ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీశివ్ శాహీర్  బాబాసాహెబ్  పురందరే  కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 NOV 2021 10:17AM by PIB Hyderabad

రచయిత, చరిత్రకారుడు, రంగస్థల ప్రముఖుడు శ్రీ శివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ఆయన రాబోయే తరాలవారి ని ఛత్రపతి శివాజీ మహారాజ్ తో జతపరచడం లో శ్రీ శివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే తోడ్పాటు ను గుర్తు కు తెచ్చుకున్నారు. శ్రీ నరేంద్ర మోదీ కొన్ని నెలల కిందట ఆయన శతాబ్ది సంవత్సరాల సంబంధి కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగాన్ని కూడా పోస్ట్ చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో

‘‘నాకు కలిగిన బాధ మాటల లో వ్యక్తం చేయలేనటువంటిది గా ఉంది. శ్రీ శివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర మరియు సంస్కృతి రంగాల లో ఓ పెద్ద లోటు ఏర్పడిపోయింది. ఆయన తోడ్పాటు కు గాను ధన్యవాదాలు; ఈ తోడ్పాటు కారణం గా భావి తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ తో మరింత అనుబంధాన్ని ఏర్పరచుకొంటాయి. వారి ఇతర తోడ్పాటుల ను కూడా స్మరించుకోవడం జరుగుతుంది.

శ్రీ శివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే వేకవంతులు. ఆయన చమత్కారి కూడాను; ఆయన కు భారతదేశం చరిత్ర ను గురించి చాలా బాగా తెలుసును. ఏళ్ల తరబడి నాకు ఆయన తో కలసి చాలా సమీపం నుంచి మాటామంతీ జరిపే గౌరవం దక్కింది. కొన్ని నెల ల క్రితం ఆయన శతాబ్ది సంవత్సర సంబంధి కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ప్రసంగించాను.

శ్రీ శివ్ శాహీర్ బాబాసాహెబ్ పురందరే తన యొక్క విస్తృత కార్యాల కారణం గా జీవించే ఉంటారు. ఈ దు:ఖ ఘడియ లో ఆయన కుటుంబాని కి. ఆయన అసంఖ్యాక అభిమాన వర్గాల కు కలిగిన వేదన లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1772006) Visitor Counter : 144