ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ ప్రజలకు టీకామందు ను ఇప్పించే కార్యక్రమానికి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భం లోటీకాకరణ కార్యక్రమం తో ముడిపడ్డ వారందరికీ నమస్కరించిన ప్రధాన మంత్రి
టీకాకరణ కార్యక్రమం లో వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సంరక్షణ కార్మికులు పోషించిన పాత్ర ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
16 JAN 2022 12:31PM by PIB Hyderabad
దేశ ప్రజల కు టీకామందు ను ఇప్పించే కార్యక్రమానికి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భం లో టీకాకరణ కార్యక్రమం తో ముడిపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు. టీకాకరణ కార్యక్రమం లో వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సంరక్షణ శ్రమికులు పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. కోవిడ్-19 కి వ్యతిరేకం గా పోరాడడం లో భారతదేశం యొక్క టీకాకరణ కార్యక్రమం గొప్ప శక్తి ని అందించిందని కూడా ఆయన అన్నారు.
MyGovIndia చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ అనేక ట్వీట్ లలో –
‘‘ఈ రోజు న మనం టీకాకరణ కార్యక్రమం లో #1 సంవత్సరాన్ని పూర్తి చేసుకొంటున్నాం.
టీకాకరణ కార్యక్రమం తో ముడిపడ్డ ప్రతి ఒక్క వ్యక్తి కి నేను నమస్కరిస్తున్నాను.
కోవిడ్-19 కి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి మన టీకాకరణ కార్యక్రమం గొప్ప శక్తి ని అందించింది. ఈ కార్యక్రమం ప్రాణాలను కాపాడడంలో తోడ్పడింది. అంతే కాదు ఈ కార్యక్రమం జీవనోపాధి మార్గాల ను కూడా పరిరక్షించింది.
అదే కాలం లో, మన డాక్టర్ లు, నర్స్ లు మరియు ఆరోగ్య సంరక్షణ శ్రమికులు పోషించినటువంటి పాత్ర అసాధారణమైనటువంటిదిగా ఉంది. సుదూర ప్రాంతాల లో ప్రజలు టీకామందు ను ఇప్పించుకొంటున్న సన్నివేశాల ను గాని లేదా అక్కడి మన ఆరోగ్య సంరక్షణ శ్రమికులు టీకామందు ను స్వీకరిస్తున్న సన్నివేశాల ను గాని మనం చూసినప్పుడు మన హృదయం మరియు మన మేధ గర్వం తో నిండిపోతాయి.
మహమ్మారి తో పోరాడటానికి భారతదేశం అనుసరించిన దృష్టికోణం ఎల్లప్పటికీ విజ్ఞానశాస్త్రం పై ఆధారపడి ఉంటుంది. మనం మన దేశ ప్రజలు సరి అయినటువంటి సంరక్షణ ను పొందేందుకు వీలు గా ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన ను పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాం కూడాను.
రండి, మనం అందరం కోవిడ్-19 ని దృష్టి లో పెట్టుకొని దానికి సంబంధించిన నియమ నిబంధనలను అన్నింటిని పాటిస్తూ ఉందాం, అలా చేయడం ద్వారా మహమ్మారి ని దూరం చేద్దాం.’’
అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1790388)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam