ఆర్థిక మంత్రిత్వ శాఖ
5జి కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి డిజైన్-లీడ్ మాన్యుఫాక్చరింగ్ పథకాన్ని ప్రతిపాదించిన 2022-23 వార్షిక బడ్జెట్
2022-23 లోపు 5జి మొబైల్ సేవలు ప్రారంభించడం కోసం - 2022 లో స్పెక్ట్రమ్ వేలం
గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో సరసమైన బ్రాడ్ బ్యాండ్, మొబైల్ సేవల విస్తరణ కోసం - యు.ఎస్.ఓ.ఎఫ్. కింద వార్షిక ఆదాయం లో ఐదు శాతం కేటాయింపు
2022-23 లో భారత్ నెట్ ప్రాజెక్టు కింద అన్ని గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ వేయడానికి - పి.పి.పి. ద్వారా ఒప్పందాలు
Posted On:
01 FEB 2022 1:10PM by PIB Hyderabad
భారతదేశం 75 నుండి భారతదేశం 100 కు ప్రయాణించే రాబోయే 25 సంవత్సరాల అమృత్ సమయంలో ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి అవసరమైన పునాది వేయడానికి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి, కేంద్ర వార్షిక బడ్జెట్ 2022-23 ప్రయత్నిస్తోంది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా మాట్లాడుతూ, “ఇది 2021-22 బడ్జెట్ లో రూపొందించిన విధానాన్ని కొనసాగిస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం, బలాలు, సవాళ్ళను ఆర్థిక నివేదికల పారదర్శకత, ఆర్థిక స్థితిని కలిగి ఉన్న దాని ప్రాథమిక సిద్ధాంతాలు, ప్రతిబింబిస్తాయి." అని పేర్కొన్నారు.
అమృత్ కాల్ సమయంలో నిర్దిష్ట లక్ష్యాలను సాధించడం ద్వారా డిజిటల్ ఆర్ధిక వ్యవస్థ, ఫిన్-టెక్, సాంకేతికతతో కూడిన అభివృద్ధిని ప్రోత్సహించే దృష్టిని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
టెలికాం రంగం:
ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహక (పి.ఎల్.ఐ) పథకంలో భాగంగా 5జి కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి డిజైన్-లెడ్-మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఒక పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర వార్షిక బడ్జెట్ 2022-23 ప్రతిపాదించింది. ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను సాధించే దిశగా, 60 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించే అవకాశం తో పాటు, రాబోయే ఐదు సంవత్సరాల్లో 30 లక్షల కోట్ల రూపాయల మేర అదనపు ఉత్పత్తి సామర్థ్యంతో, 14 రంగాల్లో ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహక పథకానికి అద్భుతమైన స్పందన లభించిందని, కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
సాధారణ టెలికమ్యూనికేషన్ తో పాటు, ముఖ్యంగా 5జి సాంకేతికత అభివృద్ధి సాధించగలదనీ, తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్ల ద్వారా 2022-23 లోపు 5జి మొబైల్ సేవలు ప్రారంభించడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం 2022 లో నిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా, గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో సరసమైన బ్రాడ్‌బ్యాండ్ మరియు మొబైల్ సేవల విస్తరణ ప్రారంభించడానికి, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యు.ఎస్.ఓ.ఎఫ్.) కింద వార్షిక ఆదాయం లో ఐదు శాతం కేటాయించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. ఇది సాంకేతికతలు, పరిష్కారాలకు అవసరాలైన పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యీకరణలను ప్రోత్సహిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే సౌకర్యాలతో సమానంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ-సేవలు, కమ్యూనికేషన్ సౌకర్యాలు, డిజిటల్ వనరులను అందుబాటులోకి తీసుకు రావడం కోసం, 2022-23 లో భారత్ నెట్ ప్రాజెక్టు కింద మారుమూల ప్రాంతాలతో సహా అన్ని గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ వేసేందుకు పి.పి.పి. ద్వారా కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రకటించింది. ఈ ప్రక్రియ 2025 లో పూర్తవుతుందని అంచనా. ఆప్టికల్ ఫైబర్ యొక్క మెరుగైన, మరింత సమర్థవంతమైన వినియోగాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
*****
(Release ID: 1794553)
Visitor Counter : 305