ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల మార్కెట్ అమ్మకానికి 'నియంత్రణతో' కూడిన అనుమతులు మంజూరు చేసిన జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ
ప్రస్తుతం కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్ సమాచారం, టీకా భద్రత సమాచార వివరాలను అందించాలన్న షరతుపై అనుమతులు మంజూరు
కో విన్ యాప్, ఏఈఎఫ్ఐ, ఏఈఎస్ఐ వేదికల్లో పొందుపరిచిన టీకా సమాచారం ఎప్పటికప్పుడు విశ్లేషణ
కోవిడ్-19 నియంత్రణకు భారతదేశం అమలు చేస్తున్న సమర్ధ చురుకైన చర్యలకు నిదర్శనంగా అనుమతుల మంజూరు
Posted On:
27 JAN 2022 4:17PM by PIB Hyderabad
దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్-19 టీకాలను మార్కెట్లో విక్రయించడానికి షరతులు, నిబంధనలతో కూడిన అనుమతులను జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ ( డీసీజీఐ) ఈ రోజు మంజూరు చేసింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్ సిఓ )కి చెందిన నిపుణుల కమిటి సిఫార్సుల మేరకు డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. టీకాలను అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఇచ్చిన అనుమతులను సవరించి పెద్దలు వినియోగించేందుకు వీలుగా నూతన అనుమతులను మంజూరు చేయాలని సీడీఎస్ సిఓ నిపుణుల కమిటీ 2022 జనవరి 19న సిఫార్సు చేసింది.
ఈ కింది నిబంధనలతో కోవిడ్-19 టీకాలు కొవాగ్జిన్,, కొవిషీల్డ్ టీకాలను మార్కెట్ లో విడుదల చేసేందుకు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.
1. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా అందుబాటులో ఉన్నప్పుడు ( ఏది ముందు అయితే అది) విదేశాల్లో సాగుతున్న క్లినికల్ ట్రయల్స్ వివరాలను విశ్లేషణతో సంస్థ సమర్పించవలసి ఉంటుంది.
2. ప్రోగ్రమాటిక్ సెట్టింగ్ కోసం సరఫరా చేసిన టీకాల వివరాలను అందజేయవలసి ఉంటుంది. దేశంలో వేసిన టీకాల వివరాలను కో విన్ యాప్ లో పొందుపరచవలసి ఉంటుంది. టీకా ప్రతికూల ప్రభావాలపై పర్యవేక్షణ కొనసాగించాలి. టీకా వేసిన తరువాత చోటుచేసుకున్న సంఘటనలు, ప్రత్యేక సంఘటనలకు సంబంధించి భద్రతా సమాచారాన్ని విశ్లేషించి సంస్థ ఎన్ డి సి టి నిబంధనలు, 2019 ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా అందుబాటులో ఉన్నప్పుడు ( ఏది ముందు అయితే అది) అందించవలసి ఉంటుంది.
కోవిడ్ 19 నియంత్రణకు సమర్ధంగా, చురుకుగా వేగంగా చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో రూపొందించిన ప్రణాళికను భారతదేశం అమలు చేస్తోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వేగంగా, సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తాజాగా టీకాలను మార్కెట్ లో విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులు మంజూరు అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న నిబంధనలకు లోబడి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా లో ఫైజర్, మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ యూకే లో ఆస్ట్రాజెనెకాకు మాత్రమే"షరతులతో కూడిన మార్కెట్ అధికారాలు " మంజూరు చేసాయి.
ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి సమయంలో ' షరతులు, నిబంధనలతో కూడిన మార్కెట్ విక్రయాలు' అనే నూతన మార్కెట్ విధానం అమలు లోకి వచ్చింది. ఈ విధానం కింద అవసరాలకు అనుగుణంగా ఔషదాలు, టీకాల అమ్మకాలకు షరతులు, నిబంధనలతో కూడిన అనుమతులను వేగంగా జారీ చేయడం జరుగుతుంది.
దేశంలో జాతీయ టీకా కార్యక్రమం 2021 జనవరి 16 న ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో ఇంతవరకు 160 కోట్లకు పైగా టీకా డోసులను వేయడం జరిగింది. దేశంలో కోవిడ్-19 టీకా కార్యక్రమం వేగంగా అమలు జరిగి, ఎక్కువ మందికి టీకాలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటున్నది. 2022 జనవరి మూడవ తేదీ నుంచి అర్హులైన మరికొన్ని తరగతులకు చెందినవారికి టీకాలను వేసే కార్యక్రమం దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.
(Release ID: 1793093)
Visitor Counter : 206
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam