ప్రధాన మంత్రి కార్యాలయం

మేఘాలయ 50వ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి చేసినప్రసంగం


‘‘ప్రకృతి, ప్రగతి, సంరక్షణ మరియు పర్యావరణం తో కలసి మనుగడ సాగించడంఅనేటటువంటి సందేశాన్ని ప్రపంచాని కి మేఘాలయ ఇచ్చింది’’

‘‘మేఘాలయ అంతటా ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నారు;  శిలాంగ్ చాంబర్ కాయిర్ ఈ అంశాన్ని కొత్తశిఖరాల కు తీసుకుపోయింది’’

‘‘మేఘాలయ లోని సమృద్ధమైనటువంటి క్రీడా సంస్కృతి పైన దేశం ఎన్నో ఆశ లు పెట్టుకొంది’’

‘‘మేఘాలయ కు చెందిన సోదరీమణులు వెదురు అల్లిక కళ ను పునరుద్ధరించారు.  మేఘాలయ లోని కష్టించిపనిచేసే రైతులు సేంద్రియ రాష్ట్రం గా మేఘాలయ కు ఉన్న  గుర్తింపు ను ఇనుమడింపచేస్తున్నారు’’

Posted On: 21 JAN 2022 1:07PM by PIB Hyderabad

మేఘాలయ 50వ స్థాపన దినం నాడు మేఘాలయ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాపన కు, రాష్ట్రం అభివృద్ధి కి తోడ్పాటు ను అందించిన ప్రతి ఒక్కరి కి ఆయన అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మాట్లాడుతూ, తాను ప్రధాన మంత్రి గా పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత నార్థ్ ఈస్టర్న్ కౌన్సిల్ మీట్ కు హాజరు కావడం కోసం శిలాంగ్ ను సందర్శించిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి పదవి లో ఉన్న వ్యక్తి 3-4 దశాబ్దాల అవధి అనంతరం మేఘాలయ కు జరిపిన మొదటి యాత్ర అది. పకృతి తో సన్నిహితం గా మెలగుతారన్న గుర్తింపు ను రాష్ట్ర ప్రజలు మరింత బలపరచడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘ ప్రకృతి, ప్రగతి, సంరక్షణ, పర్యావరణం తో అన్యోన్యం గా మనుగడ సాగించడం అనేటటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి మేఘాలయ ఇచ్చింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

విస్లింగ్ విలేజ్ సంప్రదాయాన్ని మరియు ప్రతి గ్రామం లో గాయక బృందాలు ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, కళారంగానికి సంగీత రంగానికి రాష్ట్రం అందించిన తోడ్పాటు కు నమస్సులు అర్పించారు. ఈ గడ్డ మీద ప్రతిభావంతులైన కళాకారుల కు కొదువ లేదు. మరి శిలాంగ్ చాంబర్ కాయిర్ దీని ని సరికొత్త శిఖరాల కు తీసుకు పోయింది అని ఆయన అన్నారు. మేఘాలయ లోని సంపన్నమైన క్రీడా సంస్కృతి పైన దేశం ఎన్నో ఆశల ను పెంచుకొంది అని ఆయన అన్నారు.

సేంద్రియ వ్యవసాయ రంగం లో రాష్ట్రం పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతుండడాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘మేఘాలయ కు చెందిన సోదరీమణులు వెదురు అల్లిక కళ ను పునరుద్ధరించారు. మరి ఈ రాష్ట్రం లోని కష్టించి పని చేసే రైతులు సేంద్రియ రాష్ట్రం గా మేఘాలయ కు ఉన్న గుర్తింపు ను దృఢతరం చేస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

ఉత్తమమైన రహదారులు, రైలు మార్గాలు, ఇంకా వాయు సంధానం అంశాల పట్ల ప్రభుత్వాల కు ఉన్న వచన బద్ధత ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్రం లోని సేంద్రియ ఉత్పత్తుల కు సరికొత్త దేశీయ బజారు తో పాటు ప్రపంచ బజారు కూడా దొరికేటట్లు చూసేందుకు చర్యల ను తీసుకోవడమైంది అని ఆయన అన్నారు. కేంద్ర పథకాల ను ప్రజల వద్దకు తీసుకు పోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు గాను కృషి చేస్తోంది అని ఆయన అన్నారు. పిఎమ్ గ్రామీణ్ సడక్ యోజన, ఇంకా నేశనల్ లైవ్ లీ హుడ్ మిశన్ ల వంటి పథకాలు మేఘాలయ కు ప్రయోజనాన్ని అందించాయి అని ఆయన వివరించారు. ప్రస్తుతం జల్ జీవన్ మిశన్ 33 శాతం కుటుంబాల కు నల్లా నీటి ని అందించింది. 2019వ సంవత్సరం లో ఈ సౌకర్యం లభించిన కుటుంబాలు ఒక్క శాతమే ఉన్నాయి అని ఆయన వివరించారు. టీకా మందు ను అందజేయడం కోసం డ్రోన్ లను ఉపయోగించిన తొలి విడత రాష్ట్రాల లో మేఘాలయ ఒకటి అని ప్రధాన మంత్రి తెలియజేశారు.

పర్యటన రంగాని కి, సేంద్రియ ఉత్పత్తుల కు తోడు గా కొత్త రంగాల ను అభివృద్ధి పరచడాని కి కంకణం కట్టుకోవడం తో పాటు మేఘాలయ ప్రజల కు తన సమర్ధన కొనసాగుతుందంటూ ప్రధాన మంత్రి భరోసా ను ఇస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

DS

 



(Release ID: 1791497) Visitor Counter : 141