ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సింగపూర్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 30 OCT 2021 9:36PM by PIB Hyderabad

 

జి -20 శిఖర సమ్మేళనం 2021వ సంవత్సరం అక్టోబర్ 30న రోమ్ లోని ఇటలీ లో జరిగిన నేపథ్యం లో, సింగపూర్ ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.
మహమ్మారి అనంతర కాలం లో, ఇది వారి మధ్య జరిగిన ఒకటో ముఖాముఖి సమావేశం. జలవాయు పరివర్తన తో పోరాడడం కోసం జరుగుతూ ఉన్న ప్రపంచ ప్రయాసల గురించి, త్వరలో జరుగనున్న సిఒపి26 గురించి నేతలు ఇద్దరు చర్చించారు.  ప్రజల కు శీఘ్రం గా టీకామందు ను ఇప్పించడం తో పాటు కీలకమైనటువంటి మందులు సరఫరా అయ్యేటట్టు చూడడం ద్వారా కోవిడ్-19 మహమ్మారి ని అదుపు చేయడం కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయాసల ను గురించి కూడా వారు చర్చించారు.  ఈ సందర్భం లో ప్రధాన మంత్రి సెకండ్ వేవ్ కాలం లో భారతదేశానికి కోవిడ్ సంబంధి సహాయాన్ని అందజేయడం కోసం సింగపూర్ చేయూత ను అందించడాన్ని మెచ్చుకొన్నారు. ప్రధాని శ్రీ లీ సియెన్ లూంగ్ భారతదేశం లో టీకామందు ను ఇప్పించే కార్యక్రమాన్ని జోరు గా కొనసాగిస్తున్నందుకు గాను ప్రధానమంత్రి కి అభినందన లు తెలిపారు.
ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాల ను మెరుగుపరచడానికి అనుసరించవలసిన మార్గాలను గురించి కూడా వారు చర్చించారు. ఈ సందర్భం లో ఇరు దేశాల నడుమ రాకపోకల ను త్వరలో సామాన్య స్థితి కి పునరుద్ధరించడం కూడా ప్రస్తావన కు వచ్చింది.

 

***


(Release ID: 1768127) Visitor Counter : 200