ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19: అపోహాలు మ‌రియు వాస్తవాలు


- 6 జనవరి 2022lన‌ జ‌రిగిన ఈసీఐ స‌మావేశం‌లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన వ్యాఖ్యలను త‌ప్పుగా ఆపాదించేలా మీడియా వెలువ‌డిన క‌థ‌నాలు పూర్తిగా తప్పుడువైన‌వి, నిరాధారమైనవి, తప్పుదారి పట్టించేవి

- ఈసీఐకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాప్తి & టీకా కవరేజ్ స్థితిని వివ‌రించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Posted On: 07 JAN 2022 10:41AM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మ‌రియు  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిన్న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)తో జరిగిన సమావేశంలో “దేశంలో కోవిడ్ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు” అని.. “శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సిన రాష్ట్రాల‌లో ఒమిక్రాన్ కేసులు  చాలా త‌క్కువ‌గా ఉండి ప్ర‌మాద‌క‌రంగా లేనందున ఆందోళన చేందాల్సిన ప‌ని లేదు”  అని సూచించినట్లు కొన్ని మీడియాల‌లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీనిని ప్ర‌భుత్వం ఖండించింది. ఇటువంటి మీడియా క‌థ‌నాలుచాలా అసహ్యకరమైనవి, తప్పుదారి పట్టించేవి, సత్యానికి దూరంగా ఉన్నాయి. ఇలాంటి మీడియా క‌థ‌నాలు మహమ్మారి మధ్యలో తప్పుడు సమాచార ప్రచారాన్ని ప్రారంభించడానికి చాలా ఎక్కువ ధోరణిని కలిగి ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈసీఐతో జరిగిన సమావేశంలో  మొత్తం ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా కోవిడ్‌ వ్యాప్తి యొక్క స్థితిని, అలాగే దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తికి సంబంధించిన స‌మాచారాన్ని అందించారు. పెరుగుతున్న కోవిడ్ కేసుల నియంత్రణ మరియు నిర్వహణ కోసం రాష్ట్రాలలో ప్రజారోగ్య ప్రతిస్పందన యొక్క సంసిద్ధత స్థితిపై కూడా త‌గిన వివరాలు సమర్పించబడ్డాయి. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఈసీఐతో జరిగిన సమావేశంలో ఇచ్చిన ప్రజెంటేష‌న్‌లో ప్ర‌ధానంగా శాస‌న స‌భ ఎన్న‌క‌లు జ‌ర‌గాల్సిన అయిదు రాష్ట్రాలు, వాటి ప‌క్క‌రాష్ట్రాల‌లోని ప‌రిస్థితులను గురించి వివ‌రించారు.
                                                   

 ****


(Release ID: 1788267) Visitor Counter : 160