ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022-23 కేంద్ర బడ్జెటు లో ముఖ్యాంశాలు

Posted On: 01 FEB 2022 1:18PM by PIB Hyderabad

సూక్ష్మ ఆర్థిక స్థాయి లో అన్ని వర్గాల వారి సంక్షేమం పట్ల శ్రద్ధ ను తీసుకోవడం తో పాటు గా స్థూల ఆర్థిక స్థాయి లో వృద్ధి కి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టాలి అన్నది కేంద్ర బడ్జెటు యొక్క సంకల్పం గా ఉన్నది. ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న పార్లమెంటు లో 2022-23 కేంద్ర బడ్జెటు ను ప్రవేశపెట్టారు.

బడ్జెటు లో ముఖ్యమైన అంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

ఒకటో భాగం

  • భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 9.2 శాతం గా నమోదు కావచ్చని అంచనా వేయడమైంది. ఆ వృద్ధి అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థల లోకీ అధికం.

· 14 రంగాల లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం గా 60 లక్షల కొత్త ఉద్యోగాల ను కల్పించడం జరుగుతుంది.

· పిఎల్ఐ పథకం లో 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తి కి ఆస్కారం ఉంది.

· అమృత కాలం.. అంటే భారతదేశం @100 కు దారితీసే 25 సంవత్సరాల అవధి లో.. ప్రవేశిస్తున్న వేళ బడ్జెటు నాలుగు ప్రాధమ్యాల ప్రాతిపదిక న వృద్ధి కి దన్ను కల్పించనుంది. ఆ నాలుగు ప్రాధాన్యాలు ఏవేవంటే అవి :

Ø పిఎమ్ గతిశక్తి

Ø సమ్మిళిత అభివృద్ధి

Ø ఉత్పాదకత లో పెరుగుదల మరియు పెట్టుబడి, సన్ రైజ్ ఆపర్చునిటీస్, శక్తి రంగం లో మార్పు మరియు జలవాయు సంబంధి కార్యాచరణ లకు తోడు గా

Ø పెట్టుబడి కి ఆర్థిక సహాయం అనేవే.

పిఎమ్ గతిశక్తి

· పిఎమ్ గతిశక్తి కి అండదండలు అందించేటటువంటి ఏడు అంశాల లో రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మాస్ ట్రాన్స్ పోర్ట్, జల మార్గాలు, ఇంకా లాజిస్టిక్స్ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన.

పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను

· ఆర్థిక పరివర్తన తాలూకు ఏడు అంశాలు, అంతరాయానికి తావు ఉండనటువంటి సంధానానికి తోడు గా లాజిస్టిక్స్ సంబంధి సామర్ధ్యం అనేవి పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను పరిధి లో ఉంటాయి.

· జాతీయ మౌలిక సదుపాయాల సంబంధి పైప్ లైను లో ఈ ఏడు అంశాల తో ముడిపడినటువంటి ప్రాజెక్టుల ను పిఎమ్ గతిశక్తి ఫ్రేమ్ వర్క్ తో జోడించడం జరుగుతుంది.

రహదారి రవాణా

· జాతీయ రాజమార్గాల నెట్ వర్క్ ను 2022-23 లో 25,000 కిలో మీటర్ల మేరకు విస్తరించడం జరుగుతుంది.

· నేశనల్ హైవేస్ నెట్ వర్క్ విస్తరణ కు గాను 20,000 కోట్ల రూపాయల ను సమీకరించడం జరుగుతుంది.

మల్టీమాడల్ లాజిస్టిక్స్ పార్కులు

· 2022-23 లో నాలుగు ప్రదేశాల లో మల్టీ మాడల్ లాజిస్టిక్స్ పార్కుల ను ఏర్పాటు చేయడం కోసం పిపిపి పద్ధతి లో కాంట్రాక్టుల ను ఇవ్వనున్నారు.

రైలు మార్గాలు

· స్థానిక వ్యాపారాలకు మరియు సప్లయ్ చైన్ లకు తోడ్పడటం కోసం ‘ఒక స్టేశన్, ఒక ఉత్పత్తి’ ని అమలు చేయాలని సంకల్పించడం జరిగింది.

· 2022-23 లో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, ఇంకా సామర్ధ్యం పెంపుదల సంబంధిత కవచం లో భాగం గా రైల్ వే నెట్ వర్క్ కు 2000 కిలో మీటర్ లను కలపడం జరుగుతుంది.

· రాబోయే మూడు సంవత్సరాల లో 400 ఉత్కృష్ట వందే భారత్ రైళ్ళ ను నిర్మించడం జరుగుతుంది.

· వచ్చే మూడు సంవత్సరాల లో మల్టీ మాడల్ లాజిస్టిక్స్ ను దృష్టి లో పెట్టుకొని 100 పిఎమ్ గతిశక్తి కార్గో టర్మినల్ లను అభివృద్ధి పరచడం జరుగుతుంది.

పర్వతమాల

· నేశనల్ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ‘‘పర్వతమాల’’ ను పిపిపి పద్ధతి లో అమలు పరచడం జరుగుతుంది.

· 2022-23 లో 60 కిలోమీటర్ ల పొడవైన 8 రోప్ వే ప్రాజెక్టుల కు గాను కాంట్రాక్టుల ను ఇవ్వడం జరుగుతుంది.

సమ్మిళిత అభివృద్ధి

వ్యవసాయం

· గోధుమల కొనుగోలు కు, ధాన్యం కొనుగోలు కు 1.63 కోట్ల మంది రైతుల కు 2.37 లక్షల కోట్ల రూపాయల ను నేరు గా చెల్లించడం జరుగుతుంది.

· దేశవ్యాప్తం గా రసాయనాల కు తావు ఉండనటువంటి ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ దిశ లో ఆరంభ దశ లో గంగా నది ని ఆనుకొని ఉన్నటువంటి 5 కిలో మీటర్ ల విస్తీర్ణం వరకు ఉండే కారిడార్ లోని రైతుల కు చెందిన భూముల పట్ల ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతుంది.

· వ్యవసాయం మరియు రూరల్ ఎంటర్ ప్రైజ్ లతో ముడిపడిన స్టార్ట్-అప్స్ కు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించినటువంటి మిశ్రమ మూలధన నిధి కి మార్గాన్ని నాబార్డ్ సుగమం చేయనుంది.

· పంటల విలువ నిర్ధారణ, భూమి రికార్డు ల డిజిటలీకరణ, క్రిమిసంహారకాల ను వెదజల్లడం కోసం, ఇంకా పోషక పదార్థాల ను వెదజల్లడం కోసం ‘కిసాన్ డ్రోన్’ లను రంగం లోకి దించుతారు.

కేన్-బేత్ వా ప్రాజెక్టు

· కేన్-బేత్ వా లింక్ ప్రాజెక్టు అమలు కోసం 1400 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని సంకల్పించడమైంది.

కేన్-బేత్ వా లింక్ ప్రాజెక్టు ద్వారా రైతుల కు చెందిన భూముల లో 9.08 లక్షల హెక్టేర్ ల భూములకు సేద్య సంబంధి ప్రయోజనాలు లభించనున్నాయి.

ఎమ్ఎస్ఎమ్ఇ

· ఉద్యమ్ పోర్టల్ ను, ఇ-శ్రమ్ పోర్టల్ ను, ఎన్ సిఎస్ పోర్టల్ ను, ఇంకా ఎఎస్ఇఇఎమ్ పోర్టల్ ను ఒకదానితో మరొకటి ని జోడించడం జరుగుతుంది.

· 130 లక్షల ఎమ్ఎస్ఎమ్ఇ లకు అదనపు రుణాన్ని ఇమర్ జెంసీ క్రెడిట్ లింక్ డ్ గ్యారంటీ స్కీమ్ (ఇసిఎల్ జిఎస్) పరిధి లో ఇవ్వడం జరుగుతుంది.

· ఇసిఎల్ జిఎస్ ను 2023వ సంవత్సరం మార్చి నెల వరకు పొడిగించడం జరుగుతుంది.

· ఇసిఎల్ జిఎస్ లో భాగం గా గ్యారంటీ కవర్ ను 50,000 కోట్ల రూపాయల మేరకు పెంచివేసి మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు గా చేసేయడం జరుగుతుంది.

· సూక్ష్మ మరియు లఘు వ్యాపార సంస్థ ల క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (సిజిటిఎమ్ఎస్ఇ) లో భాగం గా 2 లక్షల కోట్ల రూపాయల అదనపు పరపతి ని ఇవ్వడం జరుగుతుంది.

· రేజింగ్ ఎండ్ ఏక్సెలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఇ పర్ ఫార్మెన్స్ (ఆర్ఎఎమ్ పి) కార్యక్రమాన్ని 6000 కోట్ల రూపాయల వ్యయం తో మొదలు పెట్టడం జరుగుతుంది.

నైపుణ్యాభివృద్ధి

· ఆన్ లైన్ మాధ్యమం ద్వారా పౌరుల లో నైపుణ్యాల ను పెంపొందింప చేయడం కోసం డిజిటల్ ఇకో సిస్టమ్ ఫార్ స్కిలింగ్ ఎండ్ లైవ్ లీ హుడ్ (డిఇఎస్ హెచ్-స్టాక్ ఇ-పోర్టల్) ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.

· ‘డ్రోన్ శక్తి’ కి మార్గాన్ని సుగమం చేయడం కోసం మరియు ‘డ్రోన్-ఏజ్-ఎ-సర్వీస్’ (డిఆర్ ఎఎఎస్) కోసం స్టార్ట్-అప్స్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది

విద్య

· పిఎమ్ ఇ-విద్య కు చెందిన ‘ఒక తరగతి ఒక టివి ఛానల్’ కార్యక్రమాన్ని 200 టివి చానల్స్ లో ప్రసారం చేయడం జరుగుతుంది.

· కీలకమైన ఆలోచనల తాలూకు నైపుణ్యానికి, సిమ్యులేటెడ్ లర్నింగ్ లకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం వర్చువల్ లేబ్స్ ను మరియు నైపుణ్య సంబంధి ఇ-లేబ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

· డిజిటల్ ఉపాధ్యాయుల మాధ్యమం ద్వారా విద్య బోధన కై అధిక నాణ్యత కలిగినటువంటి ఇ-కంటెంట్ ను అభివృద్ధి పరచడం జరుగుతుంది.

· వ్యక్తిగత పద్ధతి న విద్యార్జన కై ప్రపంచ స్థాయి విద్య ను అందించడం కోసం డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఆరోగ్యం

· జాతీయ డిజిటల్ హెల్థ్ ఇకోసిస్టమ్ కోసం ఒక ఓపెన్ ప్లాట్ ఫార్మ్ ను ఆరంభించడం జరుగుతుంది.

· నాణ్యత తో కూడినటువంటి మానసిక ఆరోగ్య సంబంధి సలహా సంప్రదింపుల తో పాటు గా సంరక్షణ సంబంధి సేవల ను అందించడం కోసం ‘నేశనల్ టెలీ మెంటల్ హెల్థ్ ప్రోగ్రాము’ ను ప్రారంభించడం జరుగుతుంది.

· 23 టెలీ మెంటల్ హెల్థ్ సెంటర్స్ తో కూడినటువంటి ఒక నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నోడల్ సెంటర్ గా నిమ్ హాన్స్ (ఎన్ఐఎమ్ హెచ్ఎఎన్ఎస్) వ్యవహరిస్తుంది. దీనికి అవసరమైన సాంకేతిక విజ్ఞాన సంబంధి సహకారాన్ని బెంగళూరు లోని ఇంటర్ నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ-బెంగళూరు (ఐఐఐటిబి) అందిస్తుంది.

సక్షమ్ ఆంగన్ వాడీ

· మిశన్ శక్తి, మిశన్ వాత్సల్య, సక్షమ్ ఆంగన్ వాడీ, ఇంకా పోషణ్ 2.0 మాధ్యమాల ద్వారా మహిళల కు మరియు బాలల కు ఏకీకృత లాభాల ను అందించడం జరుగుతంది.

· రెండు లక్షల ఆంగన్ వాడీల స్థాయి ని సక్షమ్ ఆంగన్ వాడీ ల స్థాయి కి పెంచడం జరుగుతుంది.

 

హర్ ఘర్, నల్ సే జల్

· ‘హర్ ఘర్, నల్ సే జల్’ (ఇంటింటి కి నల్లా నీరు)లో భాగం గా 2022-23 సంవత్సరం లో 3.8 కోట్ల కుటుంబాల ను చేర్చడం కోసం 60,000 కోట్ల రూపాయల ను కేటాయించడం జరిగింది.

అందరి కోసం గృహ నిర్మాణం

· ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా 2022-23 లో 80 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం 48,000 కోట్ల రూపాయల ను కేటాయించడమైంది.

ఈశాన్య ప్రాంతాల కోసం ప్రధాన మంత్రి అభివృద్ధి కార్యక్రమం (పిఎమ్-డిఇవిఐఎన్ఇ)

· దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన మరియు సామాజిక అభివృద్ధి పథకాల అమలు కు ఒక కొత్త పథకాన్ని పిఎమ్-డిఇవిఐఎన్ఇ పేరుతో ప్రవేశపెట్టడమైంది.

· ఈ పథకం లో భాగం గా యువజనుల ను మరియు మహిళల ను జీవనోపాధి కార్యక్రమాల కు సన్నద్ధం చేయడం కోసం ఆరంభ దశ లో 1500 కోట్ల రూపాయల కేటాయింపు.

వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాము

· అక్కడక్కడ నివసించే జన సంఖ్య, పరిమిత సంధానం మరియు పరిమిత మౌలిక సదుపాయాల తో కూడినటువంటి సరిహద్దు ప్రాంత గ్రామాల ను అభివృద్ధి పరచడం కోసం ఈ ‘వైబ్రంట్ విలేజెస్’ ప్రోగ్రాము ను సంకల్పించడమైంది.

బ్యాంకింగ్

· వంద శాతం 1.5 లక్ష ల తపాలా కార్యాలయాల ను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సిబిఎస్) లో చేర్చడం జరుగుతుంది.

· షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకు లు 75 జిల్లాల లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ (డిబియు స్)ను ఏర్పాటు చేస్తాయి

 

ఇ-పాస్ పోర్ట్

· ఇంబెడెడ్ చిప్ ఎండ్ ఫ్యూచరిస్టిక్స్ టెక్నాలజీ తో కూడిన ఇ-పాస్ పోర్ట్ ల జారీ ని ఆరంభించడం జరుగుతుంది.

పట్టణ ప్రణాళిక

· బిల్డింగ్ బైలాస్ ల, టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ (టిపిఎస్) మరియు ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్ మెంట్ (టిఒడి) ల ఆధునికీకరణ ను అమలు పరచడం జరుగుతుంది.

· పట్టణ ప్రాంతాల లో పెద్ద ఎత్తు న చార్జింగ్ స్టేశన్ లను నెలకొల్పడం కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలిసీ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది.

భూమి రికార్డుల నిర్వహణ

· భూమి రికార్డుల ను ఐటి మద్దతు తో నిర్వహించడం కోసం యూనీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేశన్ నంబరు ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.

ఏక్సెలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్

· కంపెనీల ను వేగం గా మూసివేయడం కోసం సెంటర్ ఫార్ ప్రోసెసింగ్ ఏక్సెలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ ( సి-పిఎసిఇ) ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

ఎవిజిసి ప్రమోశన్ టాస్క్ ఫోర్స్

· ఈ రంగం యొక్క సామర్ధ్యాన్ని తెలుసుకోవడం కోసం ఒక ఏనిమేశన్, విజువల్ ఇఫెక్ట్ స్, గేమింగ్ ఎండ్ కామిక్ (ఎవిజిసి) ప్రోత్సాహక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

టెలికం రంగం

· ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం పథకం లో భాగం గా 5జి కోసం ఒక పటిష్టమైన ఇకోసిస్టమ్ ను నెలకొల్పడానికి గాను డిజైన్ ప్రధానమైనటువంటి తయారీ కి సంబంధించిన ఒక పథకాన్ని తీసుకు రావడం జరుగుతుంది.

ఎగుమతుల కు ప్రోత్సాహం

· ‘ఎంటర్ ప్రైజ్ ఇంకా సర్వీస్ హబ్ ల అభివృద్ధి’ లో రాష్ట్రాల ను భాస్వాములను చేయడాని కి వీలు గా ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాని కి బదులు గా ఒక కొత్త విధానాన్ని తీసుకు రావడం జరుగుతుంది.

రక్షణ రంగం లో స్వయం సమృద్ధి:

· 2022-23 లో దేశీయ పరిశ్రమ కోసం మూలధన సేకరణ ను బడ్జెటు లో 68 శాతం గా నిర్ధారించడమైంది. 2021-22 లో కేటాయించిన 58 శాతం తో పోల్చి చూసినప్పుడు ఇది అధికం గా ఉంది.

· 25 శాతం రక్షణ పరిశోధన సంబంధి బడ్జెటు తో సహా పరిశ్రమ, స్టార్ట్-అప్స్ మరియు విద్యల కోసం ఉద్దేశించి రక్షణ సంబంధిత పరిశోధన ను, అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) ని తెరవడం జరుగుతుంది.

· పరీక్ష లు జరపడం మరియు ధ్రువపత్రం సంబంధి అవసరాల ను పూర్తి చేయడం కోసం స్వతంత్ర నోడల్ అంబ్రెలా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

సన్ రైజ్ ఆపర్చునిటీస్

· కృత్రిమ మేధస్సు (ఎఐ), జియో-స్పేశల్ సిస్టమ్స్, ఇంకా డ్రోన్ లు, సెమీ కండక్టర్ మరియు తత్సంబంధిత ఇకో-సిస్టమ్, అంతరిక్ష సంబంధి ఆర్థిక వ్యవస్థ, జీనోమిక్స్ మరియు ఫార్మాస్యుటికల్స్, హరిత శక్తి, ఇంకా స్వచ్ఛమైన మొబిలిటీ సిస్టమ్స్ ల వంటి సన్ రైజ్ ఆపర్చునిటీస్ లో పరిశోధన కు మరియు అభివృద్ధి కి ప్రభుత్వ తోడ్పాటు ను అందజేయడం జరుగుతుంది.

ఎనర్జీ ట్రాన్సిశన్ ఎండ్ క్లయిమేట్ యాక్షన్:

· 2030 వ సంవత్సరానికల్లా 280 గీగా వాట్ స్థాపిత సౌర విద్యుత్తు లక్ష్యాన్ని సాధించడం కోసం ఉన్నత సామర్ధ్యం కలిగి ఉండే సోలర్ మాడ్యూల్స్ ను తయారు చేయడం కోసం ఉత్పత్తి తో ముడిపెట్టినటువంటి ప్రోత్సాహకం రూపం లో 19,500 కోట్ల రూపాయల ను అదనం గా కేటాయించడమైంది.

· ఉష్ణ ఆధారిత విద్యుత్తు ప్లాంటుల లో అయిదు శాతం నుంచి ఏడు శాతం బయోమాస్ పెలెట్స్ ను మండించడం జరుగుతుంది.

· ఏటా 38 ఎమ్ఎమ్ టి స్థాయి లో కార్బన్ డైఆక్సైడ్ ను ఆదా చేయాలనేది లక్ష్యం గా ఉంది;

· దీనివల్ల రైతుల కు అదనపు ఆదాయం తో పాటు గా స్థానికుల కు ఉపాధి లభించేందుకు అవకాశం ఉంది;

· అంతేకాకుండా, పొలాల్లో గడ్డి దుబ్బులను కాల్చడాన్ని అడ్డుకోవడం లో సైతం తోడ్పాటు లభిస్తుంది.

· కోల్ గ్యాసిఫికేశన్ కు మరియు పరిశ్రమ కోసం బొగ్గు ను రసాయానాల రూపంలోకి మార్పు చెందింప చేసేందుకు గాను నాలుగు పైలట్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

· అగ్రో-ఫారెస్టరీ ని చేపట్టేటటువంటి షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల కు చెందిన రైతుల కు ఆర్థిక పరమైన సహాయాన్ని అందించడం జరుగుతుంది.

పబ్లిక్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్:

· 2022-23 లో ప్రైవేటు పెట్టుబడి కి మరియు డిమాండు కు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు గాను పబ్లిక్ ఇన్వెస్ట్ మెంటును కొనసాగించడం జరుగుతుంది.

· 2022-23 సంవత్సరం లో మూలధన సంబంధి వ్యయం కోసం చేసే ఖర్చును అమాంతం 35.4 శాతం మేరకు పెంచి వేసి 7.50 లక్షల కోట్ల రూపాయల కు చేర్చడమైంది. ఇది ప్రస్తుతం సంవత్సరం లో 5.54 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది.

· 2022-23 లో చేసే వ్యయం జిడిపి లో 2.9 శాతం గా ఉంటుంది.

· 2022-23 లో కేంద్ర ప్రభుత్వం యొక్క మూలధన వ్యయం దాదాపు గా 10.68 లక్షల కోట్ల రూపాయలు గా ఉండవచ్చని అంచనా వేయడమైంది. ఇది జిడిపి లో ఇంచుమించు 4.1 శాతం మేరకు లెక్క కు వస్తుంది.

జిఐఎఫ్ టి-ఐఎఫ్ఎస్ సి

· జిఐఎఫ్ టి సిటీ లో ప్రపంచ శ్రేణి విదేశీ విశ్వ విద్యాలయాల ను మరియు ప్రపంచ శ్రేణి సంస్థల ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ని ఇవ్వడం జరుగుతుంది.

· అంతర్జాతీయ ధర్మశాస్త్ర రంగం పరిధి లో వివాదాల ను సకాలం లో పరిష్కరించడం కోసం ఒక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

వనరుల సమీకరణ

· డేటా సెంటర్స్ కు మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కు మౌలిక సదుపాయాల సంబంధిత హోదా ను ఇవ్వడం జరుగుతుంది.

· వెంచర్ కేపిటల్ ఎండ్ ప్రైవేట్ ఎక్విటీ లు గడచిన సంవత్సరం లో 5.5 లక్షల కోట్ల రూపాయల కు మించిన పెట్టుబడిని పెట్టాయి. అంతేకాక అన్నిటి కంటే పెద్దదైన ఒక స్టార్ట్-అప్ మరియు గ్రోత్ ఇకో-సిస్టమ్ కు మార్గాన్ని కూడా సుగమం చేసింది. ఈ విధమైన పెట్టుబడి ని మరింత గా పెంచేందుకు చొరవల ను తీసుకోవడం జరుగుతున్నది.

· సన్ రైజ్ సెక్టర్ కోసం బ్లెండెడ్ ఫండ్స్ ను ప్రోత్సహించడం జరుగుంది.

· గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధుల ను సమీకరించడం కోసం సావరిన్ గ్రీన్ బాండ్ లను జారీ చేయడం జరుగుతుంది.

డిజిటల్ రూపీ

· భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) ద్వారా డిజిటల్ రూపాయి ని 2022-23 లో మొదలు పెట్టడమైంది.

రాష్ట్రాల కు మరింత గా ఫిస్కల్ స్పేస్ ను కల్పించడం

· ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాల కు ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన పథకం’ కోసం చేసే వ్యయాన్ని మరింత పెంచడం జరిగింది:

Ø ఈ విధమైన వ్యయం బడ్జెటు అంచనాల లో 10,000 కోట్ల రూపాయలు గా ఉండింది. దీనిని ప్రస్తుత సంవత్సరం కోసం సవరించిన అంచనాల లో 15,000 కోట్ల రూపాయలు చేసేయడమైంది.

· ఆర్థిక వ్యవస్థ లో సమగ్రమైన ప్రోత్సాహకాన్ని ఇవ్వడం కోసం రాష్ట్రాల కు సాయపడటానికి గాను 2022-23 సంవత్సరం లో ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు కేటాయించడమైంది. అంతేకాక యాభై సంవత్సరాల వడ్డీ ఉండనటువంటి రుణాల ను ఇవ్వడం జరుగుతుంది. ఇవి సాధారణ రుణాలకు అదనం గా ఉంటాయి.

  • 2022-23 లో రాష్ట్రాల కు జిఎస్ డిపి లో 4 శాతం మేరకు ద్రవ్య లోటు కు అనుమతించడం జరుగుతుంది. దీనిలో 0.5 శాతం విద్యుత్తు రంగ సంస్కరణల కు గాను ఉపయోగించ డం జరుగుతుంది.

ఫిస్కల్ మేనేజ్ మెంట్

· బడ్జెటు అంచనా లు 2021-22: 34.83 లక్షల కోట్ల రూపాయలు

· సవరించిన అంచనాలు 2021-22: 37.70 లక్షల కోట్ల రూపాయలు

· 2022-23 వ సంవత్సరం లో మొత్తం వ్యయం 39.45 లక్షల కోట్ల రూపాయలుగా ఉండవచ్చని అంచనా వేయడమైంది.

· 2022-23 వ సంవత్సరం లో అప్పులు కాకుండా మొత్తం వసూళ్ళు: 22.84 లక్షల కోట్ల రూపాయలు గా ఉండవచ్చు

· ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ద్రవ్య లోటు: జిడిపి లో 6.9 శాతం (బడ్జెటు అంచనాల లో పేర్కొన్న 6.8 శాతం తో పోల్చినప్పుడు)

· 2022-23 వ సంవత్సరం లో ద్రవ్య లోటు జిడిపి లో 6.4 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేయడమైంది.

పార్ట్-బి

ప్రత్యక్ష పన్నులు

సుస్థిరమైన,  అంచనా వేయదగిన పన్ను వ్యవస్థ:

· విశ్వసనీయమైన పన్ను వ్యవస్థ ఏర్పాటుకు సంకల్పం.

· పన్ను వ్యవస్థను మరింత సరళీకరించి, వివాదాలను తగ్గించడం.

కొత్తగా ‘అప్డేటెడ్ రిటర్ను’ పద్ధతిని ప్రవేశపెట్టడం

· అదనపు పన్ను చెల్లింపుపై సవరించిన (అప్డేటెడ్) రిటర్ను విధానం.

· మొదట్లో ప్రస్తావించని ఆదాయం వివరాలను పన్ను చెల్లింపుదార్లు ప్రకటించేందుకు,  వివరాల సవరణకు ఇది అవకాశం కల్పిస్తుంది.

· సంబంధిత పన్ను మధింపు సంవత్సరం ముగిసినప్పటి నుంచి రెండేళ్లలోగా ఈ సవరణలను దాఖలు చేయవచ్చు. 

సహకార సంఘాలు

· సహకార సంఘాలు చెల్లించే కనీస ప్రత్యామ్నాయ పన్ను రేటు 18.5శాతంనుంచి 15శాతానికి తగ్గింపు.

· సహకార సంఘాలకు, కంపెనీలకు మధ్య సమదృష్టితో వ్యవహరించే సంకల్పం.

· మొత్తం ఆదాయం రూ. కోటినుంచి రూ. 10కోట్ల వరకూ ఉండే సహకార సంఘాలపై సర్చార్జీ 12శాతంనుంచి 7శాతానికి తగ్గింపు.

వికలాంగులకు పన్నులో ఉపశమనం

· తల్లిదండ్రులు/సంరక్షలపై జీవితకాలం ఆధాపడి ఉండే విభిన్న సామర్థ్యాలు కలిగిన వారికి బీమా సొమ్మునుంచి వార్షికంగా సొమ్ము చెల్లించడం., ఒకే మొత్తంగా చెల్లింపు జరపడం. అంటే,..తల్లిదండ్రులు/సంరక్షులకు 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటినుంచి చెల్లింపు అమలు జరుపుతారు.

జాతీయ పెన్షన్ పథకం (ఎన్.పి.ఎస్.) వాటా చెల్లింపులో సమానత్వం

· రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్.పి.ఎస్. ఖాతాకు చెల్లించే యాజమాన్యపు వాటాపై పన్ను కోత పరిమితిని 10శాతంనుంచి 14శాతానికి పెంచారు.

· కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనూ పరిగణించడం.

· సామాజిక భద్రతా ప్రయోజనాలను పెంచడంలో ఇది దోహదపడుతుంది.

స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు

· ప్రోత్సాహక పథకాల ప్రయోజనాలకు అర్హత కలిగిన స్టార్టప్ కంపెనీలు వినియోగించుకోవడానికి ఇన్.కార్పొరేషన్ వ్యవధిని ఏడాదిపాటు, అంటే 2023 మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు.

  • ఇన్.కార్పొరేషన్ వ్యవధి ఇదివరకు 2022 మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉండేది.

 

రాయితీ పన్ను వ్యవస్థ పరిధిలో ప్రోత్సాహకాలు

· ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 115 బి.ఎ.బి. కింద వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిని ప్రారంభించేందుకు నిర్దేశించిన ఆఖరు తేదీని ఏడాదిపాటు పొడిగించారు. అంటే, 2023 మార్చి 31నుంచి 2024వ సంవత్సరం మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు.

 

వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపునకు పథకం

· వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపునకు ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. · ఎలాంటి వర్చువల్ డిజిటల్ ఆస్తినైనా బదిలీ చేసినపుడు లభించే ఆదాయంపై  పన్ను రేటును 30 శాతంగా నిర్ణయించారు.

· స్వాధీనం చేసుకునే వ్యయం మినహాయించి అలాంటి ఆదాయాన్ని లెక్కించినపుడు జరిగే ఖర్చుపై, లేదా అలవెన్సుపై ఎలాంటి పన్ను కోతా ఉండబోదు.

· వర్చువల్ ఆస్తి బదిలీలో నష్టం సంభవించిన పక్షంలో దాన్ని ఎలాంటి ఇతర ఆదాయంతో సర్దుబాటు చేయడానికి వీలుకాదు.

· బదిలీ లావాదేవీ వివరాలు తెలుసుకునేందుకు,..వర్చువల్ డిజిటల్ ఆస్తి బదిలీకి సంబంధించి జరిపిన చెల్లింపుపై 1శాతం చొప్పున టి.డి.ఎస్. విధించవలసి ఉంటుంది. 

· కానుక రూపంలో జరిపిన వర్చువల్ డిజిటల్ ఆస్తిపై కూడా పన్ను విధించవలసి ఉంటుంది.

వివాదాల పరిష్కార నిర్వహణ

· ఏదైనా వివాదం తలెత్తిన కేసు,.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులోనో పెండింగ్.లో ఉన్న కేసును పోలి ఉన్న పక్షంలో సంబంధిత శాఖ అప్పీలును దాఖలు చేసే ప్రక్రియను వాయిదా వేయవచ్చు. కోర్టులో వివాదం పరిష్కారమయ్యేంత వరకూ అప్పీలు దాఖలును వాయిదా వేయవచ్చు.

· పన్ను చెల్లింపు దార్లకు, ప్రభుత్వ శాఖకు మధ్య పదే పదే తలెత్తే వివాదాలను, తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.

ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐ.ఎఫ్.ఎస్.సి.)కు పన్ను రాయితీలు

· కొన్ని షరతులకు లోబడి ఈ దిగువన పేర్కొన్న ఆదాయాలపై పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Ø ప్రవాస భారతీయుడు ఆఫ్ షోర్ డెరివేటివ్ సదుపాయాల ద్వారా సెక్యూరిటీల్లో పెట్టుబడితో సాధించిన ఆదాయం.

Ø విదేశీ బ్యాంకింగ్ యూనిట్ ఓవర్ ది కౌంటర్ ద్వారా జారీ చేసిన డెరివేటివ్ సదుపాయాలతో వచ్చిన ఆదాయం.

Ø ఏదైనా నౌక లీజుకు ఇచ్చిన సందర్భంలో రాయల్టీ, వడ్డీపై అందివచ్చే ఆదాయం.

