ప్రధాన మంత్రి కార్యాలయం
73 లక్షల సూర్య నమస్కారాల ఛాలెంజ్ ను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
14 JAN 2022 10:15PM by PIB Hyderabad
శారీరక దారుఢ్యాన్ని కలిగి ఉండాల్సిన ప్రాధాన్యతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. అలాగే 75 లక్షల సూర్యనమస్కారాల సవాలను ఆయన ప్రశంసించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు ప్రముఖ క్రీడాకారులతో 75 లక్షల సూర్యనమస్కారాల సవాలుకు సంబంధించి పంచుకున్న ట్వీట్ కు స్పందిస్తూ ప్రధానమంత్రి , ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మహమ్మారి,శారీరక దారుఢ్యం, రోగనిరోధక శక్తి పెంపునకు సంబంధించిన ప్రాధాన్యతను తెలియజెప్పిందని అన్నారు. ఈ దిశగా సాగుతున్న మంచి ప్రయత్నంగా ప్రధానమంత్రి దీనిని అభినందించారు.
ఇదే సమయంలో అందరూ కోవిడ్ -19 సంబంధిత ప్రొటోకాల్స్ ను పాటించాలని, మాస్కులు ధరించాలని, అర్హులైనవారందరూ వాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
(रिलीज़ आईडी: 1790181)
आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Kannada
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil