ప్రధాన మంత్రి కార్యాలయం
జి-20 శిఖరాగ్రం సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశం
Posted On:
30 OCT 2021 10:55PM by PIB Hyderabad
జి-20 నాయకుల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇటలీలోని రోమ్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య 2021 అక్టోబర్ 30వ తేదీన ద్వైపాక్షిక సమావేశం జరిగింది.
భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి చెందిన పలు అంశాలపై ఉభయ దేశాల నాయకులు సంతృప్తి ప్రకటించారు.
యూరోపియన్ యూనియన్ 2021 సెప్టెంబరులో విడుదల చేసిన ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని ప్రధానమంత్రి స్వాగతిస్తూ ఇందుతో ఫ్రాన్స్ పోషించిన నాయకత్వ పాత్రకు ధన్యవాదాలు తెలిపారు. ఇండో-పసిఫిక్ సహకారానికి నాయకులిద్దరూ కట్టుబాటును పునరుద్ఘాటిస్తూ ఆ ప్రాంతంలో బహిరంగమైన, స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత వ్యవస్థ కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని నిర్ణయించారు.
మరి కొద్ది రోజుల్లో జరగబోతున్న సిఓపి26 సదస్సు గురించి కూడా ఉభయులు చర్చించారు. వాతావరణ ఫైనాన్స్ వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్న అవసరం నొక్కి చెప్పారు.
వీలైనంత త్వరగా అవకాశం చూసుకుని భారతదేశాన్ని సందర్శించాలని అధ్యక్షుడు మాక్రాన్ ను ప్రధానమంత్రి ఆహ్వానించారు.
***
(Release ID: 1768375)
Visitor Counter : 138
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam