసాయిదా డీపీఆర్‌లు ఖరారైనట్లు ఆమె పునరుద్ఘాటించారు. లబ్ధిదారు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత కేంద్రం అమలుకు మద్దతు ఇస్తుంది.
కిసాన్ డ్రోన్స్
కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రస్తావిస్తూ, పంట అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుమందుల పిచికారీ పోషకాల కోసం ‘కిసాన్ డ్రోన్‌ల’ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.
రసాయన రహిత సహజ వ్యవసాయం
రసాయనిక వినియోగం లేని సహజ వ్యవసాయంపై కూడా బడ్జెట్ దృష్టి సారించింది. "మొదటి దశలో గంగా నది వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పు గల కారిడార్లలో రైతుల భూములపై దృష్టి సారించి, రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తాం" అని ఆర్థిక మంత్రి చెప్పారు.
మిల్లెట్ ఉత్పత్తులకు మద్దతు
పంట అనంతర విలువ జోడింపు, దేశీయ వినియోగాన్ని పెంపొందించడం మిల్లెట్ ఉత్పత్తులను జాతీయంగా, అంతర్జాతీయంగా బ్రాండింగ్ చేయడానికి బడ్జెట్ అందించడం జరిగింది.
నూనెగింజల ఉత్పత్తికి పథకం
దేశీయ నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు సమగ్ర పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. "నూనె గింజల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచేందుకు హేతుబద్ధమైన సమగ్ర పథకం అమలు చేయడం జరుగుతుంది" అని ఆమె చెప్పారు.
ఆహర తయారీ
రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వం సమగ్ర ప్యాకేజీని అందజేస్తుందని, తద్వారా రైతులు “అనుకూలమైన పండ్లు కూరగాయలను” అవలంబించవచ్చని “తగిన ఉత్పత్తి పంటకోత పద్ధతులను” ఉపయోగించవచ్చని ఆర్థిక మంత్రి ప్రకటించారు.సహజ, జీరో బడ్జెట్ సేంద్రీయ వ్యవసాయం, ఆధునిక వ్యవసాయం, విలువ జోడింపు నిర్వహణ అవసరాలను తీర్చడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్‌లను సవరించడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 163 లక్షల మంది రైతులకు రూ.2.37 లక్షల కోట్ల మద్దతుధర ప్రత్యక్షంగా చెల్లిస్తామని చెప్పారు.
వ్యవసాయరంగానికి సంబంధించిన ముఖ్యాంశాలు, సాధించిన విజయాలు
రసాయన రహిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం,
పంటకోత తర్వాత విలువ జోడింపు, వినియోగం మిల్లెట్ ఉత్పత్తుల బ్రాండింగ్‌ను ప్రోత్సహించడం
పీపీపీ విధానంలో రైతులకు డిజిటల్ హైటెక్ సేవలను అందించడం
రైతులకు సహాయం చేయడానికి కిసాన్ డ్రోన్ల ఉపయోగం
వ్యవసాయ స్టార్టప్‌లకు ఆర్థిక సహాయం చేయడానికి మిశ్రమ మూలధనంతో నిధిని ప్రారంభించడం
కెన్ బెట్వా లింక్ ప్రాజెక్ట్ ద్వారా 9.1 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి ప్రయోజనం చేకూర్చడం
***
(Release ID: 1794912)
Visitor Counter : 317
Read this release in:
Marathi
,
Punjabi
,
Malayalam
,
Tamil
,
Kannada
,
Bengali
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Gujarati