ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

15 ఏళ్ళు మొదలుకొని 18 ఏళ్ళ వయోవర్గం యువజనుల లో 50 శాతం మంది కి పైగా ఒకటో డోజు టీకా మందును ఇప్పించడం పూర్తి అయినందుకు ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 JAN 2022 10:01AM by PIB Hyderabad

15 ఏళ్ళు మొదలుకొని 18 ఏళ్ళ వయోవర్గం యువజనుల లో 50 శాతాని కి పైగా ఒకటో డోజు వ్యాక్సీనేశన్ పూర్తి అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.

ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘యువ భారతదేశం దారి ని చూపుతోంది.

ఇది ప్రోత్సాహకరమైనటువంటి సందేశం. ఈ జోరు ను మనం కొనసాగిద్దాం.

ప్రజల కు టీకా మందు ను ఇప్పించడం తో పాటు కోవిడ్-19 సంబంధి నియమాల ను అన్నిటి ని పాటించడం అనేది కూడా ప్రధానం. రండి.. మనం అందరమూ ఈ మహమ్మారి తో పోరాటం చేద్దాం.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1790934) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Gujarati , Marathi , Kannada , Tamil , Bengali , Assamese , Odia , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi