ప్రధాన మంత్రి కార్యాలయం

శాహ్ జహాన్ పుర్ లో గంగ ఎక్స్ ప్రెస్- వే కు డిసెంబర్ 18 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి


శీఘ్ర గతి తో కూడిన సంధానాన్ని దేశ మంతటా సమకూర్చాలి అనే ప్రధాన మంత్రిదార్శనికత యే దీనికి చోదక శక్తి గా ఉంది

మేరఠ్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకు, ఈ ఎక్స్ ప్రెస్- వే ఉత్తర్ ప్రదేశ్లోని 12 జిల్లాల గుండా సాగుతూ, ఆ రాష్ట్రం లోని పశ్చిమ మరియు తూర్పుప్రాంతాల ను కలుపుతుంది

36,200 కోట్ల రూపాయాల కు మించిన వ్యయం తో నిర్మాణం జరుగనున్న ఈ ఎక్స్ ప్రెస్- వే యుపి లో అతి పొడవైన ఎక్స్ ప్రెస్ వే కానుంది

శాహ్ జహాన్ పుర్ లో ఎక్స్ ప్రెస్- వే పై వాయు సేన విమానాలు దిగడానికి, ఇంకా అత్యవసరం గా నింగి కి ఎగరడానికితోడ్పడే 3.5 కి.మీ. పొడవైన ఎయర్ స్ట్రిప్ ను కూడా నిర్మించడం జరుగుతుంది

Posted On: 16 DEC 2021 2:12PM by PIB Hyderabad

గంగ ఎక్స్ ప్రెస్- వే నిర్మాణాని కి 2021వ సంవత్సరం డిసెంబర్ 18 న మధ్యాహ్నం ఒంటి గంట వేళ కు ఉత్తర్ ప్రదేశ్ లోని శాహ్ జహాన్ పుర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

శీఘ్ర గతి తో కూడిన సంధానాన్ని దేశమంతటా సమకూర్చాలి అన్న ప్రధాన మంత్రి దార్శనికత ఈ ఎక్స్ ప్రెస్- వే నిర్మాణాని కి ప్రేరణ గా ఉంది. 594 కిలో మీటర్ల మేర ఆరు దోవల తో కూడిన ఎక్స్ ప్రెస్- వే ను 36,200 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మించడం జరుగుతుంది. మేరఠ్ లోని బిజౌలీ గ్రామ సమీపం లో ఆరంభం అయ్యే ఈ ఎక్స్ ప్రెస్- వే ప్రయాగ్ రాజ్ లోని జుదాపుర్ దాండూ గ్రామం సమీపం వరకు విస్తరించి ఉంటుంది. అది మేరఠ్, హాపుడ్, బులంద్ శహర్, అమ్ రోహా, సంభల్, బదాయూఁ, శాహ్ జాహన్ పుర్, హర్ దోయీ, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్ గఢ్, ఇంకా ప్రయాగ్ రాజ్ ల గుండా సాగుతుంది. దీని నిర్మాణ పనులు పూర్తి అయిన మీదట ఇది ఉత్తర్ ప్రదేశ్ లోని రాష్ట్రం లోని పశ్చిమ ప్రాంతాన్ని, తూర్పు ప్రాంతాన్ని కలిపేటటువంటి అతి పొడవైన ఎక్స్ ప్రెస్- వే గా అవుతుంది. వాయు సేన విమానాలు దిగడాని కి, అత్యవసరమైనప్పుడు నింగి కి ఎగరడానికి సాయపడేందుకు 3.5 కిలోమీటర్ ల పొడవు తో ఓ ఎయర్ స్ట్రిప్ ను కూడా శాహ్ జహాన్ పుర్ లో ఎక్స్ ప్రెస్ వే లో భాగం గా నిర్మించడం జరుగుతుంది. ఎక్స్ ప్రెస్- వే వెంబడి ఒక పారిశ్రామిక కారిడార్ ను సైతం నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నది.

పారిశ్రామిక అభివృద్ధి, వ్యాపారం, వ్యవసాయం, పర్యటన సహా ఇంకా అనేక రంగాల కు ఈ ఎక్స్ ప్రెస్- వే ఒక ఉత్తేజాన్ని కూడా అందిస్తుంది. ఇది ఆ ప్రాంతం లో సామాజిక అభివృద్ధి కి, ఆర్థిక అభివృద్ధి కి ఒక పెద్ద దన్ను గా నిలువగలదు.

 

***



(Release ID: 1782271) Visitor Counter : 158