ఆర్థిక మంత్రిత్వ శాఖ
2019లో జలజీవన మిషన్ ప్రారంభం అయినప్పటి నుంచీ 5.5 కోట్ల ఆవాసాలకు పైగా కుళాయి నీటి సరఫరా సౌకర్యం
దేశంలో 100 శాతం ఆవాసాలకు కుళాయి నీటి సరఫరా హోదాను సాధించిన 83 జిల్లాలు
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కింద గ్రామీణ భారతదేశంలో 10.86 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 5 ప్రకారం మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్న గృహ జనాభా శాతం 2015-16లో 48.5శాతం నుంచి 2019-21లో 70.2 శాతానికి పెరుగుదల
Posted On:
31 JAN 2022 3:03PM by PIB Hyderabad
జల జీవన్ మిషన్ (జెజెఎం)ను ఆగస్టు 2019న ప్రారంభించిన నాటి నుంచి 5.5 కోట్ల ఆవాసాలకు కుళాయి ద్వారా నీటి సరఫరాను అందించడం జరిగింది. సోమవారం ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే -2021-2022 ప్రకారం 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని ఆవాసాలకు జెజెఎం ద్వారా తగినంత సురక్షిత మంచి నీటిని వ్యక్తిగత ఆవాస కుళాయి కనెక్షన్ల ద్వారా అందించడం లక్ష్యంగా ఉంది. దీని వల్ల 19 కోట్ల గ్రామీ కుటుంబాలు లేదా 90 కోట్ల గ్రామీణ జనాభా లబ్ధి పొందనున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు అందిస్తూ, 2019లో గ్రామీణ ప్రాంతాలలోని 18.93 కోట్ల కుటుంబాలలో, సుమారు 3.23 కోట్ల మంది (17శాతం) గ్రామీణ కుటుంబాలకు తమ ఇళ్ళల్లో నీటి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఇక 2 జనవరి 2022నాటికి 5,51,93.885 ఆవాసాలకుమిషన్ ప్రారంభమైనప్పటి నుంచీ కుళాయి నీటి సరఫరాను అందించడం జరిగింది. ఆరు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు కుళాయి ద్వారా నీటి సరఫరాను అందించడంలో 100శాతం విజయవంతం అయ్యాయి. గోవా, తెలంగాణ, అండమాన్ & నికోబారత్ దీవులు, పుదుచ్చెర్రీ, దాద్రా, నాగర్ హవేలీ, దామన్, దియ్యు, హర్యానా లో 100శాతం ఆవాసాలకూ కుళాయి కనెక్షన్లను సాధించారు. దీనితోపాటుగా, 83 జిల్లాలు, 1016 బ్లాకులు, 62,749 పంచాయతీలు, 1,28,893 గ్రామాలూ కుళాయి నీటి సరఫరాలో 100శాతం హోదాను సాధించాయి. జల జీవన్ మిషన్ కింద 19.01.2022 నాటికి 8,39,443 పాఠశాలలకు కూడా నీటిసరఫరాను కల్పించడం జరిగింది.
జెజెఎం కింద నాణ్యత ప్రభావితమైన ప్రాంతాలు, కరువును ఎదుర్కొంటున్న, సంభవించగల, ఎడారి ప్రాంతాలకు ప్రాధాన్యతను ఇచ్చి, సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనా (ఎస్ఎజివై) గ్రామాలకు, పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, గ్రామపంచాయతీ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్ కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలకు క్రియాశీలక కుళాయి కనెక్షన్లను అందించనున్నారు. మిషన్ కోసం మొత్తం వ్యయం రూ. 3.60 లక్షల కోట్లు.
పారదర్శకత, జవాబుదారీతనం కోసం సాంకేతిక చొరవలను జెజెఎం వినియోగించనుంది- 1) భౌతిక, ఆర్థిక పురోగతిని తెలుసుకునేందుకు ఐఎంఐఎస్; 2) డాష్‌బోర్డ్ 3) మొబైల్ ఆప్ 4) వాస్తవ సమయం ప్రాతిపదికన గ్రామాలలో పరిమాణం, నాణ్యత, క్రమబద్ధత కోసం నీటి సరఫరాను కొలవడానికి, పర్యవేక్షించడానికి సెన్సార్ ఆధారిత ఐఒటి పరిష్కారం; 5) ఆధార్ సంఖ్యతో కుళాయి కనెక్షన్ల అనుసంధానం 6) సృష్టించిన ప్రతి ఆస్తిని జియో- ట్యాగింగ్ చేయడం 7)పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ (పిఎఫ్ఎంఎస్) ద్వారా లావాదేవీలు.
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) (ఎస్‌బిఎం-జి)ః
ఎస్‌బిఎం-జి కింద గ్రామీణ పారిశుద్ధ్యం 2 అక్టోబర్ 2014లో ప్రవేశపెట్టినప్పటి నుంచీ అద్భుతమైన పురోగతిని సాధించింది. పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచీ 28.12.2021వరకు గ్రామీణ భారతదేశంలో 10.86 కోట్ల మరుగుదొడ్లను నిర్మించారు.
ఎస్‌బిఎం (జి) రెండవ దశ కింద బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) ప్లస్‌ను అన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితం చేయాలన్న లక్ష్యంతో 2020-2021 నుంచి 2024- 25 వరకు అమలు చేస్తున్నారు. 2021-22 (25.10.2021 నాటికి) మొత్తం 7.16 లక్షల వ్యక్తిగత ఆవాసాలలో మరుగుదొడ్లను నూతనంగా నిర్మిస్తున్న గృహాలలో నిర్మించడమే కాక, 19,061 కమ్యూనిటీ పారిశుద్ధ్య కాంప్లెక్స్‌లను నిర్మించారు. అంతేకాకుండా, 2,194 గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితం (ఒడిఎఫ్) ప్లస్‌గా ప్రకటించారు.
ఇటీవలే విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-5) ఐదవ విడత ఫలితాల ప్రకారం, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యం ఉన్న ఆవాసాలలో నివసిస్తున్న జనాభా 2015-16లో 48.5 శాతం నుంచి 2019-21 నాటికి 70.2 శాతానికి పెరిగింది.
***
(Release ID: 1793876)
Visitor Counter : 358