Ø ఐ.ఎఫ్.ఎస్.సి.లోని పోర్ట్ ఫోలియో నిర్వహణా సేవలనుంచి అందిన ఆదాయం.

సర్చార్జీ హేతుబద్ధీకరణ

  • ఏదైనా కాంట్రాక్ట్ అమలుకోసంఏర్పడిన వ్యక్తుల కూటమి లేదా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ( ఎ.ఒ.పి.ల)పై విధించే సర్చార్జీని 15శాతం పరిమితం చేశారు.

· విడి కంపెనీలు, ఎ.ఒ.పి.ల మధ్య. సర్చార్జీలో అసమానతలను తగ్గించేందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.

· ఎలాంటి ఆస్తుల బదిలీ ద్వారా అయినా లభేంచే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై సర్చార్జీని కూడా 15శాతానికి పరిమితం చేశారు.

· స్టార్టప్ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ చర్యలన్నీ తీసుకున్నారు.

ఆరోగ్య, విద్యా సుంకం

· ఆదాయంపై విధించే ఏదైనా సర్చార్జీని లేదా సుంకాన్ని వాణిజ్య వ్యయంగా పరిగణించేందుకు అనుమతించరు.

పన్ను ఎగవేత నిరోధకం

· ఏవైనా సోదాలు, సర్వేలు జరిపిన సందర్భంగా పసిగట్టిన రహస్య ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి నష్టంతోనూ సర్దుబాటుకు అనుమతించరు.

మూలంనుంచి పన్ను కోత (టి.డి.ఎస్.) నిబంధనలు

· వాణిజ్య ప్రోత్సాహక వ్యూహంలో భాగంగా వివిధ ఏజెంట్లకు బదిలీ అయిన ప్రయోజనాలపై విధింపు.

· పెన్షన్.గా అందించే ప్రయోజనాలపై పన్ను కోత విధింపు. ఒక ఆర్థిక సంవత్సరంలో అందే సదరు ప్రయోజనాల సగటు విలువ రూ. 20,000 మించిన పక్షంలో టి.డి.ఎస్. విధింపు.

పరోక్ష పన్నులు

వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) గణనీయమైన ప్రగతి

· వైరస్ మహమ్మారి సవాళ్లు ఎదురైనా జి.ఎస్.టి. ఆదాయం మాత్రం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.– జి.ఎస్.టి. ప్రగతి నేపథ్యంలో పన్ను చెల్లింపు దార్లు అభినందనీయులయ్యారు.

ప్రత్యేక ఆర్థిక మండలాలు (ఎస్.ఇ.జెడ్.లు)

· ఎస్.ఇ.జెడ్.ల సుంకాల పరిపాలనా నిర్వహణ వ్యవస్థ పూర్తిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారితం కాబోతోంది. కస్టమ్స్ నేషనల్ పోర్టల్ వ్యవస్థను అమలుచేసే పనులు 2022 సెప్టెంబరు 30లోగా మొదలవుతాయి.

కస్టమ్స్ సంస్కరణలు, సుంకం రేట్ల మార్పులు

· కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మనుషుల భౌతిక ప్రమేయం లేని కస్టమ్స్ సుంకాల వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కస్టమ్స్ వ్యవస్థ ఎంతో నైపుణ్యంతో పనిచేసింది. మరెంతో క్రియాశీలతను ప్రదర్శించింది.

ప్రాజెక్టు దిగుమతులు, ఉత్పాదక యాంత్రిక ఉపకరణాలు

· ఉత్పాదక యాంత్రిక ఉపకరణాలు, ప్రాజెక్టు దిగుమతులపై అమలుచేసే రాయితీ రేట్ల వ్యవస్థను క్రమానుగతంగా తొలగించడం; స్వదేశీ రంగానికి సానుకూలంగా, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా ఒక స్వల్పంగా 7.5శాతం పన్నును వర్తింపజేయడం.

· అయితే, దేశంలో తయారు కాని కొన్ని అధునాతన యాంత్రిక ఉపకరణాలపై అమలులో ఉన్న కొన్ని మినహాయింపులు మాత్రం కొనసాగుతాయి.

· ఉత్పాదక యాంత్రిక ఉపకరణాల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా స్పెషలైజ్డ్ కాస్టింగ్స్, బాల్ స్క్రూ, లీనియర్ మోషన్ గైడ్ వంటి ఉపకరణాలపై కొన్ని పన్ను మినహాయింపులను ప్రవేశపెట్టారు.

కస్టమ్స్ సుంకాల మినహాయింపులు, పన్ను సరళీకరణలపై సమీక్ష

· మినహాయింపు పరిధిలో ఉన్న 350కిపైగా అంశాలను క్రమంగా తొలగించివేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. కొన్ని వ్యవసాయ ఉత్పాదనలు, రసాయనాలు, వస్త్రాలు,.. స్వదేశీ ఉత్పాదనా సామర్థ్యం కలిగిన వైద్య పరికరాలు, ఔషధాలు, మందులు వంటి వాటిపై మినహాయింపులను తొలగించాలని సంకల్పించారు.

