ప్రధాన మంత్రి కార్యాలయం

వరల్డ్ ఇకానామిక్ ఫోరమ్ యొక్కదావోస్ అజెండా లో భాగం గా ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్’ పేరిట ప్రత్యేక ప్రసంగాన్నిఇచ్చిన ప్రధాన మంత్రి 


‘‘భారతదేశంకరోనా కాలం లో, ‘వన్ అర్థ్, వన్ హెల్థ్’ అనే తన దృష్టికోణాన్ని అనుసరిస్తూనే అవసరమైనమందుల ను మరియు టీకాల ను సరఫరా చేసి అనేక మంది ప్రాణాల ను కాపాడింది’’

‘‘గ్లోబల్ సప్లయ్ చైన్స్ లో ప్రపంచం ఆధారపడదగ్గ భాగస్వామ్య దేశం గా తయారు కావడానికి భారతదేశం కంకణం కట్టుకొన్నది’’

‘‘భారతదేశం లో పెట్టుబడిపెట్టడానికి ఇది అత్యంత ఉత్తమమైనటువంటి కాలం’’

‘‘స్వయంసమృద్ధి ని సాధించడం కోసం భారతదేశం సాగిస్తున్న అన్వేషణ లో ప్రక్రియల ను సరళతరం గా మలచడం పైన శ్రద్ధ తీసుకోవడం ఒక్కటే కాకుండా పెట్టుబడి కి మరియు ఉత్పత్తి కి ప్రోత్సాహకాల ను కూడా ఇస్తున్నది’’

తరువాతి 25సంవత్సరాల తాలూకు లక్ష్యాల ను దృష్టి లో పెట్టుకొని భారతదేశం విధానాల ను రూపొందిస్తున్నది.ఈ కాల ఖండం లో, దేశం అధిక వృద్ధి మరియు సంక్షేమం, ఇంకా వెల్ నెస్ ల తాలూకు చరమస్థాయి కి చేరాలనే లక్ష్యాల ను నిర్దేశించుకొన్నది. వృద్ధి తాలూకు ఈ కాలం హరితంగాను, పరిశుభ్రం గాను, స్థిరత్వం తోను, అలాగే ఆధారపడదగింది గాను ఉంటుంది.

‘‘ ‘బయటకు విసరివేసే’సంస్కృతి ఇంకా వినియోగదారు మనస్తత్వం జలవాయు సంబంధి సవాలు ను పెంచివేశాయి.  ‘తీసుకో-తయారు చేయి- ఉపయోగించు-వదలిపెట్టేసెయ్’ అనే సూత్రం పై ఆధారపడ్డనేటి ఆర్థిక వ్యవస్థ నుంచి ఒక వలయాకార ఆర్థిక వ్యవస్థ వైపునకు వేగంగా మళ్లక తప్పనిస్థితి ఇది ’’

‘‘ఎల్.ఐ.ఎఫ్.ఇ.ని ఒక ప్రజా ఆందోళన గా మలచడం అనేది పి-3.. అదే ‘ప్రొ ప్లానెట్ పీపల్’’.. కు ఒక గట్టి పునాదికాగలదు’’

బహుళ పక్షీయ సంస్థల లో సంస్కరణ ల కోసంప్రతి ఒక్క ప్రజాస్వామ్యయుక్త దేశం పట్టుబట్టక తప్పదు. అది జరిగితే ఆయా సంస్థ లుప్రస్తుత సవాళ్ల తో పాటు భావి సవాళ్ల ను పరిష్కరించే కార్యాన్ని చేపట్టగలుగుతాయి’’

Posted On: 17 JAN 2022 10:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా వరల్డ్ ఇకానామిక్ ఫోరమ్ యొక్క దావోస్ అజెండా లో ‘ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ ’ పేరు తో ఒక ప్రత్యేక ప్రసంగాన్ని ఇచ్చారు.

