ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ మహమ్మారి సమయంలో సామాజిక సేవా రంగాలపై ప్రభుత్వ వ్యయం చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది.
2021-22 బడ్జెట్ అంచనాలు పరిశీలించినపుడు ప్రభుత్వం సామాజికక సేవా రంగాలకు కేటాయింపులు 9.8 శాతం పెరిగాయి.
ఆరోగ్య రంగ వ్యయానికి కేటాయింపులు 2021-22లో 73 శాతం, విద్యారంగానికి 20 శాతం పెరిగాయి.
జల్ జీవన్ మిషన్ కింద 19-01-2022 నాటికి 8 లక్షలకు పైగా పాఠశాలలకు కుళాయి ద్వారా నీటి సరఫరా సదుపాయం కల్పించడం జరిగింది.
ప్రాథమిక, ప్రాథమమికోన్నత, మాధ్యమిక స్థాయి విద్యారంగంలో 2019-20 లో మధ్యలో బడిమానేసే వారి సంఖ్య తగ్గింది.
2019-20 సంవత్సరంలో 26.45 కోట్లమంది బాలలు పాఠశాలల్లో చేరారు. అంతకు ముందు సంవత్సరాలలో స్థూల ఎన్‌రోల్ మెంట్ శాతం తగ్గుతూ రాగా దానికి భిన్నంగా పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరిగింది.
వార్షికక విద్యా స్థాయి నివేదిక 2021 ని పరిశీలించినపుడు, గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరిగినట్టు తేలింది.
Posted On:
31 JAN 2022 3:04PM by PIB Hyderabad
సామాజిక సేవా రంగాలపై ప్రభత్వ వ్యయం , కోవిడ్ మహమ్మారి సమయంలో గణనీయంగా పెరిగినట్టు 2021-22 ఆర్ధిక సర్వే తెలియజేసింది. కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సర ఆర్ధిక సర్వేని ఈరోజు పార్లమెంటుకు సమర్పించారు. 2021-22లో 2020-21 సంవత్సరం కంటే సామాజిక సేవా రంగ వ్యయానికి కేటాయింపులు 9.8 శాతం పెంచారు.
సామాజికకక సేవా రంగ వ్యయంః
2021-22 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 సంవత్సరంలో సామాజిక సేవా రంగ వ్యయానికి సుమారు 71.61 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాయి. 2020-21 సవరించిన వ్యయం కూడా బడ్జెట్ మొత్తం కంటే 54,000 కోట్ల రూపాయలు పెరిగింది. 2021-22 (బిఇ)లో ఈ రంగానికి కేటాయింపులు స్థూల దేశీయ ఉత్పత్తిలో 8.6 శౄతం మేరకు పెరిగినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2020-21 సవరించిన అంచనాలలో ఇది జిడిపిలో 8.3 శాతం మాత్రమే. గడచిన 5 సంవత్సరాలలో సామాజిక సేవాల రంగాలలో ప్రభుత్వ వ్యయం మొత్తం ప్రభుత్వ వ్యయంలో 25 శాతం గా ఉంది.2021-22 (బిఇ)లో ఇది 26.6 శాతం.
ఆరోగ్య రంగంపై వ్యయం 2019-20 సంవత్సరంలో 2.73 ల్షల కోట్ల రూపాయలు ఉండగా అది 2021-22 సంవత్సరం (బిఇ) ప్రకారం 4.72 లక్షల కోట్లకు పెరిగింది. అంటే సుమారు 73 శాతం పెరిగింది. ఇక విద్యారంగం విషయంలో అదే కాలంలో పెరుగుదల 20 శాతంగా సర్వే తెలిపింది.
విద్య
2019-20 అసెస్ మెంట్ సంవత్సరం అంటే కోవిడ్ మహమ్మారికి ముందు సంవత్సరంలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకరాం ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాలలు మినహా గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలలు 2018-19, 2019-20 లో పెరుగుతూ వచ్చాయని సర్వే తెలిపింది.
జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంచినీటి సరఫరా, పాఠశాలల్లో పారిశుధ్యం కల్పించడంతోపాటు పాఠశాలలో అవసరమైన వనరులు , ఆస్థులు కల్పించేందుకు సమగ్ర శిక్షా పథకం కీలకంగా దోహదపడినట్టు ఆర్ధిక సర్వే తెలిపింది. 19-01-2022 నాటికి జల్ జీవన్ మిషన్ కింద 8,39,443 పాఠశాలలకు కుళాయినీటిని అందించడం జరిగింది. దీనికితోడు అన్ని స్థాయిలలో పాఠశాలల్లో 2012-13 సంవత్సరం నుంచి 2019-20 వరకు ఉపాధ్యాయుల అందుబాటు మెరుగుపడింది.
2019-20లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో , మాధ్యమిక విద్యా స్థాయిలో మధ్యలోనే బడిమానేసేవారి సంఖ్య పడిపోయినట్టు సర్వే తెలిపింది. 2019-20 లో బడి మధ్యలోనే మానేసేవారి రేటు ప్రాథమిక స్థాయిలో 1.45 శాతానిక పడిపోయింది. 2018-19లో ఇది 4.45 శాతం . బడిమానేసే వారి సంఖ్యలో తగ్గుదల అటు బాలురు, బాలికలలో ఇద్దరిలోనూ ఉంది. అంతకు ముందు రెండు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే మధ్యలో బడిమానేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2019-20 లో ఇందుకు భిన్నంగా బడిమానేసే వారి సంఖ్య తగ్గింది.
విద్యారంగంలోని అన్ని స్థాయిలలో స్థూల ఎన్ రోల్ మెంట్ రేటు (జిఇఆర్) 2019-20లో పెరుగుదలను సాధించినట్టు ఆర్ధిక సర్వే తెలిపింది. అలాగే ఎన్ రోల్ మెంట్ లో స్త్రీపురుష మధ్య సమానత్వం కూడా మెరగుపడింది. 2019-20లో 26.45 కోట్ల మంది బాలలు పాఠశాలల్లో చేరారు. ఇది 2016-17, 2018-19 లలో ఉన్న జిఇఆర్ పతన ట్రెండ్‌ను నిలువరించి రివర్స్ చేయడానికి ఉపకరించింది. ఈ సంవత్సరంలో పాఠశాలలు అదనంగా 43 లక్షల మందిని చేర్చుకున్నాయి. ఇందులో 26 లక్షల మంది ప్రైమరి నుంచి హయ్యర్ సెకండరీ స్థాయిలో ఉన్నారు. ఇందులో 16 లక్షల మంది ప్రీ ప్రైమరీ కి చెందిన వారని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఐఎస్ ఎఫ్ ప్లస్ తెలియజేస్తోంది.
ఉన్నత విద్యలో స్థూల ఎన్‌రోల్ మెంట్ శౄతం 2019-20లో 27.1 శాతం గా ఉంది. ఇది 2018-19 లోని 26.3 శాతం కంటే స్వల్పంగా ఎక్కువ. ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు ఆర్ధిక సర్వే తెలిపిది. ఇందుకు నేషనల్ అప్రెంటిస్ షిఫ్ ట్రైనింగ్ పథకం, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్, ఈ పిజి పాఠశౄల, ఉన్నత్ భారత్ అభియాన్, బలహీన వర్గాల వారికి స్కాలర్ షిప్ వంటివి ఉన్నాయి.