· రసాయనాలు, జవుళి ఉత్పాదనలు, లోహాలు వంటి రంగాలకు సంబంధించిన సుంకాల రేట్లను, పన్ను వ్యవస్థను సరళీకరించి, తద్వారా వివాదాలను తగ్గించనున్నారు;  భారతదేశంలో తయారవుతున్న, లేదా తయారయ్యేందుకు అవకాశం ఉన్న వస్తువులపై మినహాయింపులను తొలగించాలని, ఉత్పాదనలకు అవసరమైన ముడి సరకులపై సుంకాల్లో రాయితీలు ఇన్వాలని ప్రతిపాదించారు. – ‘మేక్ ఇన్ ఇండియా’,  ‘ఆత్మనిర్భర భారత్’ స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకోనున్నారు.

 

వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రతిపాదనలు

ఎలక్ట్రానిక్స్

  • మనం ధరించే ఎలక్ట్రానిక్ వస్తువులు, వినికిడి పరికరాలు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్లు వంటివి స్వదేశీయంగా తయారయ్యేలా తగిన వాతావరణం కల్పించేందుకు గ్రేడెడ్ పద్ధతిలో కస్టమ్స్ సుంకం రేట్లను క్రమానుగతం చేయబోతున్నారు.

 

· మొబైల్ ఫోన్ చార్జర్ ట్రాన్స్.ఫార్మర్ల  విడిభాగాలు, మొబైల్ కెమెరా లెన్స్, మాడ్యూల్ కెమెరా లెన్స్ తదితర వస్తువులకు సుంకంలో రాయితీ కల్పించనున్నారు. – హై గ్రోత్ ఎలక్ట్రానిక్ వస్తువులను స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకోనున్నారు.

రత్నాలు, ఆభరణాలు

· కోతకోసిన, మెరుగుపెట్టిన వజ్రాలు, విలువై రాళ్లపై కస్టమ్స్ సుంకాన్ని 5శాతానికి తగ్గించారు;  సింప్లీ సాన్ వజ్రాలపై కస్టమ్స్ సుంకం తీసివేశారు. – దేశంలో విలువైన రాళ్ల, వజ్రాల ఆభరణాల రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

  • ఇందుకు సంబంధించి సరళీకరించిన నియంత్రణా వ్యవస్థను ఈ ఏడాది జూన్ నెలలోగా అమలు చేస్తారు – ఈ కామర్స్ వేదికగా ఆభరణాల ఎగుమతికి సానుకూలంగా ఈ చర్యలు చేపట్టారు

 

· ఇమిటేషన్ ఆభరణాల దిగుమతిపై కిలోగ్రాముకు కనీసం రూ. 400 చొప్పున కస్టమ్స్ సుంకాన్ని చెల్లింవలసి ఉంటుంది. అంతగా విలువలేని ఇమిటేషన్ ఆభరణాల దిగుమతికి ప్రోత్సాహం తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

రసాయనాలు

· మెథనాల్, అసిటిక్ ఆమ్లం, పెట్రోలియం శుద్ధిలో వాడే ఫీడ్ స్టాక్స్ వంటి కీలక రసాయనాలపై కస్టమ్స్ సుంకాన్ని తగిస్తున్నారు; స్వదేశీ తయారీ సామర్థ్యం ఉన్న సోడియం సైనైడ్.పై సుంకాన్ని పెంచుతున్నారు.- స్వదేశీ విలువల జోడింపు ప్రక్రియను పెంచేందుకు ఈ చర్య దోహదపడతుంది. 

సూక్మ చిన్న మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు)

· దిగుమతి చేసుకునే గొడుగులపై కస్టమ్స్ సుంకాన్ని 20శాతానికి పెంచనున్నారు. గొడుగుల తయారీలో వాడే విడిభాగాలపై మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నారు.

· భారతదేశంలో తయారయ్యే వ్యవసాయ రంగ పరికరాలు, ఉపకరణాలపై మినహాయింపులను హేతుబద్ధం చేయబోతున్నారు.

· ఉక్కు రద్దీ సామగ్రి దిగుమతికి గత ఏడాది అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపును మరో ఏడాదిపాటు పొడిగించారు. ఎం.ఎస్.ఎం.ఇ. ద్వితీయ శ్రేణి ఉత్పత్తి దారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

· స్టీల్, కోటింగ్ ఫ్లాట్ ఉత్పాదనలు, అల్లోయ్ స్టీల్, హైస్పీడ్ స్టీల్.పై విధించిన యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ సుంకాన్ని (సి.వి.డి.ని) రద్దు చేయబోతున్నారు. లోహాల ధరలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నారు.  

ఎగుమతులు

  • ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా అలంకరణ ప్రక్రియ, ట్రిమ్మింగ్, గుండీలు, జిప్పర్లు, లైనింగ్ వస్త్ర సామగ్రి, ప్రత్యేకమైన తోలు, ఫర్నిచర్ ఫిట్టింగ్స్, ప్యాకేజీ బాక్సులు వంటి వాటిపై మినహాయింపులు ఇవ్వబోతున్నారు.

 

  • రొయ్యల సాగుకు అవసరమైన కొన్ని ఉపకరణాలపై సుంకాన్ని తగ్గిస్తున్నారు. రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకుంటున్నారు.

 

ఇంధన మిశ్రమ ప్రక్రియను ప్రోత్సహించేందుకు చర్యలు

· మిశ్రమం చేయని ఇంధనంపై అదనంగా లీటర్.కు రూ. 2 చొప్పున ఎక్సయిజ్ సుంకం విధిస్తారు. 2022 అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఈ సుంకం విధింపు అమలులోకి వస్తుంది. ఇంధన మిశ్రమ ప్రక్రియను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారు.

 

***

 


(Release ID: 1794429) Visitor Counter : 2465