ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 15న స్టార్టప్ సంస్థలకు చెందిన వారితో సంభాషిస్తారు.
ఆరు థీమ్ లపై స్టార్టప్ లు ప్రధానమంత్రి ముందుప్రజెంటేషన్ ఇస్తాయి.
దేశంలో స్టార్టప్ వాతావరణాన్ని మరింత ముందుకుతీసుకువెళ్లేందుకు ప్రధాని సాగిస్తున్న నిరంతర ప్రయత్నంలో ఈ సంభాషణ ఒక భాగం.
Posted On:
14 JAN 2022 3:11PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 జనవరి 15 ఉదయం 10.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా స్టార్టప్ సంస్థలతో సంభాషించనున్నారు.
వ్యవసాయం, ఆరోగ్యం, ఎంటర్ ప్రైజ్ సిస్టమ్, అంతరిక్షం, పరిశ్రమ 4.0, భద్రత, ఫిన్ టెక్, పర్యావరణం తదితర స్టార్టప్ లు ప్రధానమంత్రి తో సమావేశంలో పాల్గొంటున్నాయి. 150 కిపైగా స్టార్టప్ లను ఆరు వర్కింగ్ గ్రూప్ లుగా వివిధ థీమ్ ల ఆధారంగా విభజించారు. మూలాల నుంచి వ్రుద్ధిలోకి వచ్చిన సంస్థలను , డిఎన్ ఎ నడ్జింగ్, లోకల్ టు గ్లోబల్, భవిష్యత్ కు సాంకేతికత, తయారీ రంగంలో ఛాంపియన్లను తయారుచేయడం, సుస్థిరాభివ్రుద్ధి వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రతి గ్రూపుప్రధానమంత్రి ముందు ఈ సమావేశంలో వారికి కేటాయించిన సమయంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. దేశంలో ఆవిష్కరణలు సాగిస్తూ స్టార్టప్ లు ఏ విధంగా జాతీయ అవసరాలకు ఏమేరకు తోడ్పడగలవన్న అంశంపై చర్చించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం.
ఆజాది కా అమ్రుతోత్సవ్ లో భాగంగా వారం రోజుల పాటు జరిగే సెలిబ్రేటింగ్ ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్ ను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన డిపి ఐఐటి 2022 జనవరి 10 నుంచి 16 వరకు నిర్వహిస్తుంది.
స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైన 6 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దేశ ప్రగతిలో స్టార్టప్ లు ఎంతో కీలకమని ప్రధానమంత్రి గట్టిగా విశ్వసిస్తారు. ఈ విశ్వాసంతోనే 2016లో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. దేశంలో స్టార్టప్ ల అభివ్రుద్ధి , ప్రగతికి అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించింది. దేశంలొో ఇది స్టార్టప్ వాతావరణంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపింది. ఇది దేశంలో యూనికార్న్ ల అద్భుత ప్రగతికి దోహదపడింది.
***
(Release ID: 1790180)
Visitor Counter : 218
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam