ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జనవరి 28 న కరియప్ప గ్రౌండ్ లో ఎన్ సిసి పిఎమ్ ర్యాలీ నిఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 JAN 2022 7:28PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జనవరి 28వ తేదీ నాడు మధ్యాహ్నం పూట ఇంచుమించు 12 గంటల వేళ కు దిల్లీ లోని కరియప్ప మైదానం లో జరిగే నేశనల్ కేడెట్ కోర్ (ఎన్ సిసి) పిఎమ్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

నిజాని కి ఎన్ సిసి గణతంత్ర దినం శిబిరానికి ముగింపు ను పలుకుతుందన్నమాట, ఈ ర్యాలీ ని ప్రతి సంవత్సరం లో జనవరి 28వ తేదీ న నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రధాన మంత్రి గౌరవ వందనాన్ని పరిశీలిస్తారు; అంతేకాక, ఎన్ సిసి దళాల కవాతు ను సమీక్షిస్తారు. దీనితో పాటు గా, ఎన్ సిసి కేడెట్ ల సైనిక కార్యాచరణ ను, స్లిదరింగ్, మైక్రోలైట్ విమానాల తో చేసే విన్యాసాలను, పారా సెయిలింగ్ లో, ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల లో వారి ఉత్కృష్ట నైపుణ్యాల ను ప్రదర్శించడాన్ని కూడా ప్రధాన మంత్రి తిలకించనున్నారు. సర్వశ్రేష్ఠ కేడెట్ లకు ప్రధాన మంత్రి తరఫు న పతకాన్ని, బేటన్ ను ప్రదానం చేయడం జరుగుతుంది.

 

 

***


(రిలీజ్ ఐడి: 1793182) సందర్శకుల సూచీ సంఖ్య : : 184