ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌ లోని పాకూర్ లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి


బాధితులకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి పరిహారం విడుదలకు ఆమోదం

Posted On: 05 JAN 2022 8:55PM by PIB Hyderabad

జార్ఖండ్‌ లోని పాకూర్‌ లో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు రెండు లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున, పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి పరిహారం అందించనున్నట్లు, ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. 

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్లు చేసింది.  

“జార్ఖండ్‌ లోని పాకూర్‌ లో జరిగిన బస్సు ప్రమాదం పట్ల నేను ఆందోళన చెందాను.  ఈ విషాద సమయంలో, మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: PM@narendramodi”.

"పాకూర్ లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు రెండు లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున, పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుండి పరిహారం అందించడం జరుగుతుంది."

 

***

DS/AK

 

 


(Release ID: 1787912) Visitor Counter : 157