ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ) లో 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకుఆమోదం  తెలిపిన మంత్రిమండలి


ఏడాది కాలం లో దాదాపు గా 10,200 ఉద్యోగాల కు అవకాశం;  అలాగే సుమారు గా 7.49 మిలియన్ టన్నుల సిఒ2 / ప్రతి సంవత్సరం లో తత్సమానమైనటువంటి కార్బన్  డై - ఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపునకు వీలు

Posted On: 19 JAN 2022 3:40PM by PIB Hyderabad

ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ) కు నగదు ను ఇవ్వడం ద్వారా ఎక్విటి శేర్ లను కొనుగోలు చేసి 1,500 కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి పెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గం సంఘం సమావేశం ఆమోదం తెలిపింది.

నగదు ను ఇచ్చి ఎక్విటి శేర్ లను జారీ చేయడం తో సంవత్సర కాలం లో సుమారు 10,200 ఉద్యోగాల కల్పన కు దోహదం లభించగలదు; దీనితో పాటుగా 7.49 మిలియన్ టన్నుల మేరకు సిఒ2 / ప్రతి సంవత్సరం తత్సమానమైనటువంటి కార్బన్ డై - ఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపున కు కూడా తోడ్పాటు లభించనుంది.

భారత ప్రభుత్వం ద్వారా 1,500 కోట్ల రూపాయల మేరకు నగదు మంజూరు తో అదనపు ఎక్విటి శేర్ లను కొనుగోలు చేయడం తో ఐఆర్ఇడిఎ కు ఈ కింద వివరించిన మేరకు సామర్థ్యం ప్రాప్తించగలదు:

  1. నవీకరణ యోగ్య శక్తి (ఆర్ఇ) రంగాని కి సుమారు గా 12000 కోట్ల రూపాయల రుణం లభించగలదు. దీని ద్వారా నవీకరణ యోగ్య శక్తి రంగం లో 3500 మెగావాట్ (ఎమ్ డబ్ల్యు) నుంచి 4000 ఎమ్ డబ్ల్యు వరకు అదనపు సామర్ధ్యానికి సంబంధించినటువంటి రుణ ఆవశ్యకత పూర్తి అవుతుంది.
  2. సంస్థ యొక్క నికర విలువ ను వృద్ధి చెందింపచేసుకోవడం కోసం ఇది సహాయకారి కానుంది. సంస్థ అదనపు ఆర్ ఇ ఆర్థిక సహాయాన్ని సమకూర్చుకోగలదన్నమాట. ఈ విధం గా ప్రభుత్వం నిర్దేశించుకొన్నటువంటి నవీకరణ యోగ్య శక్తి సంబంధి లక్ష్యాల ను అందుకోవడం లో మెరుగైన తోడ్పాటు లభించనుంది.
  3. రుణం ఇవ్వడం మరియు రుణం తీసుకోవడం వంటి కార్యకలాపాల నిర్వహణ సౌకర్యవంతం గా ఉండటం కోసం కేపిటల్-టు-రిస్క్ వెయిటెడ్ ఎసెట్ రేశియో (సిఆర్ఎఆర్) ను మెరుగు పరచుకోవడానికి దోహదం లభించగలదు.

ఐఆర్ఇడిఎ అనేది ఒక మీని రత్న (ఒకటో కేటగిరీ కంపెనీ). ఇది నవీన మరియు నవీకరణయోగ్య శక్తి మంత్రిత్వ శాఖ యొక్క నియంత్రణ లో ఉంది. దీనిని నవీకరణ యోగ్య శక్తి (ఆర్ఇ) రంగం కోసం ప్రత్యేకం గా ఒక బ్యాంకింగేతర ఏజెన్సీ వలె విధులు నిర్వహించేందుకు గాను 1987వ సంవత్సరం లో స్థాపించడమైంది. ఐఆర్ డిఇఎ కు 34 సంవత్సరాల కు పైగా సాంకేతిక పరమైనటువంటి మరియు వాణిజ్య సంబంధమైనటువంటి అనుభవం ఉన్నది. ఆ సంస్థ తన నవీకరణ యోగ్య శక్తి సంబంధి పథకాల కు ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం లో ఒక ముఖ్య భూమిక ను నిర్వహిస్తున్నది. దీనితో బ్యాంకుల కు, ఆర్థిక సంస్థల కు ఈ రంగం లో రుణాలను ఇవ్వడం లో విశ్వాసం జనిస్తున్నది.

 

**

 

 (Release ID: 1791013) Visitor Counter : 222