ఆర్థిక మంత్రిత్వ శాఖ

పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ , ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌ లో సంస్కరణల దిశగా మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక కార్యదర్శి డా. టీవీ సోమనాథన్.


పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్, ప్రాజెక్ట్‌ల వేగవంతమైన, సమర్థవంతమైన మరియు పారదర్శక అమలు కోసం వినూత్న నియమాల పరిధిలోకి చేర్చడానికి మార్గదర్శకాలు ఉంటాయి.

Posted On: 29 OCT 2021 5:17PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక కార్యదర్శి & వ్యయ కార్యదర్శి డా. టీవీ సోమనాథన్ ఈరోజు జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో సంస్కరణలను తీసుకురావడానికి మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రస్తుత నియమాలు మరియు విధానాలను నిరంతరం సమీక్షించే ప్రక్రియలో భాగంగా మార్గదర్శకాలను రూపొందించడం, విడుదల చేయడం జరిగింది. ఇది 2 అక్టోబర్ 2021 నుండి 31 అక్టోబర్ 2021 వరకు ప్రత్యేక ప్రచారం సందర్బంగా క్యాబినెట్ సెక్రటరీ పర్యవేక్షణ చేస్తారు. 


పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లోని వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కూడిన వివరణాత్మక సంప్రదింపు ప్రక్రియ తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) ఆధ్వర్యంలో మార్గదర్శకాల ముసాయిదా తయారు చేయడం జరిగింది. మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్ల వ్యాఖ్యలను అభ్యర్థించి, వివరణాత్మకంగా పరిశీలించిన తర్వాత మార్గదర్శకాలను జారీ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖర్చుల విభాగం (డిఓఈ) నామినేట్ అయింది.


ఈ మార్గదర్శకాలు భారతదేశంలో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ రంగంలోకి చేర్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రాజెక్ట్‌ల వేగవంతమైన, సమర్థవంతమైన మరియు పారదర్శక అమలు కోసం వినూత్న నియమాలు రూపొందాయి. ప్రజా ప్రయోజనాల కోసం త్వరితగతిన మరియు మరింత సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవడానికి కార్యనిర్వాహక సంస్థలను శక్తివంతం చేస్తాయి. కొన్ని మెరుగుదలలు గడువులోగా చెల్లింపుల కోసం ఖచ్చితమైన టైమ్‌లైన్‌లను నిర్దేశించడం కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్‌లతో ప్రత్యేకించి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) లిక్విడిటీని మెరుగుపరచడానికి తాత్కాలిక చెల్లింపులను సకాలంలో విడుదల చేయడం (70% లేదా అంతకంటే ఎక్కువ బిల్లులు) అంచనా వేయబడింది.


ప్రభుత్వ డిజిటల్ ఆలోచనల్లో భాగంగా, పనుల పురోగతిని రికార్డ్ చేయడానికి ఎలక్ట్రానిక్ మెజర్‌మెంట్ పుస్తకాలను సిఫార్సు చేసారు. ఈ వ్యవస్థ, మార్గదర్శకాలలో ప్రతిపాదించబడిన ఇతర ఐటీ ఆధారిత పరిష్కారాలతో పాటు, సమర్థవంతమైన డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడంలో, కాంట్రాక్టర్లకు వేగవంతమైన చెల్లింపులను సులభతరం చేయడంలో మరియు వివాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

 
కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ప్రత్యామ్నాయ పద్ధతులను అనుమతించారు, ఇవి ప్రాజెక్ట్‌ల అమలులో వేగం, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. సముచితమైన సందర్భాలలో, సాంప్రదాయ ఎల్1 సిస్టమ్‌కు ప్రత్యామ్నాయంగా, నాణ్యత ఖర్చు ఆధారిత ఎంపిక (క్యూసిబిఎస్) ద్వారా ప్రతిపాదనను పారదర్శకంగా మరియు న్యాయమైన పద్ధతిలో మూల్యాంకనం చేసేటప్పుడు నాణ్యతా పారామితులకు వెయిటేజీ ఇవ్వవచ్చు. పబ్లిక్ ప్రాజెక్ట్‌లను సకాలంలో, ఆమోదించిన ఖర్చులో, మంచి నాణ్యతతో అమలు చేయడం ఎల్లప్పుడూ సవాలుగా ఉంది. 


ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకున్నందున, అనవసరమైన అడ్డంకులు తొలగుతాయని, పన్నుచెల్లింపుదారుల డబ్బును పెంచడానికి కొత్త ఆవిష్కరణలు ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడానికి విధానాలు, నియమాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి), కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (కాగ్), నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి) ఆయోగ్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోసం విధానాలు, మరియు నియమాలపై వివరణాత్మక విశ్లేషణను నిర్వహించాయి మరియు ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవటానికి వ్యూహాలలో మార్పులను సూచించాయి. 


పబ్లిక్ ప్రాజెక్ట్‌లను సకాలంలో, ఆమోదించబడిన ఖర్చులో మరియు మంచి నాణ్యతతో అమలు చేయడం ఎల్లప్పుడూ సవాలుగా ఉంది. ఆర్థిక అభివృద్ధి వేగం పుంజుకున్నందున, అనవసరమైన రోడ్‌బ్లాక్‌లు తొలగించబడతాయని మరియు పన్ను చెల్లింపుదారుల డబ్బు విలువను పెంచడానికి కొత్త ఆవిష్కరణలు ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడానికి విధానాలు మరియు నియమాలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం.


సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ (సీవీసీ), కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (కాగ్), నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి) ఆయోగ్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కోసం విధానాలు మరియు నియమాలను సవివరంగా విశ్లేషించి, వ్యూహాలలో మార్పులను సూచించాయి. ప్రస్తుత మరియు భవిష్యత్ ప్రజా సేకరణ సవాళ్లను ఎదుర్కోవాలి.

ఆర్డర్ లింక్:
https://doe.gov.in/divisions/general-instructions-procurement-and-project-management
****

 



(Release ID: 1767551) Visitor Counter : 231