కోవిడ్ మహమ్మారి ప్రభావం విద్యారంగంపై చెప్పుకోదగిన స్థాయిలో ఉంది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది పాఠశాల, కళాశాల విద్యార్థులపై ఉన్నట్టు ఆర్ధిక సర్వే తెలిపింది. పలుమార్లు లాక్‌డౌన్ విధించడం వల్ల విద్యారంగంపై దాని ప్రభావాన్ని వాస్తవికంగా అంచనా వేయడం కష్టంగా మారిందని ఆర్ధిక సర్వే పేర్కొంది. అధికారిక గణాంకాలు 2019-20 కి సంబంధించినవి అందుబాటులో ఉన్నందువల్ల వాస్తవ స్తితి అంచనా వేయడం కష్టమని పేర్కొంది. 2021 వార్షిక విద్యా స్థాయి నివేదికను ప్రస్తావిస్తూ, గ్రామీణ ప్రాంతాలలో విద్యారంగంపై కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేసిందని తెలిపింది. ఎఎస్ ఇఆర్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్య ఎన్ రోల్ మెంట్ పెరిగిందని తెలిపింది. ఈ వయసువారిలో పాఠశాలలో చేరనివారి శాతం 2018 లో 12.1 శాతం ఉండగా 2021లో అది 6.6 శాతానికి పడిపోయింది. అయితే ఎఎస్ ఇఆర్ నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి సమయంలో 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య వయసుగల వారిలో ప్రస్తుతం పాఠశాలలో చేరని వారి సంక్జ్ఞ 2018లో 2.5 శాతం ఉండగా 2021లో ఇది 4.6 శాతానికి పెరిగింది. పాఠశాల వెలుపల ఉన్న విద్యార్థులను గుర్తించడం, వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు , పరిశోధన ఫలితాలను ఇచ్చిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కోవిడ్ -19 కార్యాచరణను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం పంపినట్టు ఆర్ధిక సర్వే సూచించింది.
ఎఎస్ ఇ ఆర్ నివేదిక , కోవిడ్ మహమ్మారి సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలోకి మారినట్టు గుర్తించింది. ఇది అన్ని వయసుల వారిలోనూ కనిపించినట్టు పేర్కొంది. ఇందుకు కారణం, తక్కువ ఖర్చుకాగల ప్రైవేటు పాఠశాలలు మూతపడడం, తల్లిదండ్రులు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత సదుపాయాలు, వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు రావడం వంటివి కారణాలు కావచ్చని నివేదిక తెలిపింది. 2020 జూలైలో ప్రభుత్వం వలస కార్మికుల పిల్లలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు పాఠశాలల్లో చేరేందుకు ఏ రకమైన డాక్యుమెంట్లుఅవసరం లేకుండా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గుర్తింపు పత్రం మినహా ఏ రకమైన డాక్యుమెంట్లు అడగవద్దని సూచించినట్టు సర్వే పేర్కొంది.
దేశంలో స్మార్ట్ ఫోన్లు 2018లో 36.5 శాతం ఉండగా 2021లో అవి 67.6 శాతానికి పెరగినప్పటికీ,ఎఎస్ఇఆర్ నివేదిక ప్రకారం పై తరగతులలోని విద్యార్థుల కన్న ,చిన్న తరగతులలోని విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తేలింది. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం, నెట్ వర్క్ సంబంధిత సమస్యలు వంటి వాటిని విద్యార్థులు ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే వారి ప్రస్తుత గ్రేడ్ కు సంబంధించిఎన్ రోల్ అయిన విద్యార్థులందరికీ దాదాపుగా (91.9%) పాఠ్యపుస్తకాలను అందించడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చేరే పిల్లల ఎన్ రోల్‌మెంట్ నిష్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే పెరిగినట్టు తెలింది.
విద్యారంగంపై కోవిడ్ మహమ్మారి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. కోవిడ్ మహమ్మారి సమయంలో వివిధ ప్రైవేటు అధ్యయనాలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.
విద్యార్థుల ఇళ్లవద్దకే వెళ్లి పాఠ్యపుస్తకాలు అందజేయడం, టెలిఫోన్ ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయడం, టివి, రేడియొ, తారా ఇంటరాక్టివ్ చాట్ బాట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ ట్రైనింగ్ తదితరాలు విడుదల చేసిన ప్రత్యామ్నాయ అకడమిక్ కాలండర్ ద్వారా యాక్టివిటీ ఆధారిత అభ్యసన, పిఎం ఈ విద్య, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్, నిపుణ్ భారత్ మిషన్ వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టినట్టు సర్వే తెలిపింది.
(Release ID: 1794111)
Visitor Counter : 311