ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్రామీణ పర్యటన కు ప్రోత్సాహాన్నిఇచ్చినందుకు గాను తన గౌరవార్థం ప్రత్యేక స్వరాన్నికూర్చిన కోంగ్‌ థోంగ్ ప్రజల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2021 12:03PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన గౌరవార్థం, అలాగే గ్రామాని కి ప్రముఖ పర్యటన స్థలం గా ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రయాసల ను ప్రశంసిస్తూ కోంగ్ థోంగ్ గ్రామ ప్రజలు ఒక ప్రత్యేక స్వరాన్ని కూర్చినందుకు కృతజ్ఞతల ను వ్యక్తం చేశారు.

మేఘాలయ ముఖ్యమంత్రి ట్వీట్‌ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ -

“ఈ వినమ్ర భావ ప్రదర్శన కు గాను కోంగ్‌ థోంగ్‌ ప్రజల కు ఇవే నా కృతజ్ఞత లు. మేఘాలయ యొక్క పర్యటన సామర్థ్యాన్ని మరింతగా పెంచడం కోసం భారత ప్రభుత్వం కంకణం కట్టుకొంది. ఆఁ ఔను మరి.. ఇటీవల రాష్ట్రం నిర్వహించిన చెరీ బ్లాసమ్ మహోత్సవం తాలూకు అద్భుతమైన ఛాయాచిత్రాల ను కూడా చూశాను నేను. అవి భలే సుందరం గా ఉన్నాయి సుమా.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1776018) సందర్శకుల సూచీ సంఖ్య : : 154
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam