ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ప్రజల జీవితాల్లో పరివర్తన లక్ష్యంగా డిజిటల్ ఇండియా సేవలు!

-ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్- కార్యక్రమంలో
కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన...

వారంరోజుల పాటు సాగనున్న వేడుకలు..

ఉమంగ్ సేవల బట్వాడాపై విధాన ప్రకటన...


డిజిటల్ ఇండియా 75 విజయగాథలపై ఈ-బుక్ ఆవిష్కరణ..
75ఏళ్ల కృత్రిమ మేధో పయనంపై వీడియో విడుదల..

Posted On: 29 NOV 2021 2:09PM by PIB Hyderabad

   వారం రోజులపాటు జరిగే ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమం ఈ నెల 29న న్యూఢిల్లీలో ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని హ్యాబిటెట్ సెంటర్.లో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్.ప్రెన్యూర్ షిప్ శాఖల సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీ, అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్, జాతీయ సాఫ్ట్.వేర్, సర్వీస్ కంపెనీల సంఘం (నాస్.కామ్) అధ్యక్షురాలు దేవ్.జానీ ఘోష్, ప్రభుత్వ,. ప్రజా భాగస్వామ్య వేదిక మైగవ్, నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ (ఎన్.ఇ.జి.డి.) సి.ఇ.ఒ. అభిషేక్ సింగ్త్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

 

https://ci6.googleusercontent.com/proxy/onm2ittHup7RAfHqkK7gskFn0AsH81dqeuaUdvpqc3H0XFsLjgalpBS_PZ7pXXH-OsJzpqs_2AvtkQYTys2BPCd8-4pccP3_fM2Q_1JS5EgQvjuRuX6fDffwOA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OW35.jpg

https://ci5.googleusercontent.com/proxy/Hh4b0wbnUReFVFkcmXVnrxidwqHBai4sVWnsw_0AdnnKOb1fjo7DaQp4beT4XBksFs-giyLSc2b-TeG3QWVb3AMxJ-RkC61JXs8n7XP600aiinODi-yAXD0S9g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029MXV.jpg

  ప్రారంభోత్సవంలో రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 2021వ సంవత్సరం చెప్పుకోదగినదని, డిజిటల్ మౌలిక సదుపాయాలను, డిజిటల్ సేవలను అందించగలగిన సత్తా తనకు ఉందని డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత్ ఈ ఏడాది రుజువు చేసుకుందని అన్నారు. కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం తర్వాత కూడా, ప్రపంచంలో దేశం మరింత ఆత్మవిశ్వాసంతో, ఆశాభావంతో కనిపిస్తోందన్నారు. ప్రజల జీవితాల్లో పరివర్తన తీసుకురావడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు రూపకల్పన చేయడం తదితర విషయాల్లో డిజిట్ ఇండియా కార్యక్రమం ఎన్నో సేవలందించిందని అన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్తులో ప్రజల ఆశయాలు తదతర అంశాలను దృష్టిలో పెట్టుకుని, ఆరు అంశాల్లో చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని కేంద్రమంత్రి చెప్పారు. అందరికీ సాంకేతిక అనుసంధానం కల్పించడం, ప్రభుత్వ సేవలను, ఉత్పాదనలన్నింటినీ డిజిటలీకరించడం, ట్రిలియన్ డాలర్ల స్థాయికి భారతీయ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్లడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ ప్రమాణాలతో నిబంధనలను రూపొదించడం తదితర చర్యలు తీసుకోవలసి ఉందన్నారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్.కా ప్రయాస్ వంటి నినాదాల స్ఫూర్తితో మనం పనిచేయాలన్నారు.

   కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ సాహ్నీ మాట్లాడుతూ,..సాధించిన విజయాలకు మనం వేడుకలు చేసుకోవలసిన తరుణం ఇదేనని, అలాగే, నూతన భారతదేశం లక్ష్యంగా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించుకోవలసిన సమయం కూడా ఇదేనని అన్నారు. దేశంలో ఎన్నో డిజిటల్ సేవలు ప్రస్తుతం అమలులోకి వచ్చాయని, సామాజిక రంగాలకు సంబంధించిన పథకాలను పారిశ్రామిక రంగం భాగస్వామ్యంతో దేశవ్యాప్త డిజిటల్ వేదికలపై అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

   మైగవ్., ఎన్.ఇ.జి.డి. సంస్థల సి.ఇ.ఒ. అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికోసం తీసుకున్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు. దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు సేవలందించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డిజిటల్ పరిజ్ఞానంపై ప్రస్తుతం తీసుకునే చర్యలకు, భవిష్యత్తులో అమలుచేసే డిజిటల్ కార్యక్రమాలకు మార్గదర్శక శక్తిగా పనిచేయడమే డిజిటల్ ఇండియా పథకం ఉద్దేశమని, ఈ  లక్ష్యాన్ని సాకారం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ పేరిట వారం రోజులపాటు నిర్వహించే వేడుకల్లో ఏడు రోజుల కార్యక్రమాలను ఆయన క్లుప్తంగా వివరించారు. డిజిటల్ ఇండియా, ప్రజా వేదికలు, వివిధ రాష్ట్రాలు తీసుకున్న చర్యలు, కృత్రిమ మేధో పరిజ్ఞానంతో పాటుగా ఆవిర్భవిస్తున్న సాంకేతిక విజ్ఞానం, స్టార్టప్ హబ్.గా కేంద్ర ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్ తయారీలో భారతదేశాన్ని ఆత్మనిర్భర దేశంగా తీర్చిద్దడం, కామన్ సర్వీస్ సెంటర్ల (సి.ఎస్.సి.ల) ద్వారా పౌరులకు సాధికారత, స్వదేశీ మైక్రో ప్రాసెసర్లు, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్, మైగవ్, డిజిటల్ పేమెంట్ ఉత్సవ్ ద్వారా పౌరులకు ప్రమేయం కల్పించడం తదితర అంశాలపై ఈ వారం రోజుల్లో నిర్వహించబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు. 50 స్టాళ్లతో కూడిన ఎగ్జిబిషన్.ను ప్రారంభించారని, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పది అగ్రశ్రేణి బృందాలు కృత్రిమ మేధో పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను ప్రదర్శిస్తున్నాయని అభిషేక్ సింగ్ తెలిపారు.

  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ,..ప్రపంచ డిజిటల్ పరిజ్ఞాన రంగంలో భారతదేశం చోటు సంపాదించిందని, ప్రపంచంలో ఎక్కువ మొబైళ్లు తయారు చేసే దేశంగా నిలిచిందని అన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశాన్ని ఆత్మనిర్భర భారత్.గా తీర్చిదిద్దేందుకు కృషి జరగాల్సి ఉందన్నారు. కృత్రిమ మేధో పరిజ్ఞానం, 5-జి వంటి కొత్తతరహా సాంకేతిక పరిజ్ఞాన అంశాల్లో, సైబర్ భద్రత విషయంలో ప్రగతిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. సమాచార వ్యవస్థ పరిరక్షణ కోసం పటిష్టమైన న్యాయపరమైన యంత్రాగాన్ని రూపొందించుకోవాలన్నారు.  

  నాస్.కామ్ అధ్యక్షురాలు దేవ్.జానీ ఘోష్ మాట్లాడుతూ,  సమ్మిళిత అభివృద్ధి దిశగా, సాంకేతిక పరిజ్ఞానపరంగా భారతదేశం సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంటే అసలు సిసలు అర్థమేమిటో భారతదేశం ప్రపంచానికి చాటిచెప్పిందని ఆమె అన్నారు. సమ్మిళిత అభివృద్ధి, ప్రజాహితం కోసం టెక్నాలజీ తదితర అంశాలను ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు.

  ఆజాదీ కా  డిజిటల్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో డిజిటల్ ఇండియా పేరిట 75 విజయ గాథలతో కూడిన ఎలక్ట్రానిక్. బుక్.ను (ఈ-బుక్.ను) ఆవిష్కరించారు. డిజిటల్ ఇండియా పథకం విజయాలపై ఒక చలన చిత్రాన్ని ప్రదర్శించారు. 75@75 పేరిట కృత్రిమ మేధో పరిజ్ఞానంపై వీడియోను కూడా ప్రారంభించారు. ఉమంగ్ సేవల బట్వాడాపై ఒక విధానాన్ని ప్రకటించారు. ప్రారంభోత్సవ సదస్సుకు ముందస్తుగా, దాదాపుగా 50 స్టాళ్లతో కూడిన ఎగ్జిబిషన్ హాళ్లను ప్రారంభించారు. ప్రభుత్వ సంస్థలు, వివిధ స్టార్టప్ కంపెనీల వివిధ కార్యక్రమాలను వివరిస్తూ ఈ స్టాళ్లను ఏర్పాటు చేశారు.

 మొత్తం కార్యక్రమానికి సంబంధించిన అజెండా వివరాలను ఈ లింకు ద్వారా చూడవచ్చు. https://amritmahotsav.negd.in/

డిజిటల్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వేడుకలను ప్రత్యక్షంగా ప్రసారం చేశారు: https://www.youtube.com/DigitalIndiaofficial/

 

*****



(Release ID: 1776268) Visitor Counter : 185