ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తర్ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి; నవంబర్ 19న ఝాంసీ లో ‘రాష్ట్ర రక్షా సమర్పణ్ పర్వ్’ సందర్బం లో రక్షణ రంగం లో ఆత్మనిర్భర్ భారత్ కు గణనీయమైనటువంటిప్రోత్సాహాన్ని ఆయన అందించనున్నారు


దేశీయం గారూపుదిద్ది, అభివృద్ధిపరచిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ను, డ్రోన్ లను మరియు నౌకా దళాని కి చెందిన నౌక ల కోసం ఉన్నతీకరించిన ఎలక్ట్రానిక్వార్ ఫేర్ స్వీట్ ను ఆర్మ్ డ్ ఫోర్సెస్ సర్వీస్ చీఫ్ లకు ప్రధాన మంత్రి లాంఛనం గా అప్పగిస్తారు

యాంటీ-ట్యాంక్గైడెడ్ మిస్సైల్స్ కోసం ప్రపల్శన్ సిస్టమ్స్ ను ఉత్పత్తి చేయడానికి గాను ఉత్తర్ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్  కారిడార్ లోని ఝాంసీ నోడ్ లో 400 కోట్లరూపాయల విలువైన ఒక ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శంకు స్థాపన చేయనున్నారు

ఇదివరకు ఎన్సిసి కేడెట్ గా ఉన్న ప్రధాన మంత్రి ని తాజాగా ప్రారంభిస్తున్న ఎన్ సిసి పూర్వవిద్యార్థి సంఘం లో ఒకటో సభ్యుని గా చేర్చుకోనున్నారు

జాతీయ యుద్ధస్మారకం లో అమరవీరుల కు వర్చువల్ పద్ధతి లో శ్రద్ధాంజలి ఘటించడం కోసం ఏర్పాటుచేసిన ఒక సదుపాయాన్ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేస్తారు

Posted On: 17 NOV 2021 2:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబర్ 19 న ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాంసీ ని సందర్శించనున్నారు. ఆ రోజు రమారమి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల కు రాష్ట్ర రక్షా సమర్పణ్ పర్వ్లో భాగం గా రక్షణ రంగం తాలూకు అనేక కార్యక్రమాల ను ఆయన ప్రారంభించి, దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఝాంసీ లో నవంబర్ 17 నుంచి 19 వ తేదీ ల మధ్య ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేడుకల లో భాగం గా నిర్వహించడం జరుగుతోంది.

రక్షణ రంగం లో ఆత్మనిర్భర భారత్ కు ప్రోత్సాహాన్ని అందించడం కోసం, దేశీయం గా రూపొందించినటువంటి మరియు అభివృద్ధి పరచినటువంటి ఉపకరణాల ను ఆర్మ్ డ్ ఫోర్సెస్ సర్వీస్ చీఫ్ కు ప్రధాన మంత్రి లాంఛనం గా అప్పగించనున్నారు. వీటిలో హిందుస్తాన్ ఎయరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) తీర్చిదిద్దిన తేలికపాటి పోరాట హెలికాప్టరు (ఎల్ సిహెచ్) ను వాయు సేన ప్రధానాధికారి కి; భారతదేశ స్టార్ట్-అప్ స్ తీర్చిదిద్దిన డ్రోన్ లు/యుఎవి లను సైన్య దళం ప్రధానాధికారి కి అందజేయడం జరుగుతుంది. ఇక డిఆర్ డిఒ డిజైన్ చేయగా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) తయారు చేసిన అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ స్వీట్ ను నౌకా దళం ప్రధానాధికారి కి అందజేయడం జరుగుతుంది. ఎల్ సిహెచ్ కు ఆధునిక సాంకేతికతల ను, స్టెల్థ్ తరహా ప్రత్యేకతల ను జత చేయడమైంది. భారతదేశం సాయుధ దళాల లో దేశీయ యుఎవి లను మోహరించడం అనేది భారతదేశం లో డ్రోన్ పరిశ్రమ ఇకోసిస్టమ్ ఎంత వేగం గా పరిణతి చెందుతోందో వెల్లడించే ఒక ప్రమాణం గా ఉన్నది. అడ్వాన్స్ డ్ ఇడబ్ల్యు స్వీట్ ను డిస్ట్రాయర్ లు, యుద్ధ నావ లు సహా నౌకాదళాని కి చెందిన వేరు వేరు నౌకల లో ఉపయోగించనున్నారు.

ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లోని ఝాంసీ నోడ్ లో 400 కోట్ల రూపాయల విలువైన ఒక ప్రాజెక్టు కు శంకుస్థాపన చేస్తారు. యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ కు ఉద్దేశించిన ప్రపల్శన్ సిస్టమ్స్ ను ఉత్పత్తి చేయడానికి గాను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అండదండల తో ఈ ప్రాజెక్టు ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

ప్రధాన మంత్రి ఎన్ సిసి పూర్వ విద్యార్థుల సంఘాన్ని ప్రారంభించనున్నారు. ఎన్ సిసి పూర్వ విద్యార్థుల ను ఎన్ సిసి తో తిరిగి జోడించడం కోసం ఒక లాంఛన ప్రాయమైనటువంటి వేదిక ను సమకూర్చడమే ఈ సంఘం స్థాపన వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఈ సంఘం ఎన్ సిసి యొక్క ధ్యేయాల ను మరింత ముందుకు తీసుకు పోనుంది. అంతేకాక, దేశ నిర్మాణం లో సహాయ పడుతుంది కూడాను. ఎన్ సిసి లో ఇదివరకు ఒక కేడెట్ గా వ్యవహరించినటువంటి ప్రధాన మంత్రి ని ఈ అసోసియేశన్ లో ప్రథమ సభ్యుని గా చేర్చుకోనున్నారు.

ఎన్ సిసి కి చెందిన మూడు విభాగాల కోసం సిమ్యులేశన్ సంబంధి శిక్షణ సదుపాయాల స్థాయి ని పెంచాలన్న ఉద్దేశ్యం తో ఎన్ సిసి కేడెట్ ల కోసం నిర్వహించనున్న నేశనల్ ప్రోగ్రామ్ ఆఫ్ సిమ్యులేశన్ ట్రైనింగ్ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఎన్ సిసి యొక్క సైన్య విభాగం కోసం రైఫిల్ ఫైరింగ్ సిమ్యులేటర్ లను ఏర్పాటు చేయడం, వాయు విభాగం కోసం మైక్రోలైట్ ఫ్లయింగ్ సిమ్యులేటర్ లను ఏర్పాటు చేయడం, అలాగే నౌకాదళ విభాగం కోసం రోయింగ్ సిమ్యులేటర్ లను స్థాపించడం వంటివి దీనిలో భాగం గా ఉన్నాయి.

ప్రధాన మంత్రి జాతీయ యుద్ధ స్మారకం లో ఆగ్ మెంటెడ్ రియాలిటీ పవర్ డ్ ఎలక్ట్రానిక్ కియోస్క్ లను దేశ ప్రజల కు అంకితం చేస్తారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించే వారు ఒక బటన్ ను నొక్కినంత మాత్రాననే అమరవీరుల కు పుష్పాంజలి ని ఘటించే అవకాశాన్ని ఈ కియోస్క్ లు కల్పించనున్నాయి.

***


(Release ID: 1772655) Visitor Counter : 166