భారతదేశం మహమ్మారి తాలూకు మరొక వేవ్ ను జాగ్రత తోను, ఆత్మవిశ్వాసం తోను ఎదుర్కొంటున్నదని, అనేక ఆశాభరితమైనటువంటి ఫలితాల తో ఆర్థిక రంగం లో ముందుకు సాగిపోతున్నదని ప్రధాన మంత్రి అన్నారు. ఒక బలమైన ప్రజాస్వామిక దేశం గా భారతదేశం మానవాళి కి ఆశ తో నిండినటువంటి ఒక పూలగుత్తి ని ఇచ్చిందని, ఆ పుష్పగుచ్ఛం లో ప్రజాస్వామ్యం పట్ల భారతదేశానికి ఉన్న అచంచలమైన నమ్మకం, ఇరవై ఒకటో శతాబ్దానికి శక్తి ని ఇస్తున్న సాంకేతిక విజ్ఞ‌ానం, ప్రతిభ లతో పాటు భారతీయుల స్వభావం అనేవి ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. వన్ అర్థ్, వన్ హెల్థ్అనేటటువంటి దార్శనికత ను అనుసరిస్తూ, కరోనా కాలం లో అవసరమైన ఔషధాల ను, టీకామందు ను ఎగుమతి చేసి ఎంతో మంది యొక్క ప్రాణాల ను కాపాడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం లో మూడో అతి పెద్ద ఔషధ నిర్మాణ దేశం గా ఉంది, మరి భారతదేశాన్ని ప్రపంచాని కి ఔషధాలయం గా భావిస్తున్నారు అని కూడా ఆయన అన్నారు.

ప్రస్తుతం భారతదేశం సాఫ్ట్ వేర్ ఇంజీనియర్ లను రికార్డు సంఖ్య లో అందజేస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. యాభై లక్షల మందికి పైగా సాఫ్ట్ వేర్ డెవలపర్ లు భారతదేశం లో పని చేస్తున్నారు అని ఆయన చెప్పారు. భారతదేశం లో ప్రస్తుతం యూనికార్న్ లు ప్రపంచం లోనే మూడో అతి పెద్ద సంఖ్య లో విస్తరించి ఉన్నాయి అని ఆయన తెలియజేశారు. గడచిన ఆరు నెలల కాలం లో పది వేల కు పైగా స్టార్ట్- అప్ స్ నమోదు అయ్యాయన్నారు. భారతదేశం లో భారీది, సురక్షితమైంది, సఫలమైనటువంటిది అయిన డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫార్మ్ ఉంది అంటూ ఆయన ప్రస్తావించారు. గత నెల రోజుల కాలం లోనే 4.4 బిలియన్ కు మించిన లావాదేవీలు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ద్వారా జరిగాయి అని ఆయన వివరించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ను వృద్ధి చెందింపచేసే దిశ లో తీసుకొంటున్నటువంటి చర్యల ను గురించి ప్రధాన మంత్రి పేర్కొన్నారు. కార్ పొరేట్ ట్యాక్స్ రేటుల ను సరళతరం చేయడం తో పాటు వాటి ని ప్రపంచం లోనే అత్యంత స్పర్ధాత్మకం గా మలచడం జరిగింది అని ఆయన వెల్లడించారు. భారతదేశం లో డ్రోన్ స్, అంతరిక్షం, జియో-స్పేశల్ మేపింగ్ వంటి రంగాల ను ఆంక్షల నుంచి విముక్తం చేయడం జరిగింది. ఐటి మరియు బిపిఒ రంగాల లో కాలం చెల్లిన టెలికమ్ నిబంధన లలో సంస్కరణ లను ప్రవేశపెట్టడమైంది అని ఆయన అన్నారు. ‘‘25 వేల కు పైగా నియమాలను పాలించవలసిన అగత్యాన్ని మేం కిందటి సంవత్సరం లో తొలగించాం’’ అని ఆయన అన్నారు.

ఒక భాగస్వామ్య దేశం గా భారతదేశాని కి ఆకర్షణ శక్తి పెరుగుతోంది అని ప్రధాన మంత్రి సూచనప్రాయం గా చెప్తూ, గ్లోబల్ సప్లయ్- చైన్స్ లో ప్రపంచం ఆధారపడదగినటువంటి భాగస్వామ్య దేశం గా తయారు కావాలి అనే విషయం లో భారతదేశం కంకణాన్ని కట్టుకొంది, అంతేకాక అనేక దేశాల తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ను కూడా భారతదేశం కుదుర్చుకొంటోంది అన్నారు. నూతన ఆవిష్కరణ, సాంకేతిక విజ్ఞ‌ానాన్ని అనుసరించడం, ఇంకా నవ పారిశ్రామికత్వ స్ఫూర్తి అనేటటువంటి వాటి లో భారతదేశానికి ఉన్న సామర్ధ్యాలు ఆదర్శవంతమైనటువంటి గ్లోబల్ పార్ట్ నర్ గా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాయి. ‘‘ఈ కారణం గానే, భారతదేశం లో పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత ఉత్తమ కాలం గా ఉంది’’ అని ఆయన అన్నారు. భారతదేశ యువత నవ పారిశ్రామికత్వం తాలూకు సరికొత్త శిఖరాన్ని చేరుకొన్న సంగతి ని గురించి ఆయన ప్రస్తావించారు. కేవలం 100 స్టార్ట్-అప్స్ ఉన్న 2014వ సంవత్సరం తో పోల్చి చూస్తే, ప్రస్తుతం భారతదేశం లో అరవై వేల కు పైగా స్టార్ట్-అప్స్ ఉన్నాయి. వాటిలో 80 స్టార్ట్-అప్స్ యూనికార్న్ స్; నలభై కి మించిన యూనికార్న్ స్ 2021వ సంవత్సరం లోనే ఎదిగాయి అని ప్రధాన మంత్రి వివరించారు.

భారతదేశం అనుసరించిన ఆత్మవిశ్వాసభరిత వైఖరి ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, కరోనా కాలం లో క్వాంటిటేటివ్ ఈజింగ్ వంటి జోక్యాల పై ప్రపంచం శ్రద్ధ తీసుకొంటూ ఉన్న వేళ భారతదేశం సంస్కరణల ను పటిష్టపరుస్తూ పోయింది అన్నారు. 6 లక్షల గ్రామాల లో ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు, సంధానం సంబంధి మౌలిక సదుపాయాల కల్పన కు గాను 1.3 ట్రిలియన్ డాలర్ ల పెట్టుబడి, ఆస్తుల నగదీకరణ ద్వారా 80 బిలియన్ డాలర్ ల ను సమీకరించే లక్ష్యానికి తోడు వస్తువులు, ప్రజలు మరియు సేవల నిరంతరాయ సంధానానికి సరికొత్త చలనశీలత ను జోడించడం కోసం సంబంధిత వర్గాలన్నింటిని ఒకే ప్లాట్ ఫార్మ్ మీదకు తీసుకు రావడానికి ఉద్దేశించిన గతిశక్తి నేశనల్ మానిటైజేశన్ ప్లాన్ వంటి వంటి వస్తురూపమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇంకా డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల పరంగా తీసుకొన్న భారీ నిర్ణయాల ను గురించి ఆయన ఒక్కటొక్కటి గా వివరించారు. స్వయంసమృద్ధి కై భారతదేశం సాగిస్తున్న అన్వేషణ లో ప్రక్రియల ను సరళతరం గా తీర్చిదిద్దడం పై శ్రద్ధ తీసుకోవడం ఒక్కటే కాకుండా పెట్టుబడి కి, ఉత్పత్తి కి ప్రోత్సాహాల ను కూడా భారతదేశం అందిస్తోంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. 14 రంగాల లో 26 బిలియన్ డాలర్ విలువైన ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకాల’ (పిఎల్ఐ స్) ను ప్రవేశపెట్టడమే దీనికి అత్యంత స్పష్టమైన నిదర్శనం గా ఉంది అని ఆయన అన్నారు. రాబోయే 25 సంవత్సరాల కు లక్ష్యాల ను దృష్టి లో పెట్టుకొని మరీ భారతదేశం విధానాల ను రూపొందిస్తోంది, దేశం అధిక వృద్ధి ని మరియు సంక్షేమం, ఇంకా వెల్ నెస్ తాలూకు చరమ స్థాయి ని అందుకోవాలి అనేటటువంటి లక్ష్యాల ను కూడా పెట్టుకొంది అని ఆయన నొక్కిచెప్పారు. వృద్ధి కి సంబంధించినటువంటి ఈ యొక్క కాలం ఆకుపచ్చని కవచం తో కూడుకొన్నదీ, పరిశుభ్రయుక్తం అయిందీ, స్థిరమైందీ, అంతే కాకుండా ఆధారపడదగింది గా కూడాను ఉంటుందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

ఈ కాలం లో జీవన శైలి పరంగాను, విధానాల పరంగాను చెల్లించవలసి ఉన్నటువంటి పర్యావరణ సంబంధి మూల్యాల ను గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకం గా వివరించారు. మన జీవన సరళి జలవాయు సంబంధి సవాళ్ల కు దారితీస్తోంది అని ఆయన అన్నారు. బయటకు విసరి పారవేసేసంస్కృతి మరియు వినియోగదారువాదం జలవాయు సంబంధి సవాలు ను పెంచివేశాయి. నేటి కాలపు తీసుకో- తయారు చేయి-వాడుకో- వదలిపెట్టేసెయ్అనే కోవ కు చెందిన ఆర్థిక వ్యవస్థ వైపు నుంచి ఒక సమ్మిళితమైన వృత్తాకార ఆర్థిక వ్యవస్థ వైపునకు శర వేగం గా మళ్లక తప్పదు అని ఆయన స్పష్టంచేశారు.

సిఒపి26 సమావేశం లో తాను పేర్కొన్న మిశన్ లైఫ్ గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, లైఫ్ (ఎల్ఐఎఫ్ఇ) ని ఒక ప్రజా ఉద్యమం గా మలచినప్పుడు అది మూడు పి లు (పి-3), అంటే ప్రొ ప్లానెట్ పీపల్కు ఒక బలమైనటువంటి పునాది కాగలుగుతుంది అన్నారు. ఇక్కడ లైఫ్ (ఎల్ఐఎఫ్ఇ) అంటే- లైఫ్ స్టైల్ ఫార్ ఇన్ వైరన్ మంట్ ; అది ఒక పట్టు విడుపు లతో కూడుకొన్నటువంటి, మనుగడ ప్రధానం అయినటువంటి జీవన శైలి ని గురించిన దృష్టికోణం, అది జలవాయు సంకటాన్ని మరియు రాబోయే కాలం లో తటస్థించే ఊహించలేనటువంటి సవాళ్ల ను ఎదుర్కోవడం లో తోడ్పడుతుంది- అనేదే. జలవాయు సంబంధి లక్ష్యాన్ని సాధించుకొనేందుకు విధించుకొన్న గడువు తేదీ ల కంటే ఎంతో ముందు గానే ఆ లక్ష్యాన్ని సాధించడం లో భారతదేశం నమోదు చేసిన ప్రభావశీల రికార్డు ను గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ ఫోరాని కి తెలియజేశారు.

ప్రపంచ వ్యవస్థ తాలూకు మారుతున్న వాస్తవాల కు తగ్గట్టు మారవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ప్రపంచ వ్యవస్థ మార్పుచేర్పుల కు లోనవుతూ ఉన్న క్రమం లో అంతర్జాతీయ పరివారం సరికొత్త సవాళ్ల ను ఎదుర్కొంటున్నది అని ఆయన అన్నారు. ఈ దశ లో ప్రతి ఒక్క దేశం, అలాగే యావత్తు ప్రపంచ సముదాయం ఉమ్మడి గా ఏకకాలికమైనటువంటి కార్యాచరణ కు నడుంకట్టాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. సరఫరా వ్యవస్థ లో అంతరాయాలు తలెత్తడం, ధరల పెరుగుదల, ఇంకా జలవాయు పరివర్తన లను ఆయన ప్రధానమైన ఉదాహరణలు గా పేర్కొన్నారు. ఆయన ఈ సందర్భం లో క్రిప్టోకరెన్సీ తాలూకు ఉదాహరణ ను కూడా ఇచ్చారు. క్రిప్టోకరెన్సీ కి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞ‌ానాలు ఇంకా వాటి సవాళ్లకు ఎదురునిలచి నిలదొక్కుకోవాలి అంటే గనక ఏ ఒక్క దేశం తీసుకొనే నిర్ణయాలో సరిపువు అని ఆయన అన్నారు. ఈ విషయం లో అంతా కలసికట్టు గా నడవాలి అని ప్రధాన మంత్రి విజ్జప్తి చేశారు. బహుపక్షీయ సంస్థ లు ఉనికి లోకి వచ్చిన కాలం నాటి నుంచి ప్రపంచం మార్పునకు లోనయింది. మారిన పరిస్థితుల లో, ప్రపంచ దేశాల కు ఎదురైన సవాళ్ల ను పరిష్కరించగల స్థితి లో బహుపక్షీయ సంస్థ లు ఉన్నాయా? అంటూ ఆయన అడిగారు. ‘‘అందుకనే ప్రతి ఒక్క ప్రజాస్వామ్యయుక్త దేశం ఈ యొక్క సంస్థ ల లో సంస్కరణ ల కోసం పట్టుబట్టడం అనేది తప్పనిసరి అయిపోయింది. అది జరిగినప్పుడు ఆ సంస్థ లు ఇప్పటి కాలం తో పాటు గా రాబోయే కాలం తాలూకు సవాళ్ల ను ఎదుర్కొని వాటి ని పరిష్కరించగల బాధ్యత ను భుజానికి ఎత్తుకోగలుగుతాయి’’ అని చెప్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

 

 



(Release ID: 1790806) Visitor Counter